Loading date... | Loading Hijri date... | Loading time...

العاديات

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా![1]
[1] 'దబ్'హన్: వగర్చుతూ.
وَٱلْعَٰدِيَٰتِ ضَبْحًۭا. ﴿1﴾
2 తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;[1]
[1] అల్-మారియాతు: అగ్నికణాలు లేపే! ఖద్'హున్: ఖరాల తట్టులు.
فَٱلْمُورِيَٰتِ قَدْحًۭا. ﴿2﴾
3 తెల్లవారుఝామున దాడి చేసేవాటి;[1]
[1] అల్-ము'గీరాతు: దాడి చేసేవాటి.
فَٱلْمُغِيرَٰتِ صُبْحًۭا. ﴿3﴾
4 (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;[1]
[1] అసా'ర: లేపుట, నఖ్'వున్: దుమ్ము.
فَأَثَرْنَ بِهِۦ نَقْعًۭا. ﴿4﴾
5 (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి. فَوَسَطْنَ بِهِۦ جَمْعًا. ﴿5﴾
6 నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.[1]
[1] కనూదున్: అంటే కఫూరున్, కృతఘ్నుడు.
إِنَّ ٱلْإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌۭ. ﴿6﴾
7 మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి. وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌۭ. ﴿7﴾
8 మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు. وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ. ﴿8﴾
9 ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;[1]
[1] అంటే గోరీలలో ఉన్న శవాలను సజీవులుగా చేసి లేపి సమావేశపరచబడినప్పుడు.
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ. ﴿9﴾
10 మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు; وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ. ﴿10﴾
11 నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని! إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍۢ لَّخَبِيرٌۢ. ﴿11﴾