القارعة
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం![1]
[1] అల్-'ఖారిఅతు: అంటే హృదయాలను అదరగొట్టేది, పునరుత్థాన దినపు పేర్లలో ఒకటి. చూడండి, 14:48, 20:105-107. దాని ఇతర పేర్లు (1) అల్-'హాఖ్ఖతు, (2) అత్తామ్మతు, (3) అస్సాఖ్ఖతు, (4) అల్-'గాషియతు, (5) అస్సా'అతు (6) అల్-వాఖి'అతు; (7) అల్-ఖారి'అతు.
|
ٱلْقَارِعَةُ. ﴿1﴾ |
| 2 ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? | مَا ٱلْقَارِعَةُ. ﴿2﴾ |
| 3 మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు? | وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ. ﴿3﴾ |
|
4
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.[1]
[1] అల్-ఫరాషు: Moath, Lepidoptira రాత్రులలో తిరిగే చిన్న పురుగు, చిమ్మెట, దీపపు పురుగు.
|
يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ. ﴿4﴾ |
|
5
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.[1]
[1] చూఅల్-'ఇహ్ నున్: రంగురంగుల అల్-మన్ ఫూష్: ఏకిన దూది.
|
وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ. ﴿5﴾ |
|
6
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో![1]
[1] చూడండి, 7:8, 18:105, 21:47 సత్కార్యాల త్రాసు పళ్ళెం బరువైనదిగా ఉంటుంది.
|
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ. ﴿6﴾ |
| 7 అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు. | فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ. ﴿7﴾ |
|
8
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో![1]
[1] ఎవరి సత్కార్యాల పళ్ళెం తేలికగా మరియు పాపాల పళ్ళెం బరువుగా ఉంటుందో!.
|
وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ. ﴿8﴾ |
|
9
అతని నివాసం అధః పాతాళమే.[1]
[1] అల్-హావియహ్: నరకపు ఒక పేరు. ఉమ్మున్: తల్లి, శరణమిచ్చేది.
|
فَأُمُّهُۥ هَاوِيَةٌۭ. ﴿9﴾ |
| 10 మరియు అది ఏమిటో నీకేం తెలుసు? | وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ. ﴿10﴾ |
|
11
అదొక భగభగమండే అగ్ని (గుండం).[1]
[1] 'హామియతున్: 'నరకాగ్ని. మానవులు రగిల్చే అగ్ని కంటే నరకాగ్ని డెబ్భై రెట్లు అధికంగా మండుతూ ఉంటుంది, ('స. బు'ఖారీ, 'స. ముస్లిం).
|
نَارٌ حَامِيَةٌۢ. ﴿11﴾ |