التكاثر
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;[1]
[1] అల్ హా (యుల్ హీ): ఏమరుపాటులో వేసింది. తకాసు'రున్: ఎక్కువ పొందాలనే పేరాస అంటే ధనధాన్యాల కొరకు, పిల్లల కొరకు, బలం, ప్రభుత్వం, పేరు ప్రతిష్టల కొరకు చేసే పేరాస.
|
أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ. ﴿1﴾ |
|
2
మీరు గోరీలలోకి చేరే వరకు.[1]
[1] ఆ పేరాస కోసం ప్రయత్నిస్తూనే మీరు గోరీలలోకి చేరి పోతారు.
|
حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ. ﴿2﴾ |
| 3 అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు. | كَلَّا سَوْفَ تَعْلَمُونَ. ﴿3﴾ |
|
4
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.[1]
[1] ఈ పేరాస మంచిది కాదని.
|
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ. ﴿4﴾ |
| 5 ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు). | كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ. ﴿5﴾ |
| 6 నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! | لَتَرَوُنَّ ٱلْجَحِيمَ. ﴿6﴾ |
| 7 మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు! | ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ. ﴿7﴾ |
|
8
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు![1]
[1] అప్పుడు అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాలను ధనసంపత్తులను మంచి కొరకు ఉపయోగించిన వారు స్వర్గవాసులవుతారు. వాటిని దుష్టప్రయోజనాలకు వినియోగించిన వారు నరకాగ్ని పాలవుతారు.
|
ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ. ﴿8﴾ |