Loading date... | Loading Hijri date... | Loading time...

الهمزة

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.[1]
[1] హుమ'జహ్ మరియు లుమ'హజ్: కొందరి అభిప్రాయంలో ఒకే అర్థం గలవి. మరి కొందరు వాటి మధ్య భేదం చూపుతారు. హుమ'జహ్ - అంటే ముఖం మీద అపనిందలు చేసేవారు. లుమ'జహ్ - అంటే వీపు వెనుక చాడీలు చెప్పేవారు. మరికొందరు హుమ'జహ్ - అంటే కండ్ల సైగలతో, చేతి సైగలతో దూషించటం మరియు లుమ'జహ్ - అంటే నోటి మాటలతో దూషించటం, అని అంటారు.
وَيْلٌۭ لِّكُلِّ هُمَزَةٍۢ لُّمَزَةٍ. ﴿1﴾
2 ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో![1]
[1] అంటే 'జకాతు మరియు 'సదఖాత్ ఇవ్వకుండా ఉంటాడో!
ٱلَّذِى جَمَعَ مَالًۭا وَعَدَّدَهُۥ. ﴿2﴾
3 తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు![1]
[1] అ'ఖ్ లదహ్: అంటే అది అతనిని మరణించకుండా చేస్తుందని భావిస్తాడు.
يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ. ﴿3﴾
4 ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.[1]
[1] చూఅల్-'హు'తమతు: నరకాగ్ని పేర్లలో ఒకటి. చూడండి, 15:43-44. ముక్కలు ముక్కలుగా చేసేది.
كَلَّا ۖ لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ. ﴿4﴾
5 ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?[1]
[1] ఆ అగ్ని ఎంతో భయంకరమైనది. దాని తీవ్రతను బట్టి మీ బుద్ధి అర్థం చేసుకోజాలదు.
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ. ﴿5﴾
6 అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని; نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ. ﴿6﴾
7 అది గుండెల దాకా చేరుకుంటుంది. ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ. ﴿7﴾
8 నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.[1]
[1] ముఅ''సదతున్: క్రమ్ముకొను. ఆ నరకపు ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవ్వరూ దాని నుండి బయట పడలేరు.
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌۭ. ﴿8﴾
9 పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే! فِى عَمَدٍۢ مُّمَدَّدَةٍۭ. ﴿9﴾