Loading date... | Loading Hijri date... | Loading time...

الفيل

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَٰبِ ٱلْفِيلِ. ﴿1﴾
2 ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?[1]
[1] అంటే కాబాను పడగొట్టాలనే వారి కుట్రను భంగం చేయలేదా? అని.
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍۢ. ﴿2﴾
3 మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ. ﴿3﴾
4 అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;[1]
[1] చూడండి, 11:82.
تَرْمِيهِم بِحِجَارَةٍۢ مِّن سِجِّيلٍۢ. ﴿4﴾
5 ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు. فَجَعَلَهُمْ كَعَصْفٍۢ مَّأْكُولٍۭ. ﴿5﴾