الماعون
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?[1]
[1] ఈ ఆయతు దైవప్రవక్త ('స'అస)ను సంభోదిస్తోంది. దీన్ - అంటే పునరుత్థాన (తీర్పు) దినం. చూడండి, 109:6.
|
أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ. ﴿1﴾ |
|
2
అతడే అనాథులను కసరి కొట్టేవాడు;[1]
[1] ఎందుకంటే అతడు పిసినారి, తీర్పుదినాన్ని విశ్వసించని వాడు మరియు ఇహలోకంలో చేసిన పుణ్యాలకు పరలోకంలో లభించే ప్రతిఫలాన్ని విశ్వసించని వాడు.
|
فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ. ﴿2﴾ |
| 3 మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. | وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ. ﴿3﴾ |
|
4
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు![1]
[1] అనాథులను కసిరి కొట్టేవారికి, ఆకలిగొన్న పేదలకు అన్నం పెట్టని వారికి, నమా'జ్ చేయని వారికి 'వైల్' అనే నరకమే నివాస స్థల మవుతుంది. ఎందుకంటే వారు కపట విశ్వాసులు, హృదయపూర్వకంగా కాక ఇతరులకు చూపటానికే నమా'జ్ చేసేవారు.
|
فَوَيْلٌۭ لِّلْمُصَلِّينَ. ﴿4﴾ |
|
5
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో![1]
[1] ఇలాంటి వారు అసలు నమా'జ్ చేయరు. ఒకవేళ చేసినా అశ్రద్ధతో చేస్తారు, నిర్ణీత సమయంలో చేయరు. భయభక్తులతో నమా'జ్ చేయరు. చూడండి, 4:142.
|
ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ. ﴿5﴾ |
|
6
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)![1]
[1] అంటే ఇతరులతో ఉన్నప్పుడు వారి మెప్పు పొందటానికి నమా'జ్ చేస్తారు. ఏకాంతంలో ఉంటే నమా'జ్ ను వదలి పెడతారు.
|
ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ. ﴿6﴾ |
|
7
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో![1]
[1] మ'అనున్: అంటే కొద్దిపాటి సామాన్య చిన్న చిన్న సహాయాలు. ఇంట్లో వాడే వస్తువులను ఒకరి కొకరు ఇచ్చుకోవటం. చిన్న చిన్న సహాయాలు చేసుకోవటం.
|
وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ. ﴿7﴾ |