الكافرون
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా! | قُلْ يَٰٓأَيُّهَا ٱلْكَٰفِرُونَ. ﴿1﴾ |
| 2 మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను; | لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ. ﴿2﴾ |
| 3 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు. | وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ. ﴿3﴾ |
| 4 మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను; | وَلَآ أَنَا۠ عَابِدٌۭ مَّا عَبَدتُّمْ. ﴿4﴾ |
| 5 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు. | وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ. ﴿5﴾ |
|
6
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"[1]
[1] చూమీరు మీ ధర్మాన్ని వదలటానికి సిద్ధంగా లేనప్పుడు! నేను నా సత్యధర్మాన్ని ఎందుకు వదలాలి? చూడండి, 28:55.
|
لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ. ﴿6﴾ |