الفلق
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను. | قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ. ﴿1﴾ |
|
2
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]
[1] ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.
|
مِن شَرِّ مَا خَلَقَ. ﴿2﴾ |
|
3
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]
[1] ఎందుకంటే చీకటిలోనే హానికరమైన జంతువులు, పాములు, తేళ్ళు బయటికి వస్తాయి. నేరస్థులు రాత్రిలోనే నేరాలు చేస్తారు. ఇక్కడ విధమైన అన్ని కీడుల నుండి శరణు కోరబడుతోంది.
|
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ. ﴿3﴾ |
|
4
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;[1]
[1] అన్-నఫ్ఫాసా'తి: అంటే ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుండి.
|
وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِى ٱلْعُقَدِ. ﴿4﴾ |
|
5
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]
[1] 'హాసిదిన్: అసూయపడే వాడి కీడు నుండి కూడా శరణు కోరబడుతోంది.
|
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ. ﴿5﴾ |