الشعراء
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
తా - సీన్ - మీమ్[1].
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
|
طسٓمٓ. ﴿1﴾ |
| 2 ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు) | تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ ٱلْمُبِينِ. ﴿2﴾ |
|
3
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో![1]
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 18:6.
|
لَعَلَّكَ بَٰخِعٌۭ نَّفْسَكَ أَلَّا يَكُونُوا۟ مُؤْمِنِينَ. ﴿3﴾ |
| 4 మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము. | إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةًۭ فَظَلَّتْ أَعْنَٰقُهُمْ لَهَا خَٰضِعِينَ. ﴿4﴾ |
| 5 మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు. | وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍۢ مِّنَ ٱلرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا۟ عَنْهُ مُعْرِضِينَ. ﴿5﴾ |
|
6
వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.[1]
[1] చూడండి, 6:4-5.
|
فَقَدْ كَذَّبُوا۟ فَسَيَأْتِيهِمْ أَنۢبَٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ. ﴿6﴾ |
|
7
ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని)[1] పుట్టించామో?
[1] 'జౌజున్: అంటే ఇక్కడ వివిధరకాలు అని అర్థం.
|
أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلْأَرْضِ كَمْ أَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۢ كَرِيمٍ. ﴿7﴾ |
| 8 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿8﴾ |
| 9 మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿9﴾ |
|
10
మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;[1]
[1] మూసా ('అ.స.) తన పరివారంతో సహా తిరిగి ఈజిప్టుకు వస్తున్నప్పుడు అతనికి ఒక వెలుగు కనిపిస్తుంది. అతను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆదేశం వస్తుంది.
|
وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئْتِ ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ. ﴿10﴾ |
| 11 ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?" | قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ. ﴿11﴾ |
|
12
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.[1]
[1] దీనితో తెలిసేదేమిటంటే సాధారణ మానవుల వలె, దైవప్రవక్తలకు కూడా సహజమైన భయం కలగవచ్చు.
|
قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ. ﴿12﴾ |
|
13
నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది[1], కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.
[1] దీనికి కారణం అతని నాలుకలో ఉన్న ముడి ('ఉఖ్ దతున్) చూడండి, 20:25-34.
|
وَيَضِيقُ صَدْرِى وَلَا يَنطَلِقُ لِسَانِى فَأَرْسِلْ إِلَىٰ هَٰرُونَ. ﴿13﴾ |
|
14
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది[1], కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."
[1] ఇది మూసా ('అ.స.) ఈజిప్టు నుండి వెళ్ళకముందు అనుకోకుండా జరిగిన సంఘటన. ఒక ఫిర్'ఔన్ జాతివాడు, ఒక ఇస్రాయీ'ల్ జాతివానితో కలహిస్తూ ఉండగా - ఇస్రాయీ'లు వాని పిలుపు విని - మూసా ('అ.స.) అతనికి సహాయపడటానికి, ఫిర్'ఔన్ జాతి వానిని ఒక దెబ్బ కొట్టడం వల్ల, అతడు మరణిస్తాడు. ఆ నేరానికి వారు అతనిని చంపగోరుతారు. (వివరాలకు చూడండి, 28:15).
|
وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌۭ فَأَخَافُ أَن يَقْتُلُونِ. ﴿14﴾ |
|
15
(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము[1].
[1] 'మీతోపాటు ఉండి.' అంటే అల్లాహ్ (సు.తా.) నేలపైకి ప్రతి మానవుని దగ్గరికి రాడు. ఆయన జ్ఞానం ప్రతి ఒక్కరితో ఉంటుంది. కాని అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ పైననే కూర్చుని ఉంటాడు. అంటే విశ్వంలో జరిగేది ఏది కూడా అల్లాహ్ (సు.తా.)కు తెలియకుండా లేదు.
|
قَالَ كَلَّا ۖ فَٱذْهَبَا بِـَٔايَٰتِنَآ ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ. ﴿15﴾ |
| 16 కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము. | فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿16﴾ |
|
17
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు[1]."
[1] ఎందుకంటే నీవు నాలుగువందల సంవత్సరాలు వారిని బానిసలుగా చేసి ఉంచావు. ఇప్పుడు వారికి స్వేచ్ఛనివ్వు. నేను వారిని బైతుల్ మఖ్దిస్ వైపునకు తీసుకొని పోతాను.
|
أَنْ أَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿17﴾ |
| 18 (ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా! | قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًۭا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ. ﴿18﴾ |
|
19
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"[1]
[1] చూడండి, 28:4-22, హీనమైన పని అంటే ఒక ఫిర్'ఔన్ జాతి వానిని దెబ్బకొట్టి చంపింది.
|
وَفَعَلْتَ فَعْلَتَكَ ٱلَّتِى فَعَلْتَ وَأَنتَ مِنَ ٱلْكَٰفِرِينَ. ﴿19﴾ |
| 20 (మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను! | قَالَ فَعَلْتُهَآ إِذًۭا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ. ﴿20﴾ |
|
21
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.[1]
[1] చూడండి, 28:15-16.
|
فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِى رَبِّى حُكْمًۭا وَجَعَلَنِى مِنَ ٱلْمُرْسَلِينَ. ﴿21﴾ |
|
22
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"[1]
[1] చూడండి, 28:4-5.
|
وَتِلْكَ نِعْمَةٌۭ تَمُنُّهَا عَلَىَّ أَنْ عَبَّدتَّ بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿22﴾ |
|
23
(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"[1]
[1] ఫిర్'ఔన్ తన దురహంకారంలో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఈజిప్టు వాసులందరికీ అతడు, తానే దైవమని చెప్పి, తన ఆరాధ్యం చేయించుకునేవాడు. చూడండి, 28:38.
|
قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ ٱلْعَٰلَمِينَ. ﴿23﴾ |
| 24 (మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!" | قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ. ﴿24﴾ |
|
25
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?"[1] అని ప్రశ్నించాడు.
[1] నేను తప్ప మీకు మరొక ప్రభువు కూడా ఉన్నాడా ?
|
قَالَ لِمَنْ حَوْلَهُۥٓ أَلَا تَسْتَمِعُونَ. ﴿25﴾ |
| 26 (మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!" | قَالَ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ. ﴿26﴾ |
| 27 (ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!" | قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِىٓ أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌۭ. ﴿27﴾ |
|
28
(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు[1]."
[1] చూడండి, 2:115.
|
قَالَ رَبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ. ﴿28﴾ |
| 29 (ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను." | قَالَ لَئِنِ ٱتَّخَذْتَ إِلَٰهًا غَيْرِى لَأَجْعَلَنَّكَ مِنَ ٱلْمَسْجُونِينَ. ﴿29﴾ |
|
30
(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"[1]
[1] చూడండి, 12:1.
|
قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍۢ مُّبِينٍۢ. ﴿30﴾ |
| 31 (ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!" | قَالَ فَأْتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ. ﴿31﴾ |
|
32
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది[1].
[1] జాన్నున్ (27:10, 28:31) అంటే - చిన్న సర్పం. సు' 'అబానున్ (7:107) అంటే - పెద్ద సర్పం. 'హయ్యతున్ (20:20) అంటే - చిన్నదీ కావచ్చు పెద్దదీ కావచ్చు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
|
فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِىَ ثُعْبَانٌۭ مُّبِينٌۭ. ﴿32﴾ |
|
33
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది![1]
[1] చూడండి, 7:107, 20:22, 27:12, 28:38.
|
وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِىَ بَيْضَآءُ لِلنَّٰظِرِينَ. ﴿33﴾ |
| 34 (ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు. | قَالَ لِلْمَلَإِ حَوْلَهُۥٓ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٌۭ. ﴿34﴾ |
|
35
ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"[1]
[1] చూడండి, 7:109-110)
|
يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِۦ فَمَاذَا تَأْمُرُونَ. ﴿35﴾ |
| 36 వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు; | قَالُوٓا۟ أَرْجِهْ وَأَخَاهُ وَٱبْعَثْ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ. ﴿36﴾ |
| 37 వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు." | يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍۢ. ﴿37﴾ |
|
38
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.[1]
[1] చూఇది అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛయే! ప్రజలకు, మూసా ('అ.స.) సత్యుడని మరియు మాంత్రికులు చేసేదంతా బూటక కల్పనలని నిరూపించటానికి. చూడండి, 21:18.
|
فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ. ﴿38﴾ |
| 39 మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా? | وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ. ﴿39﴾ |
| 40 ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!" | لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُوا۟ هُمُ ٱلْغَٰلِبِينَ. ﴿40﴾ |
|
41
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"[1]
[1] చూడండి, 7:113.
|
فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُوا۟ لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ ٱلْغَٰلِبِينَ. ﴿41﴾ |
| 42 (ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!" | قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًۭا لَّمِنَ ٱلْمُقَرَّبِينَ. ﴿42﴾ |
| 43 మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!" | قَالَ لَهُم مُّوسَىٰٓ أَلْقُوا۟ مَآ أَنتُم مُّلْقُونَ. ﴿43﴾ |
|
44
అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము[1]."
[1] చూడండి, 7:116 మరియు 20:66-67.
|
فَأَلْقَوْا۟ حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا۟ بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ ٱلْغَٰلِبُونَ. ﴿44﴾ |
|
45
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది[1].
[1] చూడండి, 7:117.
|
فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِىَ تَلْقَفُ مَا يَأْفِكُونَ. ﴿45﴾ |
| 46 అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు. | فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ. ﴿46﴾ |
| 47 వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము, | قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿47﴾ |
| 48 మూసా మరియు హారూన్ ల ప్రభువును." | رَبِّ مُوسَىٰ وَهَٰرُونَ. ﴿48﴾ |
|
49
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా?[1] నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను[2]."
[1] చూడండి, 7:123.
[2] చూడండి, 5:33 మరియు 7:124.
|
قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ ۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَٰفٍۢ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ. ﴿49﴾ |
| 50 (మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది. | قَالُوا۟ لَا ضَيْرَ ۖ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ. ﴿50﴾ |
| 51 నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!" | إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَٰيَٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلْمُؤْمِنِينَ. ﴿51﴾ |
|
52
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు[1]."
[1] చూడండి, 7:130.
|
۞ وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِىٓ إِنَّكُم مُّتَّبَعُونَ. ﴿52﴾ |
| 53 తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు. | فَأَرْسَلَ فِرْعَوْنُ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ. ﴿53﴾ |
| 54 (ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే. | إِنَّ هَٰٓؤُلَآءِ لَشِرْذِمَةٌۭ قَلِيلُونَ. ﴿54﴾ |
| 55 మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు; | وَإِنَّهُمْ لَنَا لَغَآئِظُونَ. ﴿55﴾ |
| 56 మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము." | وَإِنَّا لَجَمِيعٌ حَٰذِرُونَ. ﴿56﴾ |
| 57 కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము; | فَأَخْرَجْنَٰهُم مِّن جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿57﴾ |
| 58 మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా. | وَكُنُوزٍۢ وَمَقَامٍۢ كَرِيمٍۢ. ﴿58﴾ |
|
59
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము[1].
[1] చూడండి, 7:137.
|
كَذَٰلِكَ وَأَوْرَثْنَٰهَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿59﴾ |
| 60 అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు. | فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ. ﴿60﴾ |
| 61 ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!" | فَلَمَّا تَرَٰٓءَا ٱلْجَمْعَانِ قَالَ أَصْحَٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدْرَكُونَ. ﴿61﴾ |
|
62
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)[1]."
[1] అంటే అల్లాహ్ (సు.తా.) సహాయం నాతో ఉంది.
|
قَالَ كَلَّآ ۖ إِنَّ مَعِىَ رَبِّى سَيَهْدِينِ. ﴿62﴾ |
|
63
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది[1].
[1] చూడండి, 20:77.
|
فَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْبَحْرَ ۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍۢ كَٱلطَّوْدِ ٱلْعَظِيمِ. ﴿63﴾ |
| 64 మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము. | وَأَزْلَفْنَا ثَمَّ ٱلْءَاخَرِينَ. ﴿64﴾ |
| 65 మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము. | وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجْمَعِينَ. ﴿65﴾ |
| 66 ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము. | ثُمَّ أَغْرَقْنَا ٱلْءَاخَرِينَ. ﴿66﴾ |
| 67 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿67﴾ |
| 68 మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿68﴾ |
| 69 ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు. | وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَٰهِيمَ. ﴿69﴾ |
| 70 అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు; | إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا تَعْبُدُونَ. ﴿70﴾ |
| 71 వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము." | قَالُوا۟ نَعْبُدُ أَصْنَامًۭا فَنَظَلُّ لَهَا عَٰكِفِينَ. ﴿71﴾ |
| 72 (ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా? | قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ. ﴿72﴾ |
| 73 లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?" | أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ. ﴿73﴾ |
| 74 వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము." | قَالُوا۟ بَلْ وَجَدْنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ. ﴿74﴾ |
| 75 అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో? | قَالَ أَفَرَءَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ. ﴿75﴾ |
| 76 మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)? | أَنتُمْ وَءَابَآؤُكُمُ ٱلْأَقْدَمُونَ. ﴿76﴾ |
| 77 ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప! | فَإِنَّهُمْ عَدُوٌّۭ لِّىٓ إِلَّا رَبَّ ٱلْعَٰلَمِينَ. ﴿77﴾ |
| 78 ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. | ٱلَّذِى خَلَقَنِى فَهُوَ يَهْدِينِ. ﴿78﴾ |
| 79 ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు. | وَٱلَّذِى هُوَ يُطْعِمُنِى وَيَسْقِينِ. ﴿79﴾ |
| 80 మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు. | وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ. ﴿80﴾ |
| 81 మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు. | وَٱلَّذِى يُمِيتُنِى ثُمَّ يُحْيِينِ. ﴿81﴾ |
| 82 మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను. | وَٱلَّذِىٓ أَطْمَعُ أَن يَغْفِرَ لِى خَطِيٓـَٔتِى يَوْمَ ٱلدِّينِ. ﴿82﴾ |
| 83 మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు. | رَبِّ هَبْ لِى حُكْمًۭا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ. ﴿83﴾ |
|
84
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు[1].
[1] చూడండి, 19:50.
|
وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍۢ فِى ٱلْءَاخِرِينَ. ﴿84﴾ |
| 85 మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు. | وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ. ﴿85﴾ |
|
86
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే![1]
[1] చూడండి, 19:47-48 మరియు 9:114.
|
وَٱغْفِرْ لِأَبِىٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ. ﴿86﴾ |
| 87 మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు. | وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ. ﴿87﴾ |
| 88 ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో! | يَوْمَ لَا يَنفَعُ مَالٌۭ وَلَا بَنُونَ. ﴿88﴾ |
| 89 కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!" | إِلَّا مَنْ أَتَى ٱللَّهَ بِقَلْبٍۢ سَلِيمٍۢ. ﴿89﴾ |
| 90 మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది. | وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ. ﴿90﴾ |
| 91 మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది. | وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِلْغَاوِينَ. ﴿91﴾ |
| 92 మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు? | وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ. ﴿92﴾ |
|
93
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"[1]
[1] అంటే దేవతలుగా భావించబడిన పుణ్యపురుషులు మరియు విగ్రహాలు లేక మానవుడు ఆరాధించే సంపత్తులు, హోదాలు ఉన్నత స్థానాలు మొదలైనవి. చూడండి, 10:28-29.
|
مِن دُونِ ٱللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ. ﴿93﴾ |
| 94 అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు. | فَكُبْكِبُوا۟ فِيهَا هُمْ وَٱلْغَاوُۥنَ. ﴿94﴾ |
|
95
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ[1].
[1] చూడండి, 2:24 19:68 మరియు 19:83.
|
وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ. ﴿95﴾ |
| 96 వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు: | قَالُوا۟ وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ. ﴿96﴾ |
| 97 "అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము. | تَٱللَّهِ إِن كُنَّا لَفِى ضَلَٰلٍۢ مُّبِينٍ. ﴿97﴾ |
| 98 ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో! | إِذْ نُسَوِّيكُم بِرَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿98﴾ |
|
99
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే[1].
[1] చూడండి, 7:38 33:67-68 మరియు 38:60-61.
|
وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلْمُجْرِمُونَ. ﴿99﴾ |
| 100 మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు. | فَمَا لَنَا مِن شَٰفِعِينَ. ﴿100﴾ |
| 101 మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు. | وَلَا صَدِيقٍ حَمِيمٍۢ. ﴿101﴾ |
|
102
ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"[1]
[1] చూడండి, 6:27-28.
|
فَلَوْ أَنَّ لَنَا كَرَّةًۭ فَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿102﴾ |
| 103 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿103﴾ |
| 104 మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿104﴾ |
| 105 నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. | كَذَّبَتْ قَوْمُ نُوحٍ ٱلْمُرْسَلِينَ. ﴿105﴾ |
| 106 వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా? | إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ. ﴿106﴾ |
| 107 నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿107﴾ |
| 108 కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿108﴾ |
| 109 నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿109﴾ |
| 110 కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿110﴾ |
|
111
వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన[1] వారే కదా అనుసరిస్తున్నది?"
[1] అల్-అర్జ'లూన్: ధనసంపత్తులు లేనివారు. సమాజంలో తక్కువ శ్రేణికి చెందినవారిగా లెక్కించబడేవారు. లేక అధమమైనవిగా భావించే వృత్తులు చేసేవారు. చూడండి, 11:27.
|
۞ قَالُوٓا۟ أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ. ﴿111﴾ |
| 112 (నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు? | قَالَ وَمَا عِلْمِى بِمَا كَانُوا۟ يَعْمَلُونَ. ﴿112﴾ |
|
113
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది[1].
[1] ఏ మానవుడు కూడా ఇతర మానవుడి హృదయంలో ఏముందో ఎరుగలేడు. కావున ఒకడు: 'నేను విశ్వాసుణ్ణి.' అని పలికి, తన ధర్మానికి విరుద్ధమైన చేష్టలు చేయడో, మాటలు పలుకడో, అట్టివాడు విశ్వాసుడిగానే పరిగణించబడాలి. మానవుని హృదయంలో ఉన్నది కేవలం అల్లాహ్ (సు.తా.) కే తెలుసు. కావున ఏ మానవునికి కూడా, ఇతర మానవుని విశ్వాసం గురించి అతని హృదయంలో ఉన్న ఆలోచనలను గురించి నిర్ణయం తీసుకునే హక్కు లేదు.
|
إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّى ۖ لَوْ تَشْعُرُونَ. ﴿113﴾ |
| 114 మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను. | وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ. ﴿114﴾ |
| 115 నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!" | إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ مُّبِينٌۭ. ﴿115﴾ |
| 116 వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు." | قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ. ﴿116﴾ |
| 117 (నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు. | قَالَ رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ. ﴿117﴾ |
|
118
కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు[1]."
[1] చూడండి, 7:89.
|
فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًۭا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿118﴾ |
| 119 ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము. | فَأَنجَيْنَٰهُ وَمَن مَّعَهُۥ فِى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ. ﴿119﴾ |
|
120
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము[1].
[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48. ముంచి వేయబడిన వారిలో నూ'హ్ ('అ.స.) భార్య మరియు కుమారుడు కూడా ఉన్నారు. ఎందుకంటే వారు సత్యతిరస్కారులు.
|
ثُمَّ أَغْرَقْنَا بَعْدُ ٱلْبَاقِينَ. ﴿120﴾ |
| 121 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿121﴾ |
| 122 నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿122﴾ |
| 123 ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. | كَذَّبَتْ عَادٌ ٱلْمُرْسَلِينَ. ﴿123﴾ |
|
124
వారి సహోదరుడు[1] హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
[1] సహోదరుడు అంటే జాతి సోదరుడు. అదే జాతికి చెందినవాడు. ఇంకా చూడండి, 7:65.
|
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ. ﴿124﴾ |
| 125 నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿125﴾ |
| 126 కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿126﴾ |
| 127 నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿127﴾ |
| 128 ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా? | أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةًۭ تَعْبَثُونَ. ﴿128﴾ |
| 129 మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా? | وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ. ﴿129﴾ |
| 130 మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా? | وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ. ﴿130﴾ |
| 131 ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿131﴾ |
| 132 మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి. | وَٱتَّقُوا۟ ٱلَّذِىٓ أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ. ﴿132﴾ |
| 133 ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు. | أَمَدَّكُم بِأَنْعَٰمٍۢ وَبَنِينَ. ﴿133﴾ |
| 134 మరియు తోటలను మరియు చెలమలను. | وَجَنَّٰتٍۢ وَعُيُونٍ. ﴿134﴾ |
| 135 నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!" | إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍۢ. ﴿135﴾ |
| 136 వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే! | قَالُوا۟ سَوَآءٌ عَلَيْنَآ أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ ٱلْوَٰعِظِينَ. ﴿136﴾ |
|
137
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే![1]
[1] కాబట్టి మేము దానిని విడువలేము.
|
إِنْ هَٰذَآ إِلَّا خُلُقُ ٱلْأَوَّلِينَ. ﴿137﴾ |
| 138 మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు." | وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ. ﴿138﴾ |
|
139
ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము[1]. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
[1] 'ఆద్ జాతి ఒక బలవంతమైన సమాజముండేది. చూడండి, 89:8 చూడండి 41:15. అయినా వారు సత్యాన్ని తిరస్కరించి, దౌర్జన్యాలు చేసినందుకు నాశనం చేయబడ్డారు.
|
فَكَذَّبُوهُ فَأَهْلَكْنَٰهُمْ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿139﴾ |
| 140 నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿140﴾ |
|
141
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].
[1] స'మూద్ జాతి వారి నివాసం స'ఊది 'అరేబియాలో 'హిజ్ర్ అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రాంతం మదాయిన్ 'సాలిహ్' అని కూడా పిలవబడుతుంది. వారు అరబ్బులు. దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేశారు. అక్కడి నుండి పోయేటప్పుడు తన ఒంటెను త్వరత్వరగా నడిపిస్తూ, తన అనుచరులతో అల్లాహ్ (సు.తా.) ను క్షమాపణ కోరుతూ త్వరత్వరగా ఈ ప్రాంతం నుండి సాగిపొండన్నారు.
|
كَذَّبَتْ ثَمُودُ ٱلْمُرْسَلِينَ. ﴿141﴾ |
|
142
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?[1]
[1] చూడండి, 7:73 మరియు 11:61-68.
|
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَٰلِحٌ أَلَا تَتَّقُونَ. ﴿142﴾ |
| 143 నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿143﴾ |
| 144 కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿144﴾ |
| 145 నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿145﴾ |
| 146 ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా? | أَتُتْرَكُونَ فِى مَا هَٰهُنَآ ءَامِنِينَ. ﴿146﴾ |
| 147 తోటలలో మరియు చెలమలలో! | فِى جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿147﴾ |
|
148
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;[1]
[1] 'తల్'ఉన్: అంటే క్రొత్తగా పుట్టే ఖర్జూర ఫలం, కొద్దిగా పెద్దదైన తరువాత దానిని బల్'హున్, ఆ తరువాత బస్ రున్, ఆ పిదప ర'త్ బున్, చివరకు తమ రున్. ఈ విధంగా వేర్వేరు స్థితులలో ఖర్జూర ఫలం పిలువబడుతోంది.
|
وَزُرُوعٍۢ وَنَخْلٍۢ طَلْعُهَا هَضِيمٌۭ. ﴿148﴾ |
|
149
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ![1]
[1] చూడండి, 7:74.
|
وَتَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًۭا فَٰرِهِينَ. ﴿149﴾ |
| 150 అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿150﴾ |
| 151 మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి. | وَلَا تُطِيعُوٓا۟ أَمْرَ ٱلْمُسْرِفِينَ. ﴿151﴾ |
| 152 ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!" | ٱلَّذِينَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ وَلَا يُصْلِحُونَ. ﴿152﴾ |
| 153 వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు! | قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ. ﴿153﴾ |
| 154 నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!" | مَآ أَنتَ إِلَّا بَشَرٌۭ مِّثْلُنَا فَأْتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ. ﴿154﴾ |
|
155
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి[1].
[1] ఒంటె వృత్తాంతానికి చూడండి, 7:73-77.
|
قَالَ هَٰذِهِۦ نَاقَةٌۭ لَّهَا شِرْبٌۭ وَلَكُمْ شِرْبُ يَوْمٍۢ مَّعْلُومٍۢ. ﴿155﴾ |
| 156 దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది." | وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍۢ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍۢ. ﴿156﴾ |
|
157
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు[1].
[1] వారు ఆ ఒంటెను చంపిన తరువాత 'సాలి'హ్ ('అ.స.) అన్నారు. మీకు మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నాలుగవ రోజు వారు అల్లాహ్ శిక్ష అవతరించడం చూసి పశ్చాత్తాప పడ్డారు. కాని శిక్ష వచ్చిన తరువాత పడే పశ్చాత్తాపం లాభదాయకం కాజాలదు.
|
فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَٰدِمِينَ. ﴿157﴾ |
| 158 కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. | فَأَخَذَهُمُ ٱلْعَذَابُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿158﴾ |
| 159 నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿159﴾ |
|
160
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].
[1] చూలూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:69-83 లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుడైన హారాన్ బిన్-ఆ'జర్ కుమారుడు. అతను కూడా ఇబ్రాహీమ ('అ.స.) జీవిత కాలంలోనే ప్రవక్తగా ఎన్నుకొనబడి, సోడోమ్ మరియు గొమొర్రెహ్ ప్రాంతాలకు పంపబడ్డారు. అవి జోర్డాన్ లో మృతసముద్రం (Dead Sea), ప్రాంతంలో ఉండేవి.
|
كَذَّبَتْ قَوْمُ لُوطٍ ٱلْمُرْسَلِينَ. ﴿160﴾ |
| 161 వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా? | إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ. ﴿161﴾ |
| 162 నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿162﴾ |
| 163 కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿163﴾ |
| 164 నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿164﴾ |
| 165 (ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ? | أَتَأْتُونَ ٱلذُّكْرَانَ مِنَ ٱلْعَٰلَمِينَ. ﴿165﴾ |
|
166
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"[1]
[1] మొదటిసారిగా చరిత్రలో స్త్రీలను విడిచి, పురుషులు - పురుషులతో రతిక్రీడ (సంభోగం) వీరే ప్రారంభించారంటారు. ఆ నగరం పేరట, ఆ క్రియ ఈనాటికీ సొడోమి (Sodomy) అనబడుతోంది. ఈ కాలపు పశ్చిమ దేశాలలో పరస్పర అంగీకారంతో చేసే సొడోమి, లిస్బనిస్మ (Lesbianism) మరియు స్త్రీ పురుషుల వ్యభిచారాలు చట్టప్రకారం నేరంకావు. ఈ సమాజం ఎటుపోతోంది?
|
وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَٰجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ. ﴿166﴾ |
| 167 (దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!" | قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلْمُخْرَجِينَ. ﴿167﴾ |
| 168 (లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను." | قَالَ إِنِّى لِعَمَلِكُم مِّنَ ٱلْقَالِينَ. ﴿168﴾ |
| 169 (ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు." | رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ. ﴿169﴾ |
| 170 కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము - | فَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ. ﴿170﴾ |
|
171
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప![1]
[1] చూముసలామె అంటే లూ'త్ ('అ.స.) భార్య. ఆమె సత్యతిరస్కారి. ఆమె అదే ప్రాంతవాసి. చూడండి, 7:83, 11:81, 27:57, 29:32-33 మరియు 66:10.
|
إِلَّا عَجُوزًۭا فِى ٱلْغَٰبِرِينَ. ﴿171﴾ |
| 172 ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము. | ثُمَّ دَمَّرْنَا ٱلْءَاخَرِينَ. ﴿172﴾ |
|
173
వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం[1].
[1] చూడండి, 11:82-83.
|
وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًۭا ۖ فَسَآءَ مَطَرُ ٱلْمُنذَرِينَ. ﴿173﴾ |
| 174 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿174﴾ |
| 175 మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿175﴾ |
|
176
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు[1].
[1] చూఅ'య్ కహ్ వాసులు అంటే, అడవివాసులు. మద్ యన్ కు కొంత దూరంలో ఉన్న అడవి ప్రాంతం అ'య్ కహ్ అనబడుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇలా ఉంది: అ'య్ కహ్ అంటే ఒక పెద్ద చెట్టు అది మద్ యన్ కు కొంత దూరంలో ఉండింది. దాని వాసులు ఆ చెట్టును ఆరాధించే వారు. షు'ఐబ్ ('అ.స.) మద్ యన్ వాసులు. కావున అతను మద్ యన్ వాసుల సోదరుడు అని పేర్కొనబడ్డారు. చూడండి, 7:85. వారు ఈ రెండు ప్రాంతాలలో ధర్మప్రచారం చేశారు. (ఇబ్నె-కసీ'ర్).
|
كَذَّبَ أَصْحَٰبُ لْـَٔيْكَةِ ٱلْمُرْسَلِينَ. ﴿176﴾ |
|
177
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?[1]
[1] చూడండి 7:85 మరియు షు'ఐబ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:84-95.
|
إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ. ﴿177﴾ |
| 178 నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿178﴾ |
| 179 కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿179﴾ |
| 180 నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿180﴾ |
| 181 మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి! | ۞ أَوْفُوا۟ ٱلْكَيْلَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُخْسِرِينَ. ﴿181﴾ |
| 182 త్రాసుతో సరిసమానంగా తూచండి. | وَزِنُوا۟ بِٱلْقِسْطَاسِ ٱلْمُسْتَقِيمِ. ﴿182﴾ |
|
183
ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి[1].
[1] చూడండి, 7:86.
|
وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ. ﴿183﴾ |
|
184
మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి[1]."
[1] జిబలతున్: అంటే చాలా మంది లేక పెద్ద వర్గం అని అర్థం.
|
وَٱتَّقُوا۟ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلْجِبِلَّةَ ٱلْأَوَّلِينَ. ﴿184﴾ |
| 185 వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు! | قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ. ﴿185﴾ |
| 186 నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము! | وَمَآ أَنتَ إِلَّا بَشَرٌۭ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلْكَٰذِبِينَ. ﴿186﴾ |
| 187 నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి." | فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًۭا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ. ﴿187﴾ |
| 188 (షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!" | قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ. ﴿188﴾ |
|
189
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష![1]
[1] చూషు'ఐబ్ ('అ.స) తెగవారి మీద మూడు రకాల శిక్షలు వచ్చాయి. 7:91 లో భూకంపం, 11:94 లో భయంకర ధ్వని, మరియు ఇక్కడ మేఘాల, రాళ్ళ వర్షపు శిక్ష అని పేర్కొనబడ్డాయి. అంటే మూడు రకాల శిక్షలు ఒకేసారి వచ్చాయన్నమాట. (ఇబ్నె-కసీ'ర్).
|
فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ ٱلظُّلَّةِ ۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ. ﴿189﴾ |
| 190 నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿190﴾ |
|
191
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత[1].
[1] చూదీనితో ఏడు గాథలు ముగుస్తున్నాయి. అన్నితరాల ప్రజలలో ఒకే విధమైన లక్షణాలు, స్వభావాలు ఉన్నాయి. వారంతా తమ సందేశహరుల సత్యసందేశాన్ని తిరస్కరించి వారిపై దౌర్జన్యాలు చేశారు. తమ తండ్రితాతల ధర్మాలను అవలంబించారు. 'నీ ప్రభువు శిక్షను తీసుకురా,' అని అన్నారు. చివరకు వారిపై శిక్ష అవతరింపజేయబడి నాశనం చేయబడ్డారు. వారి పరలోక శిక్ష నరకమే. ప్రతికాలంలో కూడా చాలా మట్టుకు పేదవారూ, తక్కువ ఆర్థిక, సామాజిక స్థానాలకు చెందిన వారే ప్రవక్తలను మొట్టమొదట అనుసరించారు. అందుకే స్వర్గంలో ఎక్కువగా ఇలాంటి వారే ఉంటారు.
|
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿191﴾ |
| 192 మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం). | وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿192﴾ |
|
193
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు[1];
[1] చూఏ విధంగానైతే పూర్వపు దైవప్రవక్తల మీద జిబ్రీల్ ('అ.స.) ద్వారా దివ్యజ్ఞానం అవతరింపజేయ బడిందో, అదే విధంగా ము'హమ్మద్ ('స'అస) పైన కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప జేయబడింది. అతను నిరక్షరాస్యుడయినా, పూర్వ ప్రవక్తల గాథలు వినిపించటమే ఖుర్ఆన్ దివ్యావతరణకు నిదర్శనం. అర్ రూ'హుల్ అమీన్: నమ్మదగిన ఆత్మ, అంటే జిబ్రీల్ ('అ.స.)'
|
نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلْأَمِينُ. ﴿193﴾ |
| 194 నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని; | عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ ٱلْمُنذِرِينَ. ﴿194﴾ |
|
195
స్పష్టమైన అరబ్బీ భాషలో[1]!
[1] చూడండి, 14:4 ఇతర 'అరబ్ ప్రవక్తలు ఇస్మా'యీల్, హూద్, 'సాలి'హ్ మరియు షు'ఐబ్ 'అలైహిస్సలామ్ లు. హీబ్రూ మరియు అరమాయిక్ ప్రాచీన 'అరబ్బీ భాషలే! ఇతర దివ్యగ్రంథాలు ఆయా సంఘాల వారి కొరకు అవతరింప జేయబడి ఉండెను. 'అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ చివరి దివ్యగ్రంథం మరియు ఆధునిక కాలంలో వచ్చింది. ఇప్పుడు భూగోళమంతా ఒక గ్లోబల్ విల్లేజ్ గా మారిపోయింది, కాబట్టి ఈ ఖుర్ఆన్ సర్వలోకాల వారికి మార్గదర్శనిగా చివరి దివ్యగ్రంథంగా పంపబడింది. చూడండి, 7:158 మరియు 25:1. ఈ ఖుర్ఆన్ 14 వందల సంవత్సరాలు గడిచినా దాని అసలు రూపంలో ఉండి, అందులో ఏ ఒక్క అక్షరపు మార్పు కూడా లేకుండా భద్రపరచబడింది. ఇది అల్లాహ్ (సు.తా.) వాగ్దానం. అల్లాహ్ (సు.తా.) ఇష్టంతో ఇది ఇప్పుడు ప్రపంచంలోని వివిధ భాషలలో అనువాదం చేయబడుతోంది. అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో సత్యాన్ని అర్థం చేసుకోగలవారు, దీనిని అర్తం చేసుకొని, సత్యధర్మాన్ని (ఇస్లాంను) స్వీకరించి శాశ్వతంగా స్వర్గవాసానికి అర్హులయ్యే మార్గాన్ని అవలంబిస్తున్నారు.
|
بِلِسَانٍ عَرَبِىٍّۢ مُّبِينٍۢ. ﴿195﴾ |
|
196
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది[1].
[1] ఈ ప్రస్తావన కొరకు చూడండి, 2:42 మరియు ద్వితీయోపదేశ కాండము - (Deuteronomy), 18:15,18 మరియు యోహాను - (John), 14:16.
|
وَإِنَّهُۥ لَفِى زُبُرِ ٱلْأَوَّلِينَ. ﴿196﴾ |
|
197
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు[1] ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?
[1] ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ ఇబ్నె-సల్లాం, కా'బ్ ఇబ్నె మాలిక్ మరియు ఇతర మదీనా యూద విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇస్లాం స్వీకరించారు. ఈ రోజు వరకు కూడా ఎంతో మంది యూద మరియు క్రైస్తవ విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇస్లాం స్వీకరిస్తున్నారు.
|
أَوَلَمْ يَكُن لَّهُمْ ءَايَةً أَن يَعْلَمَهُۥ عُلَمَٰٓؤُا۟ بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿197﴾ |
| 198 ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే! | وَلَوْ نَزَّلْنَٰهُ عَلَىٰ بَعْضِ ٱلْأَعْجَمِينَ. ﴿198﴾ |
|
199
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు[1].
[1] చూడండి, 41:44.
|
فَقَرَأَهُۥ عَلَيْهِم مَّا كَانُوا۟ بِهِۦ مُؤْمِنِينَ. ﴿199﴾ |
| 200 ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము. | كَذَٰلِكَ سَلَكْنَٰهُ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ. ﴿200﴾ |
| 201 కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు. | لَا يُؤْمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُا۟ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ. ﴿201﴾ |
| 202 అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. | فَيَأْتِيَهُم بَغْتَةًۭ وَهُمْ لَا يَشْعُرُونَ. ﴿202﴾ |
|
203
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?[1]
[1] శిక్ష వచ్చిన తరువాత వ్యవధి ఇవ్వబడదు మరియు అప్పుడు చేసే పశ్చాత్తాపం కూడా అంగీకరించబడదు. చూడండి, 23:85.
|
فَيَقُولُوا۟ هَلْ نَحْنُ مُنظَرُونَ. ﴿203﴾ |
|
204
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?[1]
[1] ఈ శిక్ష కోరిన దానికి చూడండి, 6:57 మరియు 8:32.
|
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ. ﴿204﴾ |
| 205 చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా! | أَفَرَءَيْتَ إِن مَّتَّعْنَٰهُمْ سِنِينَ. ﴿205﴾ |
| 206 తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు; | ثُمَّ جَآءَهُم مَّا كَانُوا۟ يُوعَدُونَ. ﴿206﴾ |
|
207
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు[1].
[1] చూడండి, 2:96.
|
مَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يُمَتَّعُونَ. ﴿207﴾ |
| 208 మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు! | وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ. ﴿208﴾ |
|
209
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు[1].
[1] చూడండి, 6:131, 15:4, 20:134, 17:15, 28:59 అల్లాహ్ (సు.తా.), హెచ్చరిక చేయటానికి ప్రవక్తలను పంపనిదే ఏ సమాజాన్ని కూడా నాశనం చేయలేదు.
|
ذِكْرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ. ﴿209﴾ |
| 210 మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు. | وَمَا تَنَزَّلَتْ بِهِ ٱلشَّيَٰطِينُ. ﴿210﴾ |
| 211 మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు. | وَمَا يَنۢبَغِى لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ. ﴿211﴾ |
| 212 వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు. | إِنَّهُمْ عَنِ ٱلسَّمْعِ لَمَعْزُولُونَ. ﴿212﴾ |
| 213 కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు. | فَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلْمُعَذَّبِينَ. ﴿213﴾ |
| 214 మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు; | وَأَنذِرْ عَشِيرَتَكَ ٱلْأَقْرَبِينَ. ﴿214﴾ |
|
215
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు[1].
[1] చూడండి, 17:24.
|
وَٱخْفِضْ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿215﴾ |
| 216 ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను." | فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌۭ مِّمَّا تَعْمَلُونَ. ﴿216﴾ |
| 217 మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో! | وَتَوَكَّلْ عَلَى ٱلْعَزِيزِ ٱلرَّحِيمِ. ﴿217﴾ |
|
218
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు[1].
[1] కొందరు వ్యాఖ్యాతలు: "నీవు నమా'జ్ లో నిలిచినప్పుడు." అని అంటారు.
|
ٱلَّذِى يَرَىٰكَ حِينَ تَقُومُ. ﴿218﴾ |
| 219 మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా! | وَتَقَلُّبَكَ فِى ٱلسَّٰجِدِينَ. ﴿219﴾ |
| 220 నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. | إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ. ﴿220﴾ |
| 221 షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా? | هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَٰطِينُ. ﴿221﴾ |
| 222 వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు; | تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍۢ. ﴿222﴾ |
|
223
గాలి వార్తలను చెవులలో ఊదుతారు[1]; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!
[1] అంటే ఆ సైతానులు తమను వినేవారి చెవులలో వినీవినని బూటకపు మాటలను ఊదుతారు.
|
يُلْقُونَ ٱلسَّمْعَ وَأَكْثَرُهُمْ كَٰذِبُونَ. ﴿223﴾ |
|
224
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు[1].
[1] చూడండి, 36:69. ఆ కాలపు కొందరు 'అరబ్బులు ఈ ఖుర్ఆన్ ను ము'హమ్మద్ ('స.'అస) రచించిన కవితగా అపోహపడ్డారు. అందుకే ఈ ఆయత్ లో కవులను అనుసరించే వారు మార్గభ్రష్టులని అల్లాహ్ (సు.తా.) విశదీకరించాడు. ఈ ఖుర్ఆన్ దివ్యజ్ఞానం (వ'హీ) కాబట్టి ఖుర్ఆన్ లో : "దీని వంటి ఒక్క సూరహ్ నయినా మీరంతా కలసి రచించి తీసుకురండి." అని సవాలు (Challenge) చేయబడింది. కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా దానిని పూర్తి చేయలేక పోయారు.
|
وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلْغَاوُۥنَ. ﴿224﴾ |
|
225
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని[1];
[1] చూ కవులు చాలా మట్టుకు ఊహాగానాలే చేస్తుంటారు. కాబట్టి కవిత్వంలో స్వవిరుద్ధమైన వ్యాఖ్యానాలు ఉంటాయి. వారి వివరణ లక్ష్యం లేనిది, భ్రమింపజేసేది. కాని ఖుర్ఆన్ మానవులను సత్యమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి అవతరింప జేయబడింది. అల్లాహ్ (సు.తా.), మానవుని సృష్టికర్త అవతరింపజేసిన మానవుని యొక్క నిర్దేశక గ్రంథమే (Operation Manual) ఈ ఖుర్ఆన్. ఇది మానవునికి మార్గదర్శిని.
|
أَلَمْ تَرَ أَنَّهُمْ فِى كُلِّ وَادٍۢ يَهِيمُونَ. ﴿225﴾ |
| 226 మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని; | وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ. ﴿226﴾ |
|
227
కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప![1] అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.
[1] ఇక్కడ ఆ కవులకే, కవిత్వం చేసే అనుమతి ఇవ్వబడింది, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో మరియు అల్లాహ్ (సు.తా.) ను అమితంగా ప్రార్థిస్తారో మరియు ఊహాగానాలు చేయక సత్యాధారంపై కవిత్వం చేస్తారో! ఉదారహరణకు: 'హస్సాన్ బిన్ సా'బిత్ (ర'ది. 'అ.), తన కవిత్వంతో సత్యతిరస్కారుల కవిత్వానికి తగిన జవాబు ఇచ్చేవారు. దైవప్రవక్త ('స'అస) అతనితో ఇలా అనేవారు: 'ఈ సత్యతిరస్కారులకు జవాబివ్వు, జిబ్రీల్ (అ.స.) నీకు తోడ్పడు గాక!' ('స'హీ'హ్ బుఖా'రీ). దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే సత్యతిరస్కారులకు జవాబివ్వటానికి, సత్యాధారంగా చేసే కవిత్వం మరియు సత్యాన్ని, తౌహీద్ ను మరియు సున్నతును స్థాపించటానికి చేసే కవిత్వం ధర్మసమ్మతమైనదే!
|
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُوا۟ ٱللَّهَ كَثِيرًۭا وَٱنتَصَرُوا۟ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ ۗ وَسَيَعْلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَىَّ مُنقَلَبٍۢ يَنقَلِبُونَ. ﴿227﴾ |