آل عمران
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
అలిఫ్-లామ్-మీమ్ [1].
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
|
الٓمٓ. ﴿1﴾ |
|
2
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు), విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు[1].
[1] చూడండి, 2:255.
|
ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ. ﴿2﴾ |
|
3
ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది[1]. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును[2] అవతరింపజేశాడు.
[1] చూడండి, 5:46, 48, 61:6. [2] ఇక్కడ (ఖుర్ఆన్ లో) పేర్కొనబడిన ఇంజీల్ మరియు తౌరాత్ గ్రంథాలు అంటే 'ఈసా ('అ.స.) మరియు మూసా ('అ.స.) లపై అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలు అని అర్థం. ఆ అసలు దివ్యగ్రంథాలు ఇప్పుడు ప్రపంచంలో లేవు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రాచీన బైబిల్ గ్రంథాలు, గ్రీక్ భాషలో ఉన్న బ్రిటీష్ మ్యూజియంలోని Codex Sinaiticus, Codex Alexandrinus మరియు రోమ్ లోని వాటికాన్ లైబ్రరీలో ఉన్న Codex Vaticanus. ఇవి 'ఈసా ('అ.స.) పైకి సజీవులుగా ఎత్తుకోబడిన దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత, గ్రీక్ భాషలో వ్రాయబడ్డాయి. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్. స.) లపై అవతరింపజేయబడిన తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాల బాష గ్రీకు కాదు. వారి మతాచారులు / విద్వాంసులు, వాటిలో ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. ఈ రోజు వాడుకలో ఉన్న బైబిల్ లలో, ఆ ప్రవక్తల కొన్ని ప్రవచనాలు మరియు అసలు దివ్య ఆవిష్కృతులైన కొన్ని అంసాలు - వారి మతాచారులు / విద్వాంసులు వ్రాసిన రూపంలో - ఉన్నాయి. కాబట్టి దివ్యఖుర్ఆన్ సూచించేది ఆ ప్రవక్తలపై అవతరింపజేయబడిన ప్రవచనాలను మాత్రమే కానీ ఈ రోజు వాడుకలో ఉన్న బైబిల్ (Revised) Authorized Kind James Version ను కాదు. చూడండి, 4:136, 5:47.
|
نَزَّلَ عَلَيْكَ ٱلْكِتَٰبَ بِٱلْحَقِّ مُصَدِّقًۭا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ ٱلتَّوْرَىٰةَ وَٱلْإِنجِيلَ. ﴿3﴾ |
|
4
దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు[1]. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.
[1] చూడండి, 2:53.
|
مِن قَبْلُ هُدًۭى لِّلنَّاسِ وَأَنزَلَ ٱلْفُرْقَانَ ۗ إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِ ٱللَّهِ لَهُمْ عَذَابٌۭ شَدِيدٌۭ ۗ وَٱللَّهُ عَزِيزٌۭ ذُو ٱنتِقَامٍ. ﴿4﴾ |
| 5 నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశాలలో గానీ, అల్లాహ్ కు గోప్యంగా ఉన్నది ఏదీ లేదు. | إِنَّ ٱللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَىْءٌۭ فِى ٱلْأَرْضِ وَلَا فِى ٱلسَّمَآءِ. ﴿5﴾ |
|
6
ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు[1]. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
[1] ము'సవ్విరు (అల్ - ము'సవ్విరు): The Fashioner. రూపమిచ్చేవాడు. తాను కోరిన విధంగా తన సృష్టి రూపాన్ని తీర్చి దిద్దేవాడు. చూడండి, 59:24. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
|
هُوَ ٱلَّذِى يُصَوِّرُكُمْ فِى ٱلْأَرْحَامِ كَيْفَ يَشَآءُ ۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ. ﴿6﴾ |
|
7
ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి[1]. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.
[1] ము'హ్ కమాతున్: అంటే, అల్లాహుతా'ఆలా ఆజ్ఞలను, ఆయన నిషేధించిన వాటిని, 'హలాల్ చేసిన వాటిని, కథలను మొదలైన స్పష్టంగా తెలియజేసే ఆయతులు. ఈ ఆయతుల భావం స్పష్టంగా ఉంటుంది. ఇవి దివ్యగ్రంథ పునాదులు. వీటిని ఉమ్ముల్-కితాబ్ అని అంటారు. ఏ ఆయతుల అర్థంలో సంశయానికి తావు ఉంటుందో వాటిని ముతషాబిహాతున్ అంటారు. ఏ విషయాలైతే మానవ ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాయో వాటిని వివరించటానికి, వాటికి దగ్గరగా పోలికవున్న, గోచర విషయాలకు మానవభాషలో లభించే పదాలు ఉపయోగించబడిన ఆయతులు. ఉదా: స్వర్గం, నరకం మొదలైనవి. కావున మానవుడు ముతషాబిహాత్ లను చదివేటప్పుడు వాటిని ము'హ్ కమాత్ ల వెలుగులో అర్తం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఖుర్ఆన్ వాటిని ఉమ్ముల్ కితాబ్ - గ్రంథమూలాలు, అన్నది.
|
هُوَ ٱلَّذِىٓ أَنزَلَ عَلَيْكَ ٱلْكِتَٰبَ مِنْهُ ءَايَٰتٌۭ مُّحْكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلْكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٌۭ ۖ فَأَمَّا ٱلَّذِينَ فِى قُلُوبِهِمْ زَيْغٌۭ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنْهُ ٱبْتِغَآءَ ٱلْفِتْنَةِ وَٱبْتِغَآءَ تَأْوِيلِهِۦ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُ ۗ وَٱلرَّٰسِخُونَ فِى ٱلْعِلْمِ يَقُولُونَ ءَامَنَّا بِهِۦ كُلٌّۭ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُو۟لُوا۟ ٱلْأَلْبَٰبِ. ﴿7﴾ |
|
8
(వారు ఇలా అంటారు): "ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు. [1]
[1] అల్ - వహ్హాబ్: Bestower. సర్వవర ప్రదాత, సర్వప్రదుడు. పరమదాత, ఉదారంగా దానం చేసేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. ఇంకా చూడండి, 38:35, 38:9.
|
رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ ٱلْوَهَّابُ. ﴿8﴾ |
|
9
"ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినమున సమావేశపరచే వాడవు[1]. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగం చేయడు."
[1] జామి'ఉ (అల్-జామి'ఉ) : The collector of the created beings for the Day of Reckoning. సమావేశపరచేవాడు, ప్రోగుచేసేవాడు, కూడబెట్టేవాడు. పై రెండు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, 4:140, 77:38.
|
رَبَّنَآ إِنَّكَ جَامِعُ ٱلنَّاسِ لِيَوْمٍۢ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ ٱللَّهَ لَا يُخْلِفُ ٱلْمِيعَادَ. ﴿9﴾ |
| 10 నిశ్చయంగా, సత్యతిరస్కారులైన వారికి వారి ధనం గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ కు ప్రతికూలంగా ఏ మాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు. | إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَن تُغْنِىَ عَنْهُمْ أَمْوَٰلُهُمْ وَلَآ أَوْلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيْـًۭٔا ۖ وَأُو۟لَٰٓئِكَ هُمْ وَقُودُ ٱلنَّارِ. ﴿10﴾ |
| 11 వారి ముగింపు ఫిర్ఔను జాతి మరియు వారికి ముందున్న వారి వలే ఉంటుంది. వారు మా సూచనలను (ఆజ్ఞలను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా, వారిని పట్టుకున్నాడు. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు. | كَدَأْبِ ءَالِ فِرْعَوْنَ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَٱللَّهُ شَدِيدُ ٱلْعِقَابِ. ﴿11﴾ |
| 12 (ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: "మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమ చేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము!" | قُل لِّلَّذِينَ كَفَرُوا۟ سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ ٱلْمِهَادُ. ﴿12﴾ |
|
13
వాస్తవానికి (బద్ర్ యుద్ధ రంగంలో) మార్కొనిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడేది మరియు రెండవది సత్యతిరస్కారులది. వారు (విశ్వాసులు) వారిని (సత్యతిరస్కారులను) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమ కళ్ళారా చూశారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారిని తన సహాయంతో (విజయంతో) బలపరుస్తాడు. నిశ్చయంగా, దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠముంది[1].
[1] చూడండి, 8:44. ఇది 2వ హిజ్రీ శకంలో రమ'దాన్ నెలలో జరిగిన బద్ర్ యుద్ధ విషయం. ఆ యుద్ధంలో ముస్లింలు దాదాపు 313 మంది ఉన్నారు. మరియు మక్కా ముష్రికులు వేయి మంది ఉన్నారు. ఇది ముస్లింల మరియు ముష్రిక్ ఖురైషుల మధ్య జరిగిన మొదటి యుద్ధం. ఖురైషులు ఎంతో యుద్ధ సామగ్రి తీసుకొని వచ్చారు. ముస్లింలు పోరాటకు సిద్ధపడి రాకపోయినప్పటికీ, వారికి అల్లాహ్ (సు.తా.) సహాయం లభించి, గెలుపొందారు.
|
قَدْ كَانَ لَكُمْ ءَايَةٌۭ فِى فِئَتَيْنِ ٱلْتَقَتَا ۖ فِئَةٌۭ تُقَٰتِلُ فِى سَبِيلِ ٱللَّهِ وَأُخْرَىٰ كَافِرَةٌۭ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْىَ ٱلْعَيْنِ ۚ وَٱللَّهُ يُؤَيِّدُ بِنَصْرِهِۦ مَن يَشَآءُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةًۭ لِّأُو۟لِى ٱلْأَبْصَٰرِ. ﴿13﴾ |
|
14
స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి-బంగారు రాసులు, మేలు జాతి గుర్రాలు, పశువులు, పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయబడింది[1]. ఇదంతా ఇహలోక జీవనభోగం. కానీ, అసలైన గమ్యస్థానం అల్లాహ్ వద్దనే ఉంది.
[1] చూడండి, 18:7.
|
زُيِّنَ لِلنَّاسِ حُبُّ ٱلشَّهَوَٰتِ مِنَ ٱلنِّسَآءِ وَٱلْبَنِينَ وَٱلْقَنَٰطِيرِ ٱلْمُقَنطَرَةِ مِنَ ٱلذَّهَبِ وَٱلْفِضَّةِ وَٱلْخَيْلِ ٱلْمُسَوَّمَةِ وَٱلْأَنْعَٰمِ وَٱلْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ وَٱللَّهُ عِندَهُۥ حُسْنُ ٱلْمَـَٔابِ. ﴿14﴾ |
| 15 ఇలా చెప్పు: "ఏమీ? వాటి కంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు మరియు వారికి అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది." మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. | ۞ قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍۢ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ ٱتَّقَوْا۟ عِندَ رَبِّهِمْ جَنَّٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَأَزْوَٰجٌۭ مُّطَهَّرَةٌۭ وَرِضْوَٰنٌۭ مِّنَ ٱللَّهِ ۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِٱلْعِبَادِ. ﴿15﴾ |
| 16 ఎవరైతే : "ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు." అని పలుకుతారో! | ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ إِنَّنَآ ءَامَنَّا فَٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ ٱلنَّارِ. ﴿16﴾ |
|
17
(అలాంటి వారే!) సహనశీలురు, సత్యవంతులు మరియు వినయ విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువ జామున[1] తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.
[1] చూడండి, 51:18.
|
ٱلصَّٰبِرِينَ وَٱلصَّٰدِقِينَ وَٱلْقَٰنِتِينَ وَٱلْمُنفِقِينَ وَٱلْمُسْتَغْفِرِينَ بِٱلْأَسْحَارِ. ﴿17﴾ |
|
18
నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు[1]. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
[1] ఖాయిమన్ బిల్ ఖి'స్త్: Maintains His creation in Justice. న్యాయపరిరక్షకుడు, అల్ - ముఖ్సి'త్ : (సేకరించబడిన పదం) The Equitable, Justly. నిష్పక్షపాతుడు, న్యాయవంతుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
|
شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلْمَلَٰٓئِكَةُ وَأُو۟لُوا۟ ٱلْعِلْمِ قَآئِمًۢا بِٱلْقِسْطِ ۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ. ﴿18﴾ |
|
19
నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే[1]. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).
[1] చూడండి, 3:85 మరియు 7:158, 25:1.
|
إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلْإِسْلَٰمُ ۗ وَمَا ٱخْتَلَفَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْعِلْمُ بَغْيًۢا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِـَٔايَٰتِ ٱللَّهِ فَإِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ. ﴿19﴾ |
|
20
(ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: "నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులం (ముస్లిములం) అయ్యాము." మరియు గ్రంథ ప్రజలతో మరియు నిరక్ష్యరాస్యులతో (చదువురాని అరబ్బులతో): "ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?" అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు[1].
[1] చూడండి, 2:96, 3:85.
|
فَإِنْ حَآجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِىَ لِلَّهِ وَمَنِ ٱتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَٱلْأُمِّيِّۦنَ ءَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا۟ فَقَدِ ٱهْتَدَوا۟ ۖ وَّإِن تَوَلَّوْا۟ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَٰغُ ۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِٱلْعِبَادِ. ﴿20﴾ |
| 21 నిశ్చయంగా, అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉందని తెలియజెయ్యి. | إِنَّ ٱلَّذِينَ يَكْفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقْتُلُونَ ٱلنَّبِيِّۦنَ بِغَيْرِ حَقٍّۢ وَيَقْتُلُونَ ٱلَّذِينَ يَأْمُرُونَ بِٱلْقِسْطِ مِنَ ٱلنَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ. ﴿21﴾ |
| 22 అలాంటి వారి కర్మలు ఇహలోక మందును మరియు పరలోక మందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు. | أُو۟لَٰٓئِكَ ٱلَّذِينَ حَبِطَتْ أَعْمَٰلُهُمْ فِى ٱلدُّنْيَا وَٱلْءَاخِرَةِ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ. ﴿22﴾ |
| 23 ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి మధ్య తీర్పు చేయటానికి, అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని, వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గం వారు విముఖులై, వెనుదిరిగి పోతారు. | أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًۭا مِّنَ ٱلْكِتَٰبِ يُدْعَوْنَ إِلَىٰ كِتَٰبِ ٱللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌۭ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ. ﴿23﴾ |
|
24
వారు అలా చేయటానికి కారణం వారు: "నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది[1].
[1] చూడండి, 2:80.
|
ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا۟ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامًۭا مَّعْدُودَٰتٍۢ ۖ وَغَرَّهُمْ فِى دِينِهِم مَّا كَانُوا۟ يَفْتَرُونَ. ﴿24﴾ |
| 25 నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశ పరచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు. | فَكَيْفَ إِذَا جَمَعْنَٰهُمْ لِيَوْمٍۢ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍۢ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ. ﴿25﴾ |
|
26
ఇలా అను: "ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి![1] నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే[2] మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్ధుడవు.
[1] మాలిక్ అల్ - ముల్క్: Sovereign of the Universe, విశ్వసామ్రాట్టు, విశ్వసామ్రాజ్యాధిపతి. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 20:114 వ్యాఖ్యానం 2. [2] చూడండి, 3:73.
|
قُلِ ٱللَّهُمَّ مَٰلِكَ ٱلْمُلْكِ تُؤْتِى ٱلْمُلْكَ مَن تَشَآءُ وَتَنزِعُ ٱلْمُلْكَ مِمَّن تَشَآءُ وَتُعِزُّ مَن تَشَآءُ وَتُذِلُّ مَن تَشَآءُ ۖ بِيَدِكَ ٱلْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ. ﴿26﴾ |
| 27 "నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవుల నుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవుల నుండి తీస్తావు. మరియు నీవు కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు." | تُولِجُ ٱلَّيْلَ فِى ٱلنَّهَارِ وَتُولِجُ ٱلنَّهَارَ فِى ٱلَّيْلِ ۖ وَتُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَتُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ ۖ وَتَرْزُقُ مَن تَشَآءُ بِغَيْرِ حِسَابٍۢ. ﴿27﴾ |
|
28
విశ్వాసులు - తమ తోటి విశ్వాసులను విడిచి - సత్యతిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్ తో ఏ విధమైన సంబంధం లేదు. కాని, వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప! అల్లాహ్ (ఆయనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు[1]. మరియు అల్లాహ్ వైపుకే మీ మరలింపు ఉంది.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 9 'హదీస్' నం. 500. ఇంకా చూడండి 2:257, 54:139. అల్లాహ్ (సు.తా.) విశ్వాసుల ఆప్త స్నేహితుడు. ఈ ఆయత్ యొక్క ఉద్దేశం, వారితో స్నేహభావంతో కలిసి మెలసి ఉండగూడదని కాదు. ఎవరైతే మీతో మంచిగా ఉంటారో వారితో సహృదయంతో మెలుగుతూ వారితో ఇచ్చి పుచ్చుకోవడాలు, వ్యాపారాలు కూడా చేయవచ్చు.
|
لَّا يَتَّخِذِ ٱلْمُؤْمِنُونَ ٱلْكَٰفِرِينَ أَوْلِيَآءَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ ٱللَّهِ فِى شَىْءٍ إِلَّآ أَن تَتَّقُوا۟ مِنْهُمْ تُقَىٰةًۭ ۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفْسَهُۥ ۗ وَإِلَى ٱللَّهِ ٱلْمَصِيرُ. ﴿28﴾ |
| 29 వారితో ఇలా అను: "మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్ కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు." | قُلْ إِن تُخْفُوا۟ مَا فِى صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ ٱللَّهُ ۗ وَيَعْلَمُ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ. ﴿29﴾ |
| 30 ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్ (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ఎడల ఎంతో కనికరుడు. | يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍۢ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍۢ مُّحْضَرًۭا وَمَا عَمِلَتْ مِن سُوٓءٍۢ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُۥٓ أَمَدًۢا بَعِيدًۭا ۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفْسَهُۥ ۗ وَٱللَّهُ رَءُوفٌۢ بِٱلْعِبَادِ. ﴿30﴾ |
| 31 (ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత." | قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِى يُحْبِبْكُمُ ٱللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَٱللَّهُ غَفُورٌۭ رَّحِيمٌۭ. ﴿31﴾ |
|
32
(ఇంకా) ఇలా అను: "అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. "వారు కాదంటే! నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసుకోవాలి)[1].
[1] పై ఆయత్ లో మరియు ఈ ఆయత్ లో అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞాపాలనతో బాటు ము'హమ్మద్ ('స'అస) ను అనుసరించటం వల్లనే మోక్షం దొరుకుతుందని వ్యక్తపరచబడింది. దీనిని తిరస్కరించే వారిని అల్లాహుతా'ఆలా ఎన్నడూ ప్రేమించడు. చూడండి, 3:85.
|
قُلْ أَطِيعُوا۟ ٱللَّهَ وَٱلرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا۟ فَإِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْكَٰفِرِينَ. ﴿32﴾ |
|
33
నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని (ఆయా కాలపు) సర్వలోకాల (ప్రజలపై) ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు[1].
[1] ప్రవక్తల సంతతిలో ఇద్దరు 'ఇమ్రాన్ లు పేర్కొనబడ్డారు: 1) మూసా మరియు హారూన్ ('అలైహిమ్ స.)ల తండ్రి 'ఇమ్రాన్ మరియు 2) మర్యమ్ తండ్రి 'ఇమ్రాన్. ఇక్కడ పేర్కొనబడ్డ 'ఇమ్రాన్ గారు, మర్యమ్ ('అ.స.) తండ్రి అని వ్యాఖ్యాతల అభిప్రాయం. (ఖు'ర్తుబీ, ఇబ్నె - కసీ'ర్).
|
۞ إِنَّ ٱللَّهَ ٱصْطَفَىٰٓ ءَادَمَ وَنُوحًۭا وَءَالَ إِبْرَٰهِيمَ وَءَالَ عِمْرَٰنَ عَلَى ٱلْعَٰلَمِينَ. ﴿33﴾ |
| 34 వారంతా ఒకే పరంపరకు చెందినవారు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. | ذُرِّيَّةًۢ بَعْضُهَا مِنۢ بَعْضٍۢ ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ. ﴿34﴾ |
|
35
ఇమ్రాన్ భార్య ప్రార్థించింది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా గర్భము నందున్న శిశువును నీ సేవకు అంకితం[1] చేయటానికి మొక్కుకున్నాను, కావున నా నుండి దీనిని తప్పక స్వీకరించు. నిశ్చయంగా నీవే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు."
[1] ము'హర్రరన్: అంటే నీ ఆలయసేవకు అంకితం చేస్తున్నాను అని అర్థం.
|
إِذْ قَالَتِ ٱمْرَأَتُ عِمْرَٰنَ رَبِّ إِنِّى نَذَرْتُ لَكَ مَا فِى بَطْنِى مُحَرَّرًۭا فَتَقَبَّلْ مِنِّىٓ ۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ. ﴿35﴾ |
|
36
తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్) ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించుకున్నది: "ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను" - ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్ కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటి వాడు కాడు - "మరియు నేను ఈమెకు మర్యమ్ అని పేరు పెట్టాను[1]. మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను!" [2]
[1] 'హాఫి"జ్ ఇబ్నె ఖయ్యిమ్, ఎన్నో హదీసులను పరిశీలించి క్రొత్తగా పుట్టిన బిడ్డ పేరు మొదటిరోజు, లేక మూడవ రోజు లేక ఏడవ రోజు పెట్టటం మంచిదని అన్నారు. [2] క్రొత్తగా పుట్టిన ప్రతి బిడ్డను షై'తాన్ తాకుతాడు దానితో ఆ బిడ్డ ఏడుస్తోంది. కాని అల్లాహ్ (సు.తా.) ఈ షై'తాన్ తాకటం నుండి మర్యమ్ మరియు 'ఈసా ('అ.స.) లను ఇద్దరినీ రక్షించాడు. ('స. బు'ఖారీ, కితాబ్ అత్ తఫ్సీర్; ముస్లిం, కితాబ్ అల్ ఫ'దాయిల్).
|
فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّى وَضَعْتُهَآ أُنثَىٰ وَٱللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ ٱلذَّكَرُ كَٱلْأُنثَىٰ ۖ وَإِنِّى سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّىٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيْطَٰنِ ٱلرَّجِيمِ. ﴿36﴾ |
|
37
ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను 'జకరియ్యా సంరక్షణలో ఉంచాడు[1]. జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: "ఓ మర్యమ్, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?" ఆమె ఇలా జవాబిచ్చేది: "ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది." నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.
[1] 'జకరియ్యా ('అ.స.) మర్యమ్ తల్లి సోదరి అయిన ఎలిసబెత్ భర్త. వారి తండ్రి పేరు హారూన్. కావున ఆమె (మర్యమ్) ను హారూన్ సోదరి అని ఖుర్ఆన్ (19:28)లో పేర్కొనబడింది. మర్యమ్ మరియు య'హ్యా ('అలైహిమ్ స.లు) ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ బిడ్డలు అని కొందరు వ్యాఖ్యాతలు అంటారు. చూడండి, 19:8 వ్యాఖ్యానం 2. మర్యమ్ ('అ.స.) తండ్రి పేరు 'ఇమ్రాన్, మూసా మరియు హారూన్ ('అలైహిమ్ స.)ల తండ్రి పేరు కూడా 'ఇమ్రాన్ (Amran). హారూన్ ('అ.స.) సంతతిలో చాలా మంది మత గురువులు (Priests) వచ్చారు. చూడండి, 19:28 వ్యాఖ్యానం 1.
|
فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍۢ وَأَنۢبَتَهَا نَبَاتًا حَسَنًۭا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا ٱلْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًۭا ۖ قَالَ يَٰمَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ ٱللَّهِ ۖ إِنَّ ٱللَّهَ يَرْزُقُ مَن يَشَآءُ بِغَيْرِ حِسَابٍ. ﴿37﴾ |
| 38 అప్పుడు జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే ప్రార్థనలను వినేవాడవు." | هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُۥ ۖ قَالَ رَبِّ هَبْ لِى مِن لَّدُنكَ ذُرِّيَّةًۭ طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ ٱلدُّعَآءِ. ﴿38﴾ |
|
39
తరువాత అతను (జకరియ్యా) తన గదిలో నిలబడి నమాజ్ చేస్తున్నప్పుడు దేవదూతలు: "నిశ్చయంగా, అల్లాహ్ నీకు యహ్యా యొక్క శుభవార్తను ఇస్తున్నాడు. అతను, అల్లాహ్ వాక్కును ధృవ పరుస్తాడు.[1] అతను మంచి నాయకుడు మరియు మనో నిగ్రహం గల ప్రవక్త అయి సద్వర్తనులలో చేరిన వాడవుతాడు." అని వినిపించారు.
[1] అల్లాహ్ (సు.తా.) వాక్కును ధృవపరుస్తాడు - అంటే 'ఈసా (అ.స.) ను, ప్రవక్త అని మరియు అతనిపై ఇంజీల్ అవతరింపజేయబడిందని ధృవపరుస్తాడు అని అర్థం. య'హ్యా 'అ.స. (John), 'ఈసా ('అ.స.) కంటే పెద్దవారు. వీరిద్దరు ఒకరినొకరు బలపరచుకున్నారు.
|
فَنَادَتْهُ ٱلْمَلَٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌۭ يُصَلِّى فِى ٱلْمِحْرَابِ أَنَّ ٱللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًۢا بِكَلِمَةٍۢ مِّنَ ٱللَّهِ وَسَيِّدًۭا وَحَصُورًۭا وَنَبِيًّۭا مِّنَ ٱلصَّٰلِحِينَ. ﴿39﴾ |
|
40
అతను (జకరియ్యా) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు ముసలితనం వచ్చింది మరియు నా భార్యనేమో గొడ్రాలు!" ఆయన అన్నాడు: "అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరింది చేస్తాడు."[1]
[1] య'హ్యా ('అ.స.), 'ఈసా ('అ.స.) కంటే పెద్దవారని ఈ ఆత్ వల్ల స్పష్టమౌతోంది. 'ఈసా ('అ.స.) ప్రస్తావన ముందు వస్తుంది.
|
قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِى غُلَٰمٌۭ وَقَدْ بَلَغَنِىَ ٱلْكِبَرُ وَٱمْرَأَتِى عَاقِرٌۭ ۖ قَالَ كَذَٰلِكَ ٱللَّهُ يَفْعَلُ مَا يَشَآءُ. ﴿40﴾ |
| 41 అతను (జకరియ్యా) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా కొరకు ఏదైనా సూచన నియమించు." ఆయన జవాబిచ్చాడు: "నీకు సూచన ఏమిటంటే, నీవు మూడు రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడలేవు. నీవు ఎక్కువగా నీ ప్రభువును స్మరించు. మరియు సాయంకాలము నందును మరియు ఉదయము నందును ఆయన పవిత్రతను కొనియాడు." | قَالَ رَبِّ ٱجْعَل لِّىٓ ءَايَةًۭ ۖ قَالَ ءَايَتُكَ أَلَّا تُكَلِّمَ ٱلنَّاسَ ثَلَٰثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًۭا ۗ وَٱذْكُر رَّبَّكَ كَثِيرًۭا وَسَبِّحْ بِٱلْعَشِىِّ وَٱلْإِبْكَٰرِ. ﴿41﴾ |
| 42 మరియు దేవదూతలు: "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు. మరియు నిన్ను పరిశుద్ధ పరిచాడు. మరియు (నీ కాలపు) సర్వలోకాలలోని స్త్రీలలో నిన్ను ఎన్నుకున్నాడు." అని అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి). | وَإِذْ قَالَتِ ٱلْمَلَٰٓئِكَةُ يَٰمَرْيَمُ إِنَّ ٱللَّهَ ٱصْطَفَىٰكِ وَطَهَّرَكِ وَٱصْطَفَىٰكِ عَلَىٰ نِسَآءِ ٱلْعَٰلَمِينَ. ﴿42﴾ |
|
43
(వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూఉ చేసే)[1] వారితో కలిసి వంగు (రుకూఉ చెయ్యి)."
[1] చూడండి, 2:43 వ్యాఖ్యానం 2.
|
يَٰمَرْيَمُ ٱقْنُتِى لِرَبِّكِ وَٱسْجُدِى وَٱرْكَعِى مَعَ ٱلرَّٰكِعِينَ. ﴿43﴾ |
|
44
(ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపుతున్నాము. మర్యమ్ సంరక్షకుడు ఎవరు కావాలని వారు (ఆలయ సేవకులు) తమ కలములను విసిరినపుడు, నీవు వారి దగ్గర లేవు మరియు వారు వాదించుకున్నపుడు కూడా నీవు వారి దగ్గర లేవు. [1]
[1] ము'హమ్మద్ ('స'అస)కు అగోచర జ్ఞానం లేదు, అని ఈ ఆయత్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఏ ప్రవక్తకు కూడా అల్లాహ్ (సు.తా.) అన్ని విషయాల అగోచర జ్ఞానం ఇవ్వలేదు. అల్లాహుతా'ఆలా తెలపాలనుకున్నంత మట్టుకే వారికి తెలిపాడు.
|
ذَٰلِكَ مِنْ أَنۢبَآءِ ٱلْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَٰمَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ. ﴿44﴾ |
|
45
దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు.[1] అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు.
[1] ఈ ఆయత్ లో కలిమతుల్లాహ్, అల్లాహ్ (సు.తా.) వాక్కు అని 'ఈసా ('అ.స.) సంబోధించబడ్డారు. అంటే అతను తండ్రి లేకుండా కేవలం అల్లాహుతా'ఆలా వాక్కు ద్వారా : "అయిపో" అని అనగానే, (తన తల్లి - మర్యమ్ గర్భంలో) అయిపోయారు; ఏ విధంగానైతే ఆదమ్ ('అ.స.) ను అల్లాహ్ (సు.తా.) తల్లి - దండ్రి లేనిదే మరియు 'హవ్వాను తల్లి లేనిదే సృష్టించాడో! చూడండి, 3:59.
|
إِذْ قَالَتِ ٱلْمَلَٰٓئِكَةُ يَٰمَرْيَمُ إِنَّ ٱللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍۢ مِّنْهُ ٱسْمُهُ ٱلْمَسِيحُ عِيسَى ٱبْنُ مَرْيَمَ وَجِيهًۭا فِى ٱلدُّنْيَا وَٱلْءَاخِرَةِ وَمِنَ ٱلْمُقَرَّبِينَ. ﴿45﴾ |
|
46
"మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు."[1]
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 645.
|
وَيُكَلِّمُ ٱلنَّاسَ فِى ٱلْمَهْدِ وَكَهْلًۭا وَمِنَ ٱلصَّٰلِحِينَ. ﴿46﴾ |
| 47 ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: "అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : 'అయిపో!' అని అంటాడు, అంతే అది అయిపోతుంది." | قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِى وَلَدٌۭ وَلَمْ يَمْسَسْنِى بَشَرٌۭ ۖ قَالَ كَذَٰلِكِ ٱللَّهُ يَخْلُقُ مَا يَشَآءُ ۚ إِذَا قَضَىٰٓ أَمْرًۭا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ. ﴿47﴾ |
| 48 మరియు ఆయన (అల్లాహ్) అతనికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మరియు తౌరాతును మరియు ఇంజీలును నేర్పుతాడు. | وَيُعَلِّمُهُ ٱلْكِتَٰبَ وَٱلْحِكْمَةَ وَٱلتَّوْرَىٰةَ وَٱلْإِنجِيلَ. ﴿48﴾ |
|
49
మరియు అతనిని ఇస్రాయీల్ సంతతి వారి వైపుకు సందేశహరునిగా పంపుతాడు. (అతను ఇలా అంటాడు): "నిశ్చయంగా, నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సూచన (ఆయత్) తీసుకొని వచ్చాను. నిశ్చయంగా, నేను మీ కొరకు మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారుచేసి దానిలో శ్వాసను ఊదుతాను! అప్పుడది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. మరియు నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని,[1] కుష్ఠురోగిని బాగు చేస్తాను మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను. మరియు మీరు తినేది, ఇండ్లలో కూడబెట్టేది మీకు తెలుపుతాను. మీరు విశ్వాసులే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన (ఆయత్) ఉంది.
[1] ఇక్కడ "అల్లాహ్ ఆజ్ఞతో" అని రెండుసార్లు పలకడంతో, 'ఈసా ('అ.స.) తనకు స్వయంగా ఏ విధమైన దివ్యశక్తులు లేవనీ మరియు అతను ఏది చేసినా అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో మాత్రమే చేశారనీ, స్పష్టమవుతోంది.
|
وَرَسُولًا إِلَىٰ بَنِىٓ إِسْرَٰٓءِيلَ أَنِّى قَدْ جِئْتُكُم بِـَٔايَةٍۢ مِّن رَّبِّكُمْ ۖ أَنِّىٓ أَخْلُقُ لَكُم مِّنَ ٱلطِّينِ كَهَيْـَٔةِ ٱلطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًۢا بِإِذْنِ ٱللَّهِ ۖ وَأُبْرِئُ ٱلْأَكْمَهَ وَٱلْأَبْرَصَ وَأُحْىِ ٱلْمَوْتَىٰ بِإِذْنِ ٱللَّهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِى بُيُوتِكُمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ. ﴿49﴾ |
|
50
" మరియు నేను, ప్రస్తుతం తౌరాత్ లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చేయటానికి (వచ్చాను)[1]. మరియు నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి!
[1] ఇవి అల్లాహ్ (సు.తా.) శిక్షగా ఇస్రాయీ'లు సంతతి వారికి 'హరామ్ చేసినవి కావచ్చు. లేక వారి మతగురువులు 'హరామ్ చేసినవి కావచ్చు.
|
وَمُصَدِّقًۭا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ ٱلتَّوْرَىٰةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ ٱلَّذِى حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِـَٔايَةٍۢ مِّن رَّبِّكُمْ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿50﴾ |
| 51 "నిశ్చయంగా, అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము." | إِنَّ ٱللَّهَ رَبِّى وَرَبُّكُمْ فَٱعْبُدُوهُ ۗ هَٰذَا صِرَٰطٌۭ مُّسْتَقِيمٌۭ. ﴿51﴾ |
|
52
ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు[1] ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.
[1] 'హవారియ్యూన్: 'హవారి యొక్క బహువచనం. అంటే సహాయకులు అని అర్థం. ('స. బు'ఖారీ).
|
۞ فَلَمَّآ أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ ٱلْكُفْرَ قَالَ مَنْ أَنصَارِىٓ إِلَى ٱللَّهِ ۖ قَالَ ٱلْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ ٱللَّهِ ءَامَنَّا بِٱللَّهِ وَٱشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ. ﴿52﴾ |
| 53 "ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!" | رَبَّنَآ ءَامَنَّا بِمَآ أَنزَلْتَ وَٱتَّبَعْنَا ٱلرَّسُولَ فَٱكْتُبْنَا مَعَ ٱلشَّٰهِدِينَ. ﴿53﴾ |
| 54 మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు! | وَمَكَرُوا۟ وَمَكَرَ ٱللَّهُ ۖ وَٱللَّهُ خَيْرُ ٱلْمَٰكِرِينَ. ﴿54﴾ |
|
55
(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను[1]. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.
[1] చూడండి, 4:159 మరియు 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 657 మరియు 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, అధ్యాయం - 21.
|
إِذْ قَالَ ٱللَّهُ يَٰعِيسَىٰٓ إِنِّى مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ ٱلَّذِينَ كَفَرُوا۟ وَجَاعِلُ ٱلَّذِينَ ٱتَّبَعُوكَ فَوْقَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِلَىٰ يَوْمِ ٱلْقِيَٰمَةِ ۖ ثُمَّ إِلَىَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ. ﴿55﴾ |
| 56 "ఇక సత్యతిరస్కారులకు ఇహలోకంలో మరియు పరలోకంలోనూ కఠినమైన శిక్ష విధిస్తాను. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు." | فَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ فَأُعَذِّبُهُمْ عَذَابًۭا شَدِيدًۭا فِى ٱلدُّنْيَا وَٱلْءَاخِرَةِ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ. ﴿56﴾ |
| 57 మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (అల్లాహ్) పరిపూర్ణ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు. | وَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ. ﴿57﴾ |
| 58 (ఓ ముహమ్మద్!) మేము నీకు ఈ సూచనలను (ఆయాత్ లను) వినిపిస్తున్నాము. మరియు ఇవి వివేకంతో నిండిన ఉపదేశాలు. | ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ ٱلْءَايَٰتِ وَٱلذِّكْرِ ٱلْحَكِيمِ. ﴿58﴾ |
|
59
నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం, ఆదమ్ ఉపమానం వంటిదే. ఆయన (ఆదమ్ ను) మట్టితో సృజించి: "అయిపో!" అని అన్నాడు. అంతే అతను అయిపోయాడు[1].
[1] ఆదం ('అ.స.) మట్టితో సృష్టించబడ్డారు. చూడండి, 18:37, 22:5, 30:20, 35:11, 40:67.
|
إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ ٱللَّهِ كَمَثَلِ ءَادَمَ ۖ خَلَقَهُۥ مِن تُرَابٍۢ ثُمَّ قَالَ لَهُۥ كُن فَيَكُونُ. ﴿59﴾ |
| 60 ఈ సత్యం నీ ప్రభువు తరఫు నుండి వచ్చింది, కావున నీవు శంకించేవారిలో చేరిన వాడవు కావద్దు. | ٱلْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ ٱلْمُمْتَرِينَ. ﴿60﴾ |
|
61
ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: "రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: 'అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!' అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము." [1]
[1] ఇది 9వ హిజ్రీ విషయం. నజ్రాన్ నుండి క్రైస్తవ బృందం ఒకటి దైవప్రవక్త ('స'అస) తో కలవటానికి మదీనాకు వస్తుంది. వారికి 'ఈసా (అ.స.) గురించి ఉన్న మూఢ విశ్వాసాలను గురించి వాదవివాదాలు జరిగిన తరువాత, దైవప్రవక్త ('స'అస) శపథం (ముబాహలహ్) కొరకు సిద్ధపడ్తారు. ముబాహలహ్ అంటే, తమ తమ కుమారులను మరియు స్త్రీలను ఒకచోట చేర్చి: "ఎవరు అసత్యం పలుకుతున్నారో వారు అల్లాహ్ (సు.తా.) శాపానికి పాత్రులై నశించిపోవు గాక!" అని అల్లాహుతా'ఆలా పేరుతో శపథం చేయటం. శపథం చేయటానికి భయపడి, ఆ క్రైస్తవ నాయకులు జి'జ్ యా ఇవ్వటానికి అంగీకరిస్తారు.
|
فَمَنْ حَآجَّكَ فِيهِ مِنۢ بَعْدِ مَا جَآءَكَ مِنَ ٱلْعِلْمِ فَقُلْ تَعَالَوْا۟ نَدْعُ أَبْنَآءَنَا وَأَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ ٱللَّهِ عَلَى ٱلْكَٰذِبِينَ. ﴿61﴾ |
| 62 నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. | إِنَّ هَٰذَا لَهُوَ ٱلْقَصَصُ ٱلْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ. ﴿62﴾ |
| 63 ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్ కు కల్లలోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు. | فَإِن تَوَلَّوْا۟ فَإِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِٱلْمُفْسِدِينَ. ﴿63﴾ |
|
64
ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు."[1] వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు.[2]
[1] యూదులు 'ఉజైర్ ('అ.స.)ను అల్లాహ్ (సు.తా.) కుమారుడని మరియు క్రైస్తవులు 'ఈసా ('అ.స.)ను అల్లాహుతా'ఆలా కుమారుడని అంటారు. ఇలాంటి వాదాలతో ప్రవక్తలను అల్లాహ్ (సు.తా.)కు భాగస్వాములుగా చేస్తున్నారు. చూడండి, 9:30-31. [2] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 75.
|
قُلْ يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ تَعَالَوْا۟ إِلَىٰ كَلِمَةٍۢ سَوَآءٍۭ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشْرِكَ بِهِۦ شَيْـًۭٔا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ ۚ فَإِن تَوَلَّوْا۟ فَقُولُوا۟ ٱشْهَدُوا۟ بِأَنَّا مُسْلِمُونَ. ﴿64﴾ |
| 65 ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్ లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా? | يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لِمَ تُحَآجُّونَ فِىٓ إِبْرَٰهِيمَ وَمَآ أُنزِلَتِ ٱلتَّوْرَىٰةُ وَٱلْإِنجِيلُ إِلَّا مِنۢ بَعْدِهِۦٓ ۚ أَفَلَا تَعْقِلُونَ. ﴿65﴾ |
| 66 అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడినవారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు. | هَٰٓأَنتُمْ هَٰٓؤُلَآءِ حَٰجَجْتُمْ فِيمَا لَكُم بِهِۦ عِلْمٌۭ فَلِمَ تُحَآجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِۦ عِلْمٌۭ ۚ وَٱللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ. ﴿66﴾ |
|
67
ఇబ్రాహీమ్ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిద్ధాంతంపై ఉన్నవాడు (హనీఫ్), అల్లాహ్ కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు.[1]
[1] చూడండి, 2:135.
|
مَا كَانَ إِبْرَٰهِيمُ يَهُودِيًّۭا وَلَا نَصْرَانِيًّۭا وَلَٰكِن كَانَ حَنِيفًۭا مُّسْلِمًۭا وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ. ﴿67﴾ |
|
68
నిశ్చయంగా, ఇబ్రాహీమ్ తో దగ్గరి సంబంధం గల వారంటే, అతనిని అనుసరించే వారు మరియు ఈ ప్రవక్త (ముహమ్మద్) మరియు (ఇతనిని) విశ్వసించిన వారు. మరియు అల్లాహ్ యే విశ్వాసుల సంరక్షకుడు.[1]
[1] చూడండి, 16:123.
|
إِنَّ أَوْلَى ٱلنَّاسِ بِإِبْرَٰهِيمَ لَلَّذِينَ ٱتَّبَعُوهُ وَهَٰذَا ٱلنَّبِىُّ وَٱلَّذِينَ ءَامَنُوا۟ ۗ وَٱللَّهُ وَلِىُّ ٱلْمُؤْمِنِينَ. ﴿68﴾ |
| 69 గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు. | وَدَّت طَّآئِفَةٌۭ مِّنْ أَهْلِ ٱلْكِتَٰبِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ. ﴿69﴾ |
| 70 "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా!" | يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لِمَ تَكْفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ. ﴿70﴾ |
|
71
"ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు?"[1]
[1] చూడండి, 2:42.
|
يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لِمَ تَلْبِسُونَ ٱلْحَقَّ بِٱلْبَٰطِلِ وَتَكْتُمُونَ ٱلْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ. ﴿71﴾ |
| 72 మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "(ఈ ప్రవక్తను) విశ్వసించిన వారిపై (ముస్లింలపై) అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో!" | وَقَالَت طَّآئِفَةٌۭ مِّنْ أَهْلِ ٱلْكِتَٰبِ ءَامِنُوا۟ بِٱلَّذِىٓ أُنزِلَ عَلَى ٱلَّذِينَ ءَامَنُوا۟ وَجْهَ ٱلنَّهَارِ وَٱكْفُرُوٓا۟ ءَاخِرَهُۥ لَعَلَّهُمْ يَرْجِعُونَ. ﴿72﴾ |
|
73
మరియు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప మరెవ్వరినీ నమ్మకండి." (ఓ ప్రవక్తా!) నీవు వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం." (వారు ఇంకా ఇలా అంటారు): "మీకు ఇవ్వబడినటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని, (నమ్మకండి)." వారితో అను: "నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు." [1]
[1] ఈ వాక్యపు తాత్పర్యం ఈ విధంగా కూడా ఉంది: "ఆయన మీకు (ఒకప్పుడు) ఇచ్చినట్టి దానిని (దివ్యజ్ఞానాన్ని) మరొకనికి కూడా ఇచ్చారని (భయపడుతున్నారా?) లేదా వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని (భయపడుతున్నారా?)" వారితో అను: "నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు."
|
وَلَا تُؤْمِنُوٓا۟ إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ ٱلْهُدَىٰ هُدَى ٱللَّهِ أَن يُؤْتَىٰٓ أَحَدٌۭ مِّثْلَ مَآ أُوتِيتُمْ أَوْ يُحَآجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ ٱلْفَضْلَ بِيَدِ ٱللَّهِ يُؤْتِيهِ مَن يَشَآءُ ۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌۭ. ﴿73﴾ |
| 74 ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో, సర్వోత్తముడు. | يَخْتَصُّ بِرَحْمَتِهِۦ مَن يَشَآءُ ۗ وَٱللَّهُ ذُو ٱلْفَضْلِ ٱلْعَظِيمِ. ﴿74﴾ |
|
75
మరియు గ్రంథ ప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే: నీవతన్ని నమ్మి ఒక్క దీనారు ఇచ్చినా అతడు దానిని - నీవతని వెంట బడితేనే కానీ - నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటి వారు ఏమంటారంటే: "నిరక్ష్యరాస్యుల (యూదులు కాని వారి) పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషం లేదు." మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్ ను గురించి అబద్ధాలాడుతున్నారు.[1]
[1] ఉమ్మియ్యీన్: నిరక్షరాస్యులు, అవివేకులు. అంటే 'అరబ్బులు. "యూదులు కాని వారంతా నిరక్షరాస్యులు, అవివేకులు, కావున వారి పట్ల ఎలా వ్యవహరించినా పాపం కాదు." అని యూదులు అంటారు. అల్లాహ్ (సు.తా.) వారి ఈ వాదాన్ని ఖండిస్తున్నాడు.
|
۞ وَمِنْ أَهْلِ ٱلْكِتَٰبِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍۢ يُؤَدِّهِۦٓ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍۢ لَّا يُؤَدِّهِۦٓ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَآئِمًۭا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا۟ لَيْسَ عَلَيْنَا فِى ٱلْأُمِّيِّۦنَ سَبِيلٌۭ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ. ﴿75﴾ |
| 76 వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా, అల్లాహ్ ప్రేమిస్తాడు. | بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِۦ وَٱتَّقَىٰ فَإِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَّقِينَ. ﴿76﴾ |
| 77 నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారి వైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. | إِنَّ ٱلَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ ٱللَّهِ وَأَيْمَٰنِهِمْ ثَمَنًۭا قَلِيلًا أُو۟لَٰٓئِكَ لَا خَلَٰقَ لَهُمْ فِى ٱلْءَاخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌۭ. ﴿77﴾ |
| 78 మరియు మీరు అది గ్రంథం లోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: "అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది." అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్ పై అబద్ధాలు పలుకుతున్నారు. | وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًۭا يَلْوُۥنَ أَلْسِنَتَهُم بِٱلْكِتَٰبِ لِتَحْسَبُوهُ مِنَ ٱلْكِتَٰبِ وَمَا هُوَ مِنَ ٱلْكِتَٰبِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ ٱللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ ٱللَّهِ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ. ﴿78﴾ |
|
79
ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో: "మీరు అల్లాహ్ కు బదులుగా నన్ను ప్రార్థించండి." అని అనటం తగినది కాదు,[1] కాని వారితో: "మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) కండి." అని అనటం (భావింపదగినది);
[1] ఇక్కడ 'ఈసా ('అ.స.) ను గురించి చెప్పబడింది.
|
مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ ٱللَّهُ ٱلْكِتَٰبَ وَٱلْحُكْمَ وَٱلنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا۟ عِبَادًۭا لِّى مِن دُونِ ٱللَّهِ وَلَٰكِن كُونُوا۟ رَبَّٰنِيِّۦنَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ ٱلْكِتَٰبَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ. ﴿79﴾ |
|
80
మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా? [1]
[1] సయ్యిద్ నా 'ఉమర్ (ర'ది.'అ.) కథనం నేను దైవప్రవక్త ('స.'అస)ను, ఇలా అంటూ ఉండగా విన్నాను: "క్రైస్తవులు మర్యమ్ కుమారుడు 'ఈసా ('అ.స.)ను పొగిడినట్లు, మీరు నన్ను పొగడకండి. నేను కేవలం అల్లాహ్ (సు.తా.) దాసుణ్ణి, కావున నన్ను అల్లాహుతా'ఆలా దాసుడు మరియు ఆయన సందేశహరుడు." అని మాత్రమే అనండి. ('స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హ. నం. 654).
|
وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا۟ ٱلْمَلَٰٓئِكَةَ وَٱلنَّبِيِّۦنَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِٱلْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ. ﴿80﴾ |
|
81
మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని[1] (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.
[1] దీని అర్థమేమిటంటే, ప్రతి ప్రవక్త తన తరువాత వచ్చిన సందేశహరుణ్ణి అనుసరించాలి. ఒకవేళ వారిద్దరూ ఒకేసారి సజీవులై ఉన్నా సరే! ఉదాహరణకు యహ్యా('అ.స.) తన తరువాత వచ్చిన 'ఈసా ('అ.స.)ను అనుసరించారు. ప్రవక్తలు ప్రమాణం చేశారంటే వారిని అనుసరించే ప్రజలు కూడా తమ ప్రవక్తల ప్రమాణాన్ని శిరసావహించాలి.
|
وَإِذْ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلنَّبِيِّۦنَ لَمَآ ءَاتَيْتُكُم مِّن كِتَٰبٍۢ وَحِكْمَةٍۢ ثُمَّ جَآءَكُمْ رَسُولٌۭ مُّصَدِّقٌۭ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِۦ وَلَتَنصُرُنَّهُۥ ۚ قَالَ ءَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِى ۖ قَالُوٓا۟ أَقْرَرْنَا ۚ قَالَ فَٱشْهَدُوا۟ وَأَنَا۠ مَعَكُم مِّنَ ٱلشَّٰهِدِينَ. ﴿81﴾ |
| 82 ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో, వారే దుష్టులు (ఫాసిఖూన్). | فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْفَٰسِقُونَ. ﴿82﴾ |
|
83
ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు.[1]
[1] చూడండి, 13:15.
|
أَفَغَيْرَ دِينِ ٱللَّهِ يَبْغُونَ وَلَهُۥٓ أَسْلَمَ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ طَوْعًۭا وَكَرْهًۭا وَإِلَيْهِ يُرْجَعُونَ. ﴿83﴾ |
| 84 (ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము." | قُلْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ عَلَيْنَا وَمَآ أُنزِلَ عَلَىٰٓ إِبْرَٰهِيمَ وَإِسْمَٰعِيلَ وَإِسْحَٰقَ وَيَعْقُوبَ وَٱلْأَسْبَاطِ وَمَآ أُوتِىَ مُوسَىٰ وَعِيسَىٰ وَٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍۢ مِّنْهُمْ وَنَحْنُ لَهُۥ مُسْلِمُونَ. ﴿84﴾ |
|
85
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. [1]
[1] చూ. 'స. ముస్లిం, పుస్తకం - 1, అధ్యాయం - 240, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హ.నం. 47, 50, 87.
|
وَمَن يَبْتَغِ غَيْرَ ٱلْإِسْلَٰمِ دِينًۭا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِى ٱلْءَاخِرَةِ مِنَ ٱلْخَٰسِرِينَ. ﴿85﴾ |
| 86 అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు నిశ్చయంగా సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారి వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా - సత్యతిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు. | كَيْفَ يَهْدِى ٱللَّهُ قَوْمًۭا كَفَرُوا۟ بَعْدَ إِيمَٰنِهِمْ وَشَهِدُوٓا۟ أَنَّ ٱلرَّسُولَ حَقٌّۭ وَجَآءَهُمُ ٱلْبَيِّنَٰتُ ۚ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ. ﴿86﴾ |
| 87 అలాంటి వారి శిక్ష: నిశ్చయంగా అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే! | أُو۟لَٰٓئِكَ جَزَآؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ ٱللَّهِ وَٱلْمَلَٰٓئِكَةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ. ﴿87﴾ |
| 88 అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు. | خَٰلِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ ٱلْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ. ﴿88﴾ |
|
89
కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాప పడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[1].
[1] అన్సార్ లలో నుండి ఒకడు ఇస్లాం స్వీకరించిన తరువాత 'ముర్తద్' అంటే ఇస్లాంను విడిచి పెట్టి, మళ్లీ ముష్రిక్ అవుతాడు. కాని అతి త్వరలోనే అతనికి తన తప్పు అర్థమవుతుంది. అతడు ఇతరుల ద్వారా దైవప్రవక్త ('స'అస) దగ్గరికి: "ఏమీ? నా పశ్చాత్తాపం అంగీకరించబడునా?" అనే విన్నపంపంపిస్తాడు. అప్పుడు ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి.
|
إِلَّا ٱلَّذِينَ تَابُوا۟ مِنۢ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا۟ فَإِنَّ ٱللَّهَ غَفُورٌۭ رَّحِيمٌ. ﴿89﴾ |
|
90
(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు.[1]
[1] ఇక్కడ పశ్చాత్తాపం, మరణ సమయం ఆసన్నమైనప్పుడు చేసే పశ్చాత్తాపం, అని అర్థం. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తానని దివ్యఖుర్ఆన్ లో ఎన్నోసార్లు అన్నాడు. ఉదారహణకు 42:25, 9:104. కాని జీవితమంతా పాపాలు చేసి, మరణ సమయం ఆసన్నమైనప్పుడు పశ్చాత్తాప పడితే వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించనని 4:18లో వ్యక్తం చేశాడు.
|
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بَعْدَ إِيمَٰنِهِمْ ثُمَّ ٱزْدَادُوا۟ كُفْرًۭا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلضَّآلُّونَ. ﴿90﴾ |
|
91
నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ సత్యతిరస్కార స్థితిలోనే మృతి చెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలిచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.[1]
[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 546. ఇంకా చూడండి, 2:123, 14:31.
|
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَمَاتُوا۟ وَهُمْ كُفَّارٌۭ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ ٱلْأَرْضِ ذَهَبًۭا وَلَوِ ٱفْتَدَىٰ بِهِۦٓ ۗ أُو۟لَٰٓئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌۭ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ. ﴿91﴾ |
|
92
మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు[1]. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.
[1] ఏ వస్తువు దానం చేసినా పుణ్యం దొరుకుతుంది. కాని తనకు నచ్చిన వస్తువులలో నుండి దానం చేస్తే దానికి ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. దానానికి పేదవారైన దగ్గరి బంధువులు ఎవరినైతే పోషించడం విధి కాదో వారు ఎక్కువ హక్కుదారులు. ఇంకా చూడండి, 2:177.
|
لَن تَنَالُوا۟ ٱلْبِرَّ حَتَّىٰ تُنفِقُوا۟ مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا۟ مِن شَىْءٍۢ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٌۭ. ﴿92﴾ |
|
93
ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: "మీరు సత్యవంతులే అయితే, తౌరాత్ ను తీసుకొని రండి మరియు దానిని చదవండి." [1]
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) ధర్మంలో ఒంటె మాంసం మరియు దాని పాలు 'హరాం కావు. కాని ఇస్రాయీ'ల్ (య'అఖూబ్ 'అ.స.) తానే స్వయంగా వీటిని 'హరాం చేసుకున్నాడు. తౌరాత్ మూసా ('అ.స.) పై అవతరింపజేయబడింది. అది య'అఖూబ్ ('అ.స.) గతించిన ఎన్నో సంవత్సరాల తర్వాత అవతరింపజేయబడింది. కావున ఇక్కడ అల్లాహ్ (సు.తా.) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. మరియు తౌరాత్ లో 'హరాం చేయబడిన వస్తువులు, యూదులు చేసిన దుర్మార్గాలకు ఫలితంగా 'హరాం చేయబడ్డాయి. అవి ఇబ్రాహీం ('అ.స.) కాలంలో 'హరాం చేయబడలేదు. చూడండి, 4:160 మరియు 6:146, (అయ్ సర్ అత్ - తఫాసీర్).
|
۞ كُلُّ ٱلطَّعَامِ كَانَ حِلًّۭا لِّبَنِىٓ إِسْرَٰٓءِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَٰٓءِيلُ عَلَىٰ نَفْسِهِۦ مِن قَبْلِ أَن تُنَزَّلَ ٱلتَّوْرَىٰةُ ۗ قُلْ فَأْتُوا۟ بِٱلتَّوْرَىٰةِ فَٱتْلُوهَآ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿93﴾ |
| 94 కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు. | فَمَنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ مِنۢ بَعْدِ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ. ﴿94﴾ |
| 95 ఇలా అను: "అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవసిద్ధాంతం (సత్యధర్మం) అయిన ఇబ్రాహీమ్ ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్ కు సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు." | قُلْ صَدَقَ ٱللَّهُ ۗ فَٱتَّبِعُوا۟ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًۭا وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ. ﴿95﴾ |
|
96
నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది.[1]
[1] చూడండి, 2:125. మక్కాలోని క'అబహ్ పవిత్ర గృహాన్ని ఇబ్రాహీమ్ ('అ.స.) - ఇస్మాయీ'ల్ ('అ.స.) సహాయంతో - అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞానుసారంగా నిర్మించారు. ఇది జెరూసలంలోని - సులైమాన్ ('అ.స.) నిర్మించిన - బైతుల్ మ'ఖ్దిస్ (పవిత్ర గృహం) కంటే ఎంతో ప్రాచీనమైన ఆరాధనా గృహం. కావున ము'హమ్మద్ ('స.అస) - అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో - నమా'జ్ చేసేటప్పుడు తమ ముఖాన్ని క'అబహ్ ('హరమ్) వైపునకు చేయగోరారు. ఇది మానవజాతి కొరకు నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధనాలయం.
|
إِنَّ أَوَّلَ بَيْتٍۢ وُضِعَ لِلنَّاسِ لَلَّذِى بِبَكَّةَ مُبَارَكًۭا وَهُدًۭى لِّلْعَٰلَمِينَ. ﴿96﴾ |
|
97
అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు[1]. మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది[2]. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).
[1] 'హరమ్ సరిహద్దులలో యుద్ధం, హత్య, వేటాడటం మరియు చెట్లను కోయటం కూడా నిషేధించబడ్డాయి. ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స'హీ'హ్ ముస్లిం). [2] ముస్లింలకు ఎవరైతే ఆరోగ్యవంతులై ఉండి 'హజ్ చేయటానికి కావలసిన ఖర్చులు భరించగలిగి వుండి, శాంతియుతంగా ఎలాంటి ధన, ప్రాణ హాని లేకుండా 'హజ్ కు పోగలరో, వారి కొరకు వారి జీవితంలో ఒక్కసారి 'హజ్ యాత్రకు పోవటం విధిగా చేయబడింది, (ఇబ్నె - కసీ'ర్). చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, అధ్యాయం - 1; 'స.ముస్లిం పుస్తకం - 1, అధ్యాయం - 52.
|
فِيهِ ءَايَٰتٌۢ بَيِّنَٰتٌۭ مَّقَامُ إِبْرَٰهِيمَ ۖ وَمَن دَخَلَهُۥ كَانَ ءَامِنًۭا ۗ وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلْبَيْتِ مَنِ ٱسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًۭا ۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِىٌّ عَنِ ٱلْعَٰلَمِينَ. ﴿97﴾ |
|
98
ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా [1] ఉన్నాడు!"
[1] షహీదున్ (అష్-షహీదు): All-Witness, The Omniscient. He from whose knowledge nothing is hidden. సర్వసాక్షి, అన్నీ ఎరిగిన, తన జ్ఞానంతో ప్రతిచోట ఉండేవాడు. చూడండి, 5:117, 58:6.
|
قُلْ يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لِمَ تَكْفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ. ﴿98﴾ |
|
99
ఇంకా ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా అది వక్రమార్గమని చూప దలచి, విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంక పరుస్తున్నారు?[1] మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు."
[1] చూడండి, 2:42.
|
قُلْ يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ مَنْ ءَامَنَ تَبْغُونَهَا عِوَجًۭا وَأَنتُمْ شُهَدَآءُ ۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعْمَلُونَ. ﴿99﴾ |
| 100 ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజల (కొందరి) మాటలు విని వారిని అనుసరిస్తే! వారు మిమ్మల్ని, విశ్వసించిన తరువాత కూడా సత్యతిరస్కారులుగా మార్చి వేస్తారు. | يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن تُطِيعُوا۟ فَرِيقًۭا مِّنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ يَرُدُّوكُم بَعْدَ إِيمَٰنِكُمْ كَٰفِرِينَ. ﴿100﴾ |
| 101 మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; మీరు ఎలా సత్యతిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడో, అతడు నిశ్చయంగా, ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందినవాడే! | وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ ءَايَٰتُ ٱللَّهِ وَفِيكُمْ رَسُولُهُۥ ۗ وَمَن يَعْتَصِم بِٱللَّهِ فَقَدْ هُدِىَ إِلَىٰ صِرَٰطٍۢ مُّسْتَقِيمٍۢ. ﴿101﴾ |
| 102 ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి! | يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ. ﴿102﴾ |
|
103
మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి.[1] అల్లాహ్ మీ యెడల చూపిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు, ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్నిగుండం ఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని!
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "యూదులు 71 తెగులుగా, క్రైస్తవులు 72 తెగలుగా విభజింపబడ్డారు. కాని నా సమాజం వారు 73 తెగలుగా విభజింపబడతారు. వారిలో ఒక్క తెగ తప్ప అందరూ నరకంలో పడవేయబడతారు. ఆ ఒక్క తెగ ఎవరంటే, ఏ విధానంపై నేను మరియు నా 'స'హాబా (ర'ది.'అన్హుమ్) ఉన్నామో దానిని అనుసరించేవారు. అంటే ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త ('స.'అస) యొక్క సున్నత్ పై అమలు చేసేవారు." (తిర్మిజీ', ఇబ్నె - మాజా, అబూ - దావూద్).
|
وَٱعْتَصِمُوا۟ بِحَبْلِ ٱللَّهِ جَمِيعًۭا وَلَا تَفَرَّقُوا۟ ۚ وَٱذْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَآءًۭ فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِۦٓ إِخْوَٰنًۭا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍۢ مِّنَ ٱلنَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمْ ءَايَٰتِهِۦ لَعَلَّكُمْ تَهْتَدُونَ. ﴿103﴾ |
|
104
మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదేశించేదిగా (బోధించేదిగా) మరియు అధర్మాన్ని (చెడును) నిషేధించేదిగా (నిరోధించేదిగా) ఉండాలి[1]. మరియు అలాంటి వారు, వారే సాఫల్యం పొందేవారు.
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 3:110, 114, 9:71, 112 మరియు 22:41.
|
وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌۭ يَدْعُونَ إِلَى ٱلْخَيْرِ وَيَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ ۚ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ. ﴿104﴾ |
|
105
స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు[1]. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.
[1] యూదులు మరియు క్రైస్తవుల మాదిరిగా చూడండి, 6:159.
|
وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ تَفَرَّقُوا۟ وَٱخْتَلَفُوا۟ مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْبَيِّنَٰتُ ۚ وَأُو۟لَٰٓئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌۭ. ﴿105﴾ |
| 106 ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: "మీరు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి." (అని అనబడుతుంది). | يَوْمَ تَبْيَضُّ وُجُوهٌۭ وَتَسْوَدُّ وُجُوهٌۭ ۚ فَأَمَّا ٱلَّذِينَ ٱسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَٰنِكُمْ فَذُوقُوا۟ ٱلْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ. ﴿106﴾ |
| 107 ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లాహ్ కారుణ్యంలో (స్వర్గంలో) ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. | وَأَمَّا ٱلَّذِينَ ٱبْيَضَّتْ وُجُوهُهُمْ فَفِى رَحْمَةِ ٱللَّهِ هُمْ فِيهَا خَٰلِدُونَ. ﴿107﴾ |
| 108 (ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ సూక్తులు (ఆయాత్) మేము వాటిని యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు. | تِلْكَ ءَايَٰتُ ٱللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِٱلْحَقِّ ۗ وَمَا ٱللَّهُ يُرِيدُ ظُلْمًۭا لِّلْعَٰلَمِينَ. ﴿108﴾ |
| 109 మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి. | وَلِلَّهِ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَإِلَى ٱللَّهِ تُرْجَعُ ٱلْأُمُورُ. ﴿109﴾ |
|
110
మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు[1]. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు[2]. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్).
[1] అబూహురైరా కథనం: "మీరే (సత్యధర్మమైన ఇస్లాంను మరియు దైవప్రవక్త ('స'అస) సున్నతులను అనుసరించే వారే), ఉత్తమమైన మానవసమాజానికి చెందినవారు." ('స. బు'ఖారీ పుస్తకం - 6, 'హదీస్' నం. 80). [2] 'అబ్దుల్లాహ్ బిన్ - సల్లాం (ర'ది. 'అ.) వంటి వారు.
|
كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ وَتُؤْمِنُونَ بِٱللَّهِ ۗ وَلَوْ ءَامَنَ أَهْلُ ٱلْكِتَٰبِ لَكَانَ خَيْرًۭا لَّهُم ۚ مِّنْهُمُ ٱلْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ ٱلْفَٰسِقُونَ. ﴿110﴾ |
| 111 వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుద్ధం చేసినట్లయితే, మీకు వీపు చూపించి పారిపోతారు. తరువాత వారికెలాంటి సహాయం లభించదు. | لَن يَضُرُّوكُمْ إِلَّآ أَذًۭى ۖ وَإِن يُقَٰتِلُوكُمْ يُوَلُّوكُمُ ٱلْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ. ﴿111﴾ |
|
112
వారు ఎక్కడున్నా, అవమానానికే గురి చేయబడతారు, అల్లాహ్ శరణులోనో లేక మానవుల అభయంలోనో ఉంటేనే తప్ప; వారు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యారు మరియు వారు అధోగతికి చేరారు. ఇది వారు అల్లాహ్ సూచనలను తిరస్కరించినందుకు మరియు అన్యాయంగా ప్రవక్తలను చంపి నందుకు. ఇది వారి ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.[1]
[1] ఇది యూదులను గురించి చెప్పబడింది.
|
ضُرِبَتْ عَلَيْهِمُ ٱلذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوٓا۟ إِلَّا بِحَبْلٍۢ مِّنَ ٱللَّهِ وَحَبْلٍۢ مِّنَ ٱلنَّاسِ وَبَآءُو بِغَضَبٍۢ مِّنَ ٱللَّهِ وَضُرِبَتْ عَلَيْهِمُ ٱلْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا۟ يَكْفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقْتُلُونَ ٱلْأَنۢبِيَآءَ بِغَيْرِ حَقٍّۢ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا۟ وَّكَانُوا۟ يَعْتَدُونَ. ﴿112﴾ |
| 113 వారందరూ ఒకే రకమైన వారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; వారు రాత్రివేళలందు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) పఠిస్తూ ఉంటారు మరియు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. | ۞ لَيْسُوا۟ سَوَآءًۭ ۗ مِّنْ أَهْلِ ٱلْكِتَٰبِ أُمَّةٌۭ قَآئِمَةٌۭ يَتْلُونَ ءَايَٰتِ ٱللَّهِ ءَانَآءَ ٱلَّيْلِ وَهُمْ يَسْجُدُونَ. ﴿113﴾ |
| 114 వారు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మాన్ని నిషేధిస్తారు (నిరోధిస్తారు) మరియు మంచి పనులు చేయటంలో పోటీ పడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు. | يُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْءَاخِرِ وَيَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ وَيُسَٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَأُو۟لَٰٓئِكَ مِنَ ٱلصَّٰلِحِينَ. ﴿114﴾ |
|
115
మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతి గలవారెవరో అల్లాహ్ కు బాగా తెలుసు[1].
[1] చూడండి, 3:199.
|
وَمَا يَفْعَلُوا۟ مِنْ خَيْرٍۢ فَلَن يُكْفَرُوهُ ۗ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلْمُتَّقِينَ. ﴿115﴾ |
| 116 నిశ్చయంగా, సత్యతిరస్కారానికి పాల్పబడిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికి రావు. మరియు అలాంటివారు నరకాగ్ని వాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు. | إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَن تُغْنِىَ عَنْهُمْ أَمْوَٰلُهُمْ وَلَآ أَوْلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيْـًۭٔا ۖ وَأُو۟لَٰٓئِكَ أَصْحَٰبُ ٱلنَّارِ ۚ هُمْ فِيهَا خَٰلِدُونَ. ﴿116﴾ |
|
117
వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చవచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.[1]
[1] సత్యతిరస్కారుల దానధర్మాలు గానీ, పుణ్యకార్యాలు గానీ వారికి పరలోక జీవితంలో ఏ విధంగాను పనికిరావు ఎందుకంటే విశ్వాసం లేని దానాలు ఫలించవు. మోక్షానికి మూలం విశ్వాసమే. చూడండి, 3:85.
|
مَثَلُ مَا يُنفِقُونَ فِى هَٰذِهِ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا كَمَثَلِ رِيحٍۢ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍۢ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ. ﴿117﴾ |
|
118
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)! [1]
[1] చూడండి, 60:8-9 ఎవరైతే మీ ధర్మం కారణంగా మిమ్మల్ని విరోధించక మీకు హాని చేయక, మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టరో, అట్టివారితో మీరు కరుణతో న్యాయంతో వ్యవహరించండి. కాని ఎవరైతే మీ ధర్మం కారణంగా మీతో పోరాడి మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడతారో, అలాంటి వారు మీ స్నేహితులు కారు, వారితో ధర్మయుద్ధం (జిహాద్) చేయండి.
|
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوا۟ بِطَانَةًۭ مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًۭا وَدُّوا۟ مَا عَنِتُّمْ قَدْ بَدَتِ ٱلْبَغْضَآءُ مِنْ أَفْوَٰهِهِمْ وَمَا تُخْفِى صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ ٱلْءَايَٰتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ. ﴿118﴾ |
| 119 అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్యగ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోదావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: "మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి. నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు." అని అను. | هَٰٓأَنتُمْ أُو۟لَآءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِٱلْكِتَٰبِ كُلِّهِۦ وَإِذَا لَقُوكُمْ قَالُوٓا۟ ءَامَنَّا وَإِذَا خَلَوْا۟ عَضُّوا۟ عَلَيْكُمُ ٱلْأَنَامِلَ مِنَ ٱلْغَيْظِ ۚ قُلْ مُوتُوا۟ بِغَيْظِكُمْ ۗ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ. ﴿119﴾ |
| 120 మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దానినంతా పరివేష్టించి ఉన్నాడు. | إِن تَمْسَسْكُمْ حَسَنَةٌۭ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌۭ يَفْرَحُوا۟ بِهَا ۖ وَإِن تَصْبِرُوا۟ وَتَتَّقُوا۟ لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْـًٔا ۗ إِنَّ ٱللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌۭ. ﴿120﴾ |
|
121
మరియు (ఓ ప్రవక్తా! ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో) నీవు వేకుజామున నీ ఇంటి నుండి బయలుదేరి (ఉహుద్ క్షేత్రంలో) విశ్వాసులను వారి వారి యుద్ధ స్థానాలలో నియమించటానికి వెళ్ళావు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు[1].
[1] ఈ ఆయత్ ఉ'హుద్ యుద్ధం గురించి తెలియజేస్తుందని ధర్మవేత్తల అభిప్రాయం. అది 3వ హిజ్రీ, షవ్వాల్ నెలలో జరిగింది. 2వ హిజ్రీ రమ'దాన్ నెలలో జరిగిన బద్ర్ యుద్ధంలో మక్కా ముష్రికుల సంఖ్య దాదాపు 1000 ఉండెను. వారి వద్ద మంచి యుద్ధ సామగ్రి ఉండెను. ముస్లింలు కేవలం 313 మంది మాత్రమే ఉన్నప్పటికీ, వారి వద్ద సరియైన యుద్ధ సామగ్రి లేకపోయినపప్టికీ అల్లాహుతా'ఆలా సహాయంతో వారు ముష్రికులను ఓడించి వారిలో 70 మందిని సంహరించి, 70 మందిని బందీలుగా చేసుకుంటారు. దాని ప్రతీకారం తీర్చుకునేందుకు మక్కా ఖురైషీయులు 3వ హిజ్రీ షవ్వాల్ నెలలో దాదాపు 3000 మంది యుద్ధవీరులతో మదీనాకు 3 మైళ్ళ దూరంలో ఉన్న ఉ'హుద్ పర్వతం వద్దకు చేరుకుంటారు. దైవప్రవక్త ('స'అస) ఇది తెలుసుకొని తమ సహాబీలతో సంప్రదిస్తారు. దైవప్రవక్త ('స'అస) ఉదేదేశం, మరికొందరు నాయకుల ఉద్దేశం, మదీనా నగరం లోపలనే ఉండి యుద్ధం చేయాలని. కపటవిశ్వాసుల నాయకుడు, 'అబ్దుల్లాహ్ బిన్ - ఉబై కూడా అదే కోరుతాడు. కాని అనేక మంది ముస్లింలు మదీనా నుండి బయటికి పోయి పోరాడాలని కోరుతారు. దైవప్రవక్త ('స'అస) వారి కోరికపై యుద్ధసామగ్రి ధరించి తన ఇంటి నుండి బయటికి వస్తారు. ఈ విధంగా దాదాపు 1000 మంది ముస్లింలతో యుద్ధానికి సిద్ధమై ఉ'హుద్ వైపునకు పోతూ ఉండగా, కపట విశ్వాసుల నాయకుడు 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై - తన మాటను గౌరవించలేదనే సాకుతో - తన 300 మంది అనుచరులతో యుద్ధంలో పాల్గొనకుండా, వెనుదిరిగి పోతాడు. 700 మంది విశ్వాసులు మాత్రమే దైవప్రవక్త ('స'అస) తో పాటు ఉ'హుద్ కు చేరుతారు. అక్కడ 50 మంది బాణాలను బాగా ప్రయోగించగలిగే, విలుకాండ్రను ఒక చిన్న కొండమీద ఉంచి మీరు ఎట్టి పరిస్థితిలోను మీ చోటు విడిచి యుద్ధమైదానంలోకి రావద్దని ఆజ్ఞాపిస్తారు. యుద్ధం ప్రారంభమై ముస్లింలు విజయం పొందుతారు. ముష్రికులు పారిపోసాగుతారు. అది చూసి ఆ విలుకాండ్రు విజయ ధనం దోచుకోవటానికి తమ స్థానాలను విడచి కొండ దిగి వస్తారు. అది చూసి (అప్పుడు ముష్రిక్ గా ఉన్న) 'ఖాలిద్ బిన్ వలీద్ ఒక బృందాన్ని తీసుకొని వెనుక నుండి ముస్లింలపై దాడి చేస్తాడు. ఆకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో ముస్లింలు కలవరపడతారు, ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతారు. మరియు దైవప్రవక్త ('స'అస) కూడా గాయపడి, క్రింద పడిపోతారు. దానితో ఆయన మరణించారని తలచి ముస్లింలు అటూ ఇటూ పారిపోసాగుతారు. కాని 'ఉమర్ మరియు తల్హా (ర'ది.'అన్హుమ్ లు) ఇక దైవప్రవక్తయే లేకుంటే మనము బ్రతికి ప్రయోజనమేమిటని ప్రేరేపించటం వల్ల ముస్లింలు తిరిగి ఐకమత్యంతో పోరాడుతారు. దానితో ఖురైషీలు వెనుదిరిగి పారిపోతారు.
|
وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ ٱلْمُؤْمِنِينَ مَقَٰعِدَ لِلْقِتَالِ ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ. ﴿121﴾ |
|
122
అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంక్షకుడుగా ఉన్నాడు[1] మరియు విశ్వసించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి.
[1] ఈ రెండు తెగల వారు 'ఔస్ మరియు 'ఖజ్ రజ్ అనే అన్సార్ తెగలకు చెందిన, బనూ 'హారిసా' మరియు బనూ సల్మా వర్గాలకు చెందిన వారు. కాని అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం వలన వారి హృదయాలు దృఢపడతాయి.
|
إِذْ هَمَّت طَّآئِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَٱللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ. ﴿122﴾ |
| 123 బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి! | وَلَقَدْ نَصَرَكُمُ ٱللَّهُ بِبَدْرٍۢ وَأَنتُمْ أَذِلَّةٌۭ ۖ فَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ. ﴿123﴾ |
| 124 (ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో : "ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?" అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!) | إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَٰثَةِ ءَالَٰفٍۢ مِّنَ ٱلْمَلَٰٓئِكَةِ مُنزَلِينَ. ﴿124﴾ |
|
125
అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగి వుంటే, శత్రువు వచ్చి ఆకస్మాత్తుగా మీపై పడినా, మీ ప్రభువు ఐదువేల ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు! [1]
[1] చూడండి, 8:9-10.
|
بَلَىٰٓ ۚ إِن تَصْبِرُوا۟ وَتَتَّقُوا۟ وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ ءَالَٰفٍۢ مِّنَ ٱلْمَلَٰٓئِكَةِ مُسَوِّمِينَ. ﴿125﴾ |
| 126 అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగ జేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా! | وَمَا جَعَلَهُ ٱللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِۦ ۗ وَمَا ٱلنَّصْرُ إِلَّا مِنْ عِندِ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ. ﴿126﴾ |
| 127 ఆయన ఇదంతా సత్యతిరస్కారంపై నడిచేవారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగి పోవటానికి (చేశాడు). | لِيَقْطَعَ طَرَفًۭا مِّنَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا۟ خَآئِبِينَ. ﴿127﴾ |
|
128
(ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు[1]. ఆయన (అల్లాహ్) వారిని క్షమించవచ్చు, లేదా వారిని శిక్షించవచ్చు. ఎందుకంటే నిశ్చయంగా, వారు దుర్మార్గులు.
[1] అంటే ఈ సత్యతిరస్కారులను విశ్వాసం వైపునకు మరల్చటం గానీ, లేక వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం గానీ కేవలం అల్లాహుతా'ఆలా అధికారంలోనే ఉంది.
|
لَيْسَ لَكَ مِنَ ٱلْأَمْرِ شَىْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَٰلِمُونَ. ﴿128﴾ |
| 129 మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. | وَلِلَّهِ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ غَفُورٌۭ رَّحِيمٌۭ. ﴿129﴾ |
|
130
ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి[1].
[1] చూడండి, 2:278, అబూహురైరా (ర'ది.'అ.) కథనం, దైవప్రవక్త ('స'అస) ఇలా సెలవిచ్చారు: "ఏడు మహా పాపాల నుండి దూరంగా ఉండండి." స'హాబా (ర'ది.'అన్హుమ్) అడిగారు : "ఓ ప్రవక్తా ('స'అస)! అవి ఏమిటి?" దైవప్రక్త ('స'అస) ఇలా సమాధానమిచ్చారు : "అవి 1) ఆరాధనలలో అల్లాహ్ (సు.తా.) కు భాగస్వాములను కల్పించటం, 2) మంత్ర తంత్రాలు చేయటం, 3) అల్లాహుతా'ఆలా నిషేధించిన ప్రాణిని అన్యాయంగా చంపటం, 4) వడ్డీ తినటం, 5) అనాథుల ఆస్తిని కబళించటం, 6) యుద్ధరంగంలో పిరికితనంతో శత్రువుకు వెన్ను చూపి పారిపోవటం, 7) పతివ్రత స్త్రీలపై నిందలు మోపటం." ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 28).
|
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَأْكُلُوا۟ ٱلرِّبَوٰٓا۟ أَضْعَٰفًۭا مُّضَٰعَفَةًۭ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ. ﴿130﴾ |
| 131 మరియు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి. | وَٱتَّقُوا۟ ٱلنَّارَ ٱلَّتِىٓ أُعِدَّتْ لِلْكَٰفِرِينَ. ﴿131﴾ |
|
132
మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి[1].
[1] చూడండి, 3:85.
|
وَأَطِيعُوا۟ ٱللَّهَ وَٱلرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ. ﴿132﴾ |
| 133 మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితో నొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతి గలవారికై సిద్ధ పరచపడింది. | ۞ وَسَارِعُوٓا۟ إِلَىٰ مَغْفِرَةٍۢ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا ٱلسَّمَٰوَٰتُ وَٱلْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ. ﴿133﴾ |
|
134
(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.[1]
[1] 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 141 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 135.
|
ٱلَّذِينَ يُنفِقُونَ فِى ٱلسَّرَّآءِ وَٱلضَّرَّآءِ وَٱلْكَٰظِمِينَ ٱلْغَيْظَ وَٱلْعَافِينَ عَنِ ٱلنَّاسِ ۗ وَٱللَّهُ يُحِبُّ ٱلْمُحْسِنِينَ. ﴿134﴾ |
|
135
మరియు వారు, ఎవరైతే, అశ్లీల పనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను), బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు! [1]
[1] చూడండి, 42:25.
|
وَٱلَّذِينَ إِذَا فَعَلُوا۟ فَٰحِشَةً أَوْ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ ذَكَرُوا۟ ٱللَّهَ فَٱسْتَغْفَرُوا۟ لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ ٱلذُّنُوبَ إِلَّا ٱللَّهُ وَلَمْ يُصِرُّوا۟ عَلَىٰ مَا فَعَلُوا۟ وَهُمْ يَعْلَمُونَ. ﴿135﴾ |
| 136 ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసేవారికి ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది! | أُو۟لَٰٓئِكَ جَزَآؤُهُم مَّغْفِرَةٌۭ مِّن رَّبِّهِمْ وَجَنَّٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ ٱلْعَٰمِلِينَ. ﴿136﴾ |
| 137 మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచి పోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి. | قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌۭ فَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ. ﴿137﴾ |
| 138 ఇది (ఈ ఖుర్ఆన్) ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం. | هَٰذَا بَيَانٌۭ لِّلنَّاسِ وَهُدًۭى وَمَوْعِظَةٌۭ لِّلْمُتَّقِينَ. ﴿138﴾ |
| 139 కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వాసులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు. | وَلَا تَهِنُوا۟ وَلَا تَحْزَنُوا۟ وَأَنتُمُ ٱلْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ. ﴿139﴾ |
|
140
ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదే విధంగా గాయపడ్డారు[1]. మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికి మరియు (సత్యస్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికి ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.
[1] ఇది ఉ'హుద్ యుద్ధాన్ని సూచిస్తుంది.
|
إِن يَمْسَسْكُمْ قَرْحٌۭ فَقَدْ مَسَّ ٱلْقَوْمَ قَرْحٌۭ مِّثْلُهُۥ ۚ وَتِلْكَ ٱلْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ ٱلنَّاسِ وَلِيَعْلَمَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَآءَ ۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ. ﴿140﴾ |
|
141
మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా[1] చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు)
[1] లియుమ'హ్హి'స: ఈ పదానికి మూడు అర్థాలున్నాయి. 1) to test, పరీక్షించుకటకు, 2) to purify, పరిశుద్ధపరచుటకు, 3) to get rid off, రద్దు చేయుటకు లేక తీసివేయుటకు. (తఫ్సీర్ అల్ - ఖు'ర్తుబీ).
|
وَلِيُمَحِّصَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَيَمْحَقَ ٱلْكَٰفِرِينَ. ﴿141﴾ |
|
142
ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్ చూడక ముందే మరియు సహనం చూపేవారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించ గలరని భావిస్తున్నారా? [1]
[1] చూడండి, 2:214 మరియు 29:2.
|
أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا۟ ٱلْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُوا۟ مِنكُمْ وَيَعْلَمَ ٱلصَّٰبِرِينَ. ﴿142﴾ |
|
143
మరియు వాస్తవానికి మీరు (అల్లాహ్ మార్గంలో మరణించాలని కోరుచుంటిరి![1] అది, మీరు దానిని ప్రత్యక్షంగా చూడక ముందటి విషయం; కాని, మీరు దానిని ఎదురు చూస్తుండగానే, వాస్తవానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది.
[1] మీరు మీ శత్రువులతో పోరాడటానికి ఆశించకండి. అల్లాహ్ (సు.తా.) శరణుకోరండి. కాని పరిస్థితుల వల్ల యుద్ధం ఆవశ్యకమైతే ధైర్యస్థైర్యాలతో పోరాడండి. స్వర్గం కత్తుల ఛాయలో ఉందని తెలుసుకోండి. ('స'హీ'హైన్, ఇబ్నె - కసీ'ర్).
|
وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ ٱلْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ. ﴿143﴾ |
|
144
మరియు ముహమ్మద్[1] కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచి పోయారు[2]. ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్యచేయబడితే, మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? మరియు వెనుకంజ వేసి మరలిపోయేవాడు అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
[1] ము'హమ్మద్ ('స'అస) పేరు ఖుర్ఆన్ లో 4 సార్లు వచ్చింది. ఇంకా చూడండి, 33:40, 47:2 మరియు 48:29. అ'హ్మద్ ('స 'అస) అని 61:6లో వచ్చింది. [2] ఉ'హుద్ యుద్ధంలో ము'హమ్మద్ ('స'అస) మరణించారనే వార్త వ్యాపించగానే ముస్లింలు ధైర్యాన్ని కోల్పోయి, యుద్ధరంగం నుండి వెనుకంజ వేయసాగుతారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఇంతకు ముందు కూడా సందేశహరులు హత్య చేయబడ్డారు. మరి దైవప్రవక్త ('స'అస) హత్య చేయబడితే మీరెందుకు వెనుకంజ వేయాలి? మీరు కూడా ధైర్యంతో, శత్రువులతో పోరాడి మరణిస్తే, స్వర్గానికి అర్హులవుతారు, విజయం పొందితే విజయధనానికి. కాని వెనుకంజ వేసి, మరణిస్తే, నరకం పాలవుతారు. లేదా యుద్ధఖైదీలై, బానిసలై మీ ఆత్మాభిమానాన్ని కోల్పోతారు. ఒక 'హదీస్' : ము'హమ్మద్ ('స'అస) మరణించిన రోజు అబూబక్ర్ (ర'ది.'అ.) ఇలా అన్నారు: "ఎవరైతే ము'హమ్మద్ ('స'అస) ను ఆరాధిస్తారో, వారు ము'హమ్మద్ ('స'అస) గతించిపోయారని తెలుసుకోవాలి. కాని ఎవరైతే కేవలం అల్లాహ్ (సు.తా.) ఆరాధిస్తారో, ఆయన నిత్యుడు, సజీవుడు అని తెలుసుకోవాలి." ('స. బు'ఖారీ).
|
وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌۭ قَدْ خَلَتْ مِن قَبْلِهِ ٱلرُّسُلُ ۚ أَفَإِي۟ن مَّاتَ أَوْ قُتِلَ ٱنقَلَبْتُمْ عَلَىٰٓ أَعْقَٰبِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ ٱللَّهَ شَيْـًۭٔا ۗ وَسَيَجْزِى ٱللَّهُ ٱلشَّٰكِرِينَ. ﴿144﴾ |
| 145 అల్లాహ్ అనుమతి లేనిదే, ఏ ప్రాణి కూడా మరణించజాలదు, దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. మరియు ఎవడైతే ఈ ప్రపంచ సుఖాన్ని కోరుకుంటాడో, మేము అతనికది నొసంగుతాము మరియు ఎవడు పరలోక సుఖాన్ని కోరుకుంటాడో అతనికది నొసంగుతాము. మరియు మేము కృతజ్ఞులైన వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించగలము. | وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ ٱللَّهِ كِتَٰبًۭا مُّؤَجَّلًۭا ۗ وَمَن يُرِدْ ثَوَابَ ٱلدُّنْيَا نُؤْتِهِۦ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ ٱلْءَاخِرَةِ نُؤْتِهِۦ مِنْهَا ۚ وَسَنَجْزِى ٱلشَّٰكِرِينَ. ﴿145﴾ |
| 146 మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతోమంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్) ధర్మ యుద్ధాలు చేశారు, అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి (శత్రువులకు) లోబడనూ లేదు. మరియు అల్లాహ్ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు. | وَكَأَيِّن مِّن نَّبِىٍّۢ قَٰتَلَ مَعَهُۥ رِبِّيُّونَ كَثِيرٌۭ فَمَا وَهَنُوا۟ لِمَآ أَصَابَهُمْ فِى سَبِيلِ ٱللَّهِ وَمَا ضَعُفُوا۟ وَمَا ٱسْتَكَانُوا۟ ۗ وَٱللَّهُ يُحِبُّ ٱلصَّٰبِرِينَ. ﴿146﴾ |
| 147 మరియు వారి ప్రార్థన కేవలం: "ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరి పోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్యతిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు." అని పలకటం మాత్రమే! | وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّآ أَن قَالُوا۟ رَبَّنَا ٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِىٓ أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَٰفِرِينَ. ﴿147﴾ |
| 148 కావున అల్లాహ్ వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు. | فَـَٔاتَىٰهُمُ ٱللَّهُ ثَوَابَ ٱلدُّنْيَا وَحُسْنَ ثَوَابِ ٱلْءَاخِرَةِ ۗ وَٱللَّهُ يُحِبُّ ٱلْمُحْسِنِينَ. ﴿148﴾ |
| 149 ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు. | يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن تُطِيعُوا۟ ٱلَّذِينَ كَفَرُوا۟ يَرُدُّوكُمْ عَلَىٰٓ أَعْقَٰبِكُمْ فَتَنقَلِبُوا۟ خَٰسِرِينَ. ﴿149﴾ |
| 150 వాస్తవానికి! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు. | بَلِ ٱللَّهُ مَوْلَىٰكُمْ ۖ وَهُوَ خَيْرُ ٱلنَّٰصِرِينَ. ﴿150﴾ |
| 151 ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింపజేయనిదే, అల్లాహ్ కు సాటి కల్పించినందుకు, మేము సత్యతిరస్కారుల హృదయాలలో ఘోర భయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతి చెడ్డ నివాసం. | سَنُلْقِى فِى قُلُوبِ ٱلَّذِينَ كَفَرُوا۟ ٱلرُّعْبَ بِمَآ أَشْرَكُوا۟ بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ سُلْطَٰنًۭا ۖ وَمَأْوَىٰهُمُ ٱلنَّارُ ۚ وَبِئْسَ مَثْوَى ٱلظَّٰلِمِينَ. ﴿151﴾ |
|
152
మరియు వాస్తవానికి అల్లాహ్ మీకు చేసిన తన వాగ్దానాన్ని సత్యపరచాడు. ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్యతిరస్కారులను) చంపుతూ ఉన్నారో![1] తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విభేదాలకు గురి అయ్యి - ఆయన (అల్లాహ్) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే - (మీ నాయకుని) ఆజ్ఞను ఉల్లంఘించారు[2]. (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. [3] మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మలన్ని క్షమించాడు. మరియు అల్లాహ్ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు.
[1] ఇది విశ్వాసులకు మొదట లభించిన విజయం. [2] ఇది ఉ'హుద్ యుద్ధంలో గుట్ట మీద ఉంచబడిన 50 మంది విలుకాండ్ర విషయం. [3] శబ్దార్థ ప్రకారం : మీ విరోధుల యెదుట మిమ్మల్ని పారిపోయేటట్లు చేశాడు.
|
وَلَقَدْ صَدَقَكُمُ ٱللَّهُ وَعْدَهُۥٓ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِۦ ۖ حَتَّىٰٓ إِذَا فَشِلْتُمْ وَتَنَٰزَعْتُمْ فِى ٱلْأَمْرِ وَعَصَيْتُم مِّنۢ بَعْدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلْءَاخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَٱللَّهُ ذُو فَضْلٍ عَلَى ٱلْمُؤْمِنِينَ. ﴿152﴾ |
| 153 (జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేసాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును. | ۞ إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُۥنَ عَلَىٰٓ أَحَدٍۢ وَٱلرَّسُولُ يَدْعُوكُمْ فِىٓ أُخْرَىٰكُمْ فَأَثَٰبَكُمْ غَمًّۢا بِغَمٍّۢ لِّكَيْلَا تَحْزَنُوا۟ عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَآ أَصَٰبَكُمْ ۗ وَٱللَّهُ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ. ﴿153﴾ |
| 154 అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు - కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యత నిచ్చేవారు, అల్లాహ్ ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు - ఇలా అన్నారు: "ఏమీ? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్ దే!" వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు: "మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు." వారికి ఇలా జవాబివ్వు: "ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు." మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి వున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధ పరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. | ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّنۢ بَعْدِ ٱلْغَمِّ أَمَنَةًۭ نُّعَاسًۭا يَغْشَىٰ طَآئِفَةًۭ مِّنكُمْ ۖ وَطَآئِفَةٌۭ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ ظَنَّ ٱلْجَٰهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلْأَمْرِ مِن شَىْءٍۢ ۗ قُلْ إِنَّ ٱلْأَمْرَ كُلَّهُۥ لِلَّهِ ۗ يُخْفُونَ فِىٓ أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ ٱلْأَمْرِ شَىْءٌۭ مَّا قُتِلْنَا هَٰهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِى بُيُوتِكُمْ لَبَرَزَ ٱلَّذِينَ كُتِبَ عَلَيْهِمُ ٱلْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِىَ ٱللَّهُ مَا فِى صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِى قُلُوبِكُمْ ۗ وَٱللَّهُ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ. ﴿154﴾ |
| 155 రెండు సైన్యాలు (ఉహుద్ యుద్ధానికి) తలబడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని - వారు చేసుకున్న వాటికి (కర్మలకు) ఫలితంగా - షైతాను వారి పాదాలను జార్చాడు. అయినా, వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు. | إِنَّ ٱلَّذِينَ تَوَلَّوْا۟ مِنكُمْ يَوْمَ ٱلْتَقَى ٱلْجَمْعَانِ إِنَّمَا ٱسْتَزَلَّهُمُ ٱلشَّيْطَٰنُ بِبَعْضِ مَا كَسَبُوا۟ ۖ وَلَقَدْ عَفَا ٱللَّهُ عَنْهُمْ ۗ إِنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٌۭ. ﴿155﴾ |
|
156
ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుద్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే) వారిని గురించి ఇలా అనేవారు: "ఒకవేళ వారు మాతోపాటు ఉండివుంటే చనిపోయే వారు కాదు మరియు చంపబడేవారునూ కాదు!" వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్ యే జీవనమిచ్చే వాడు. మరియు మరణమిచ్చే వాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తున్నాడు.[1]
[1] చూడండి, 4:78.
|
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَكُونُوا۟ كَٱلَّذِينَ كَفَرُوا۟ وَقَالُوا۟ لِإِخْوَٰنِهِمْ إِذَا ضَرَبُوا۟ فِى ٱلْأَرْضِ أَوْ كَانُوا۟ غُزًّۭى لَّوْ كَانُوا۟ عِندَنَا مَا مَاتُوا۟ وَمَا قُتِلُوا۟ لِيَجْعَلَ ٱللَّهُ ذَٰلِكَ حَسْرَةًۭ فِى قُلُوبِهِمْ ۗ وَٱللَّهُ يُحْىِۦ وَيُمِيتُ ۗ وَٱللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌۭ. ﴿156﴾ |
| 157 మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటి కంటే ఎంతో ఉత్తమమైనవి. | وَلَئِن قُتِلْتُمْ فِى سَبِيلِ ٱللَّهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌۭ مِّنَ ٱللَّهِ وَرَحْمَةٌ خَيْرٌۭ مِّمَّا يَجْمَعُونَ. ﴿157﴾ |
| 158 మరియు మీరు మరణించినా లేదా చంపబడినా, మీరందరూ అల్లాహ్ సమక్షంలో సమావేశపరచ బడతారు. | وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى ٱللَّهِ تُحْشَرُونَ. ﴿158﴾ |
|
159
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి వుంటే, వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు[1]. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనపుడు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు.
[1] మీరు మీ వ్యవహారాలలో మీ తోటివారితో, మీ బంధువులతో, స్నేహితులతో సంప్రదింపులు చేయండి. కాని చివరకు నిర్ణయం తీసుకునేటప్పుడు అల్లాహ్ (సు.తా.) పై ఆదారపడండి. మీకు మంచిది అనిపించిన నిర్ణయం తీసుకోండి.
|
فَبِمَا رَحْمَةٍۢ مِّنَ ٱللَّهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ ٱلْقَلْبِ لَٱنفَضُّوا۟ مِنْ حَوْلِكَ ۖ فَٱعْفُ عَنْهُمْ وَٱسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِى ٱلْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَوَكِّلِينَ. ﴿159﴾ |
| 160 ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకుంటారు! | إِن يَنصُرْكُمُ ٱللَّهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا ٱلَّذِى يَنصُرُكُم مِّنۢ بَعْدِهِۦ ۗ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ. ﴿160﴾ |
|
161
మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడినవాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.[1]
[1] ఉ'హుద్ యుద్ధం రోజు దైవప్రవక్త ('స'అస) విలుకాండ్రను: ఎట్టి పరిస్థితిలో కూడా వారు తమ స్థలాలను వదలరాదని, ఆదేశిస్తారు. కాని వారు యుద్ధబూటీ వ్యామోహంలో తమ స్థానాలను వదలి యుద్ధబూటీ ప్రోగు చేయటానికి వెళ్తారు. కార్యాన్నే ఖండిస్తూ, అల్లాహ్ (సు.తా.) అన్నాడు: "ఏ ప్రవక్త కూడా తన తోటివారికి అన్యాయం చేయడు." కాబట్టి వారు తమ ప్రవక్తయందు విశ్వాసముంచుకొని, బూటీలోని తమ హక్కు తమకు తప్పక దొరుకుతుందని, తమ చోట్లలో స్థిరంగా ఉండటమే వారి కర్తవ్యము. ఈ ఆయత్ ప్రతి వ్యవహారానికి వర్తిస్తుంది.
|
وَمَا كَانَ لِنَبِىٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ ٱلْقِيَٰمَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍۢ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ. ﴿161﴾ |
|
162
ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం![1]
[1] చూడండి, 2:79 మరియు 3:78.
|
أَفَمَنِ ٱتَّبَعَ رِضْوَٰنَ ٱللَّهِ كَمَنۢ بَآءَ بِسَخَطٍۢ مِّنَ ٱللَّهِ وَمَأْوَىٰهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ ٱلْمَصِيرُ. ﴿162﴾ |
| 163 అల్లాహ్ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. | هُمْ دَرَجَٰتٌ عِندَ ٱللَّهِ ۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِمَا يَعْمَلُونَ. ﴿163﴾ |
|
164
వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు[1]. మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు[2]; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు.
[1] చూడండి, 12:109, 25:20 మరియు 41:6. [2] ఇక్కడ ప్రవక్త ('అలైహిమ్ స.)ల మూడు ముఖ్య లక్ష్యాలు వివరించబడ్డాయి : 1) ఆయత్ లను చదువటం మరియు వినిపించటం, 2) త'జ్ కియా: అంటే మానవుల కర్మలను, విశ్వాసా('అఖాయద్)లను మరియు నడవడిక ('అఖ్ లాఖ్)లను సరిదిద్దటం మరియు 3) గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటం.
|
لَقَدْ مَنَّ ٱللَّهُ عَلَى ٱلْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًۭا مِّنْ أَنفُسِهِمْ يَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ ٱلْكِتَٰبَ وَٱلْحِكْمَةَ وَإِن كَانُوا۟ مِن قَبْلُ لَفِى ضَلَٰلٍۢ مُّبِينٍ. ﴿164﴾ |
|
165
ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా![1] అయితే ఇప్పుడు: "ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?" అని అంటున్నారా? వారితో ఇలా అను: "ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!"[2] నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
[1] ఉ'హుద్ లో 70 మంది ముస్లింలు మరణించారు, కానీ బద్ర్ లో 70 మంది ముష్రికులు మరణించారు, మరియు 70 మంది బందీలయ్యారు కదా! [2] అంటే దైవప్రవక్త ('స'అస) యొక్క ఆజ్ఞను పాలించక 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు బూటీ కొరకు గుట్టపై నుండి తమ స్థానాలు వదలిపోయినందుకు ఈ ఆపదకు గురి అయ్యారు.
|
أَوَلَمَّآ أَصَٰبَتْكُم مُّصِيبَةٌۭ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ. ﴿165﴾ |
| 166 మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి - | وَمَآ أَصَٰبَكُمْ يَوْمَ ٱلْتَقَى ٱلْجَمْعَانِ فَبِإِذْنِ ٱللَّهِ وَلِيَعْلَمَ ٱلْمُؤْمِنِينَ. ﴿166﴾ |
|
167
మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి. మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి!"[1] అని అన్నప్పుడు వారు: "ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతోపాటు వచ్చి ఉండేవారం." అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు[2]. మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్ళతో పలుకుతూ ఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు.
[1] చూడండి, 2:190-194. [2] వారు 'అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబయ్ తోటివారైన దాదాపు 300 మంది మునాఫిఖులు. వారు ఉ'హుద్ యుద్ధానికి సిద్ధపడిన తరువాత శతృవులు 3000 మంది ఉన్నారని తెలుసుకొని భయపడి వెనుదిరిగి పోతారు.
|
وَلِيَعْلَمَ ٱلَّذِينَ نَافَقُوا۟ ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا۟ قَٰتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ أَوِ ٱدْفَعُوا۟ ۖ قَالُوا۟ لَوْ نَعْلَمُ قِتَالًۭا لَّٱتَّبَعْنَٰكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَٰنِ ۚ يَقُولُونَ بِأَفْوَٰهِهِم مَّا لَيْسَ فِى قُلُوبِهِمْ ۗ وَٱللَّهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ. ﴿167﴾ |
| 168 అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: "వారు గనక మా మాట విని ఉంటే చంపబడి ఉండేవారు కాదు!" నీవు వారితో: "మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!" అని చెప్పు. | ٱلَّذِينَ قَالُوا۟ لِإِخْوَٰنِهِمْ وَقَعَدُوا۟ لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا۟ ۗ قُلْ فَٱدْرَءُوا۟ عَنْ أَنفُسِكُمُ ٱلْمَوْتَ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿168﴾ |
|
169
మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు[1].
[1] చూడండి, 2:154.
|
وَلَا تَحْسَبَنَّ ٱلَّذِينَ قُتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ أَمْوَٰتًۢا ۚ بَلْ أَحْيَآءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ. ﴿169﴾ |
|
170
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు[1]. మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
[1] మరణిచిన ఏ ప్రాణి కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గర మంచి చోటు దొరికిన తరువాత భూలోకానికి తిరిగి రావటానికి ఇష్టపడడు. కానీ షహీద్ (అల్లాహుతా'ఆలా మార్గంలో చంపబడినవాడు) భూలోకానికి తిరిగి రావటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతడు షహాదత్ యొక్క గొప్ప ప్రతిఫలాన్ని చూసి ఉంటాడు. (ముస్నద్ అ'హ్మద్ - 3/126, 'స. ముస్లిం). కాని అది అసంభవం.
|
فَرِحِينَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ وَيَسْتَبْشِرُونَ بِٱلَّذِينَ لَمْ يَلْحَقُوا۟ بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ. ﴿170﴾ |
| 171 వారు అల్లాహ్ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు. | ۞ يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍۢ مِّنَ ٱللَّهِ وَفَضْلٍۢ وَأَنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُؤْمِنِينَ. ﴿171﴾ |
|
172
ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటించారో;[1] వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది.
[1] మక్కా ముష్రికులు ఉ'హుద్ యుద్ధరంగం నుండి వెనుదిరిగి కొంతదూరం పోయిన తరువాత: "మేము భీతిపరులైన ముస్లిములను, పూర్తిగా అణచకుండానే తిరిగి వచ్చి తప్పు చేశాము. 300 మైళ్ళ నుండి వచ్చి కూడా యుద్ధఖైదీలను గానీ, విజయధనం గానీ, పొందకుండా తిరిగి పోతున్నాము. కావున తిరిగి మదీనాపై దాడి చేద్దామని, సమాలోచనలు చేస్తారు. కాని వారికి ధైర్యం చాలదు. దైవప్రవక్త ('స'అస) కూడా పారిపోయే శత్రువును వెంబడించి నశింపజేయాలని, 70 మంది వీరులను తీసుకొని - వారు గాయపడి ఉన్నా తయారయ్యి - వారిని వెంబడిస్తారు. వారు మదీనా నుండి 8 మైళ్ళ దూరంలో ఉన్న'హమ్రా' అల్ అసద్ అనే ప్రాంతం వరకు పోతారు. శత్రువులను పొందక, వారిక మరలిరారని నిశ్చితులైన తరువాత తిరిగి వస్తారు.
|
ٱلَّذِينَ ٱسْتَجَابُوا۟ لِلَّهِ وَٱلرَّسُولِ مِنۢ بَعْدِ مَآ أَصَابَهُمُ ٱلْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا۟ مِنْهُمْ وَٱتَّقَوْا۟ أَجْرٌ عَظِيمٌ. ﴿172﴾ |
|
173
వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." [1] అని అన్నారు.[2]
[1] అల్-వకీలు: అంటే Trustee, Overseer, Guardian, Disposer of affairs, కార్యకర్త, సంరక్షకుడు, కార్యనిర్వాహకుడు, కార్యసాధకుడు, సాక్షి, బాధ్యుడు, ధర్మకర్త, మొదలైన అర్థాలున్నాయి. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 4:109, 6:102, 11:12, 17:2. [2] చూడండి, 'స. బు'ఖారీ, పు. 6, 'హదీస్' నం. 86, 87.
|
ٱلَّذِينَ قَالَ لَهُمُ ٱلنَّاسُ إِنَّ ٱلنَّاسَ قَدْ جَمَعُوا۟ لَكُمْ فَٱخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَٰنًۭا وَقَالُوا۟ حَسْبُنَا ٱللَّهُ وَنِعْمَ ٱلْوَكِيلُ. ﴿173﴾ |
| 174 ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుద్ధరంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్ అభీష్టాన్నీ అనుసరించారు. మరియు అల్లాహ్ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు. | فَٱنقَلَبُوا۟ بِنِعْمَةٍۢ مِّنَ ٱللَّهِ وَفَضْلٍۢ لَّمْ يَمْسَسْهُمْ سُوٓءٌۭ وَٱتَّبَعُوا۟ رِضْوَٰنَ ٱللَّهِ ۗ وَٱللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ. ﴿174﴾ |
| 175 నిశ్చయంగా, షైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్ కే) భయపడండి. | إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ. ﴿175﴾ |
| 176 మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారి కెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. | وَلَا يَحْزُنكَ ٱلَّذِينَ يُسَٰرِعُونَ فِى ٱلْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا۟ ٱللَّهَ شَيْـًۭٔا ۗ يُرِيدُ ٱللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّۭا فِى ٱلْءَاخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ. ﴿176﴾ |
| 177 నిశ్చయంగా, విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. | إِنَّ ٱلَّذِينَ ٱشْتَرَوُا۟ ٱلْكُفْرَ بِٱلْإِيمَٰنِ لَن يَضُرُّوا۟ ٱللَّهَ شَيْـًۭٔا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌۭ. ﴿177﴾ |
|
178
మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవటానికే! [1] మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.
[1] చూడండి, 23:55, 56.
|
وَلَا يَحْسَبَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّمَا نُمْلِى لَهُمْ خَيْرٌۭ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِى لَهُمْ لِيَزْدَادُوٓا۟ إِثْمًۭا ۚ وَلَهُمْ عَذَابٌۭ مُّهِينٌۭ. ﴿178﴾ |
|
179
అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్యతిరస్కారులు) ఇప్పుడు ఉన్న స్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు[1]. కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి గలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
[1] చూడండి, 9:26, 27, 101.
|
مَّا كَانَ ٱللَّهُ لِيَذَرَ ٱلْمُؤْمِنِينَ عَلَىٰ مَآ أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ ٱلْخَبِيثَ مِنَ ٱلطَّيِّبِ ۗ وَمَا كَانَ ٱللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى ٱلْغَيْبِ وَلَٰكِنَّ ٱللَّهَ يَجْتَبِى مِن رُّسُلِهِۦ مَن يَشَآءُ ۖ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦ ۚ وَإِن تُؤْمِنُوا۟ وَتَتَّقُوا۟ فَلَكُمْ أَجْرٌ عَظِيمٌۭ. ﴿179﴾ |
|
180
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించ రాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టు కట్టబడుతుంది[1]. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును.
[1] చూడండి, 'స. బు'ఖారీ, 'హ. నం. 4565.
|
وَلَا يَحْسَبَنَّ ٱلَّذِينَ يَبْخَلُونَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ هُوَ خَيْرًۭا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّۭ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا۟ بِهِۦ يَوْمَ ٱلْقِيَٰمَةِ ۗ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌۭ. ﴿180﴾ |
|
181
"నిశ్చయంగా, అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము."[1] అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేమను ఇలా అంటాము: "దహించే అగ్ని శిక్షను రుచి చూడండి!"
[1] చూడండి, 2:245.
|
لَّقَدْ سَمِعَ ٱللَّهُ قَوْلَ ٱلَّذِينَ قَالُوٓا۟ إِنَّ ٱللَّهَ فَقِيرٌۭ وَنَحْنُ أَغْنِيَآءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا۟ وَقَتْلَهُمُ ٱلْأَنۢبِيَآءَ بِغَيْرِ حَقٍّۢ وَنَقُولُ ذُوقُوا۟ عَذَابَ ٱلْحَرِيقِ. ﴿181﴾ |
| 182 ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు! | ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ ٱللَّهَ لَيْسَ بِظَلَّامٍۢ لِّلْعَبِيدِ. ﴿182﴾ |
|
183
"అగ్ని (ఆకాశం నుండి దిగి వచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించ గూడదని అల్లాహ్ మాతో వాగ్దానం తీసుకున్నాడు." అని పలికే వారితో (యూదులతో) ఇలా అను: "వాస్తవానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకువచ్చారు; మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్ని కూడా! మీరు సత్యవంతులే అయితే, మీరు వారిని ఎందుకు హత్య చేశారు?" [1]
[1] చూడండి, 2:61.
|
ٱلَّذِينَ قَالُوٓا۟ إِنَّ ٱللَّهَ عَهِدَ إِلَيْنَآ أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍۢ تَأْكُلُهُ ٱلنَّارُ ۗ قُلْ قَدْ جَآءَكُمْ رُسُلٌۭ مِّن قَبْلِى بِٱلْبَيِّنَٰتِ وَبِٱلَّذِى قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿183﴾ |
| 184 (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను (జుబుర్ లను) మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకు వచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. | فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌۭ مِّن قَبْلِكَ جَآءُو بِٱلْبَيِّنَٰتِ وَٱلزُّبُرِ وَٱلْكِتَٰبِ ٱلْمُنِيرِ. ﴿184﴾ |
| 185 ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే! | كُلُّ نَفْسٍۢ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ ٱلنَّارِ وَأُدْخِلَ ٱلْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا مَتَٰعُ ٱلْغُرُورِ. ﴿185﴾ |
|
186
నిశ్చయంగా మీరు, మీ ధన ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడిన వారి నుండి మరియు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కానీ, ఒకవేళ మీరు ఓర్పు వహించి, దైవభీతి కలిగి ఉంటే! నిశ్చయంగా అది ఎంతో సాహసంతో కూడిన కార్యం.[1]
[1] చూడండి, 2:155 మరియు 'స. బు'ఖారీ - కితాబ్ అత్ - తఫ్సీర్.
|
۞ لَتُبْلَوُنَّ فِىٓ أَمْوَٰلِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ مِن قَبْلِكُمْ وَمِنَ ٱلَّذِينَ أَشْرَكُوٓا۟ أَذًۭى كَثِيرًۭا ۚ وَإِن تَصْبِرُوا۟ وَتَتَّقُوا۟ فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ ٱلْأُمُورِ. ﴿186﴾ |
| 187 మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని (దైవప్రవక్త ముహమ్మద్ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి." అని చేయించిన ప్రమాణాన్ని , (జ్ఞాపకం చేసుకోండి). కాని వారు దానిని తమ వీపుల వెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు, వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది! | وَإِذْ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ لَتُبَيِّنُنَّهُۥ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُۥ فَنَبَذُوهُ وَرَآءَ ظُهُورِهِمْ وَٱشْتَرَوْا۟ بِهِۦ ثَمَنًۭا قَلِيلًۭا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ. ﴿187﴾ |
| 188 ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయని పనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, వారు శిక్ష నుండి తప్పించుకోగలరని నీవు భావించకు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. | لَا تَحْسَبَنَّ ٱلَّذِينَ يَفْرَحُونَ بِمَآ أَتَوا۟ وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا۟ بِمَا لَمْ يَفْعَلُوا۟ فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍۢ مِّنَ ٱلْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌۭ. ﴿188﴾ |
| 189 మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. | وَلِلَّهِ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌ. ﴿189﴾ |
| 190 నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గుల)లో, బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి; | إِنَّ فِى خَلْقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَٰفِ ٱلَّيْلِ وَٱلنَّهَارِ لَءَايَٰتٍۢ لِّأُو۟لِى ٱلْأَلْبَٰبِ. ﴿190﴾ |
|
191
ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్ని వేళలా అల్లాహ్ ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో! (వారు ఇలా ప్రార్థిస్తారు): "ఓ మా ప్రభూ! నీవు దీనిని (ఈ విశ్వాన్ని) వ్యర్థంగా సృష్టించలేదు, నీవు సర్వలోపాలకు అతీతువు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.[1]
[1] చూడండి, 10:5
|
ٱلَّذِينَ يَذْكُرُونَ ٱللَّهَ قِيَٰمًۭا وَقُعُودًۭا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِى خَلْقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَٰطِلًۭا سُبْحَٰنَكَ فَقِنَا عَذَابَ ٱلنَّارِ. ﴿191﴾ |
| 192 "ఓ మా ప్రభూ! నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమానపరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు." | رَبَّنَآ إِنَّكَ مَن تُدْخِلِ ٱلنَّارَ فَقَدْ أَخْزَيْتَهُۥ ۖ وَمَا لِلظَّٰلِمِينَ مِنْ أَنصَارٍۢ. ﴿192﴾ |
| 193 "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: 'మీ ప్రభువును విశ్వసించండి.' అని విశ్వాసం వైపుకు పిలిచే అతని (ముహమ్మద్) యొక్క పిలుపు విని విశ్వసించాము. ఓ మా ప్రభూ! మా పాపాలను క్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మనిష్ఠాపరులతో) మిమ్మల్ని మరణింపజెయ్యి!" | رَّبَّنَآ إِنَّنَا سَمِعْنَا مُنَادِيًۭا يُنَادِى لِلْإِيمَٰنِ أَنْ ءَامِنُوا۟ بِرَبِّكُمْ فَـَٔامَنَّا ۚ رَبَّنَا فَٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلْأَبْرَارِ. ﴿193﴾ |
| 194 "ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తి చేయి మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమాన పరచకు. నిశ్చయంగా, నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు." | رَبَّنَا وَءَاتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ ٱلْقِيَٰمَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ ٱلْمِيعَادَ. ﴿194﴾ |
|
195
అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: "మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు (సమానులు)[1]. కనుక నా కొరకు, తమ దేశాన్ని విడిచి పెట్టి వలస పోయినవారు, తమ గృహాల నుండి తరిమి వేయబడి (నిరాశ్రయులై, దేశదిమ్మరులై), నా మార్గంలో పలుకష్టాలు పడినవారు మరియు నా కొరకు పోరాడినవారు మరియు చంపబడినవారు; నిశ్చయంగా, ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచి వేస్తాను. మరియు నిశ్చయంగా, వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రేవశింపజేస్తాను; ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. మరియు అల్లాహ్! ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలం ఉంది."
[1] అంటే కర్మలకు ఫలితాలిచ్చే విషయంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి భేదభావం ఉండదు. ప్రతి ఒక్కరికి వారి కర్మలకు తగిన ప్రతిఫలమివ్వబడుతుంది. ఎవ్వరికీ రవ్వంత అన్యాయం కూడా జరుగదు.
|
فَٱسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّى لَآ أُضِيعُ عَمَلَ عَٰمِلٍۢ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّنۢ بَعْضٍۢ ۖ فَٱلَّذِينَ هَاجَرُوا۟ وَأُخْرِجُوا۟ مِن دِيَٰرِهِمْ وَأُوذُوا۟ فِى سَبِيلِى وَقَٰتَلُوا۟ وَقُتِلُوا۟ لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّـَٔاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ ثَوَابًۭا مِّنْ عِندِ ٱللَّهِ ۗ وَٱللَّهُ عِندَهُۥ حُسْنُ ٱلثَّوَابِ. ﴿195﴾ |
|
196
(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్యతిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు![1]
[1] చూడండి, 40:4, 10:69 మరియు 31:24.
|
لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى ٱلْبِلَٰدِ. ﴿196﴾ |
| 197 ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము. | مَتَٰعٌۭ قَلِيلٌۭ ثُمَّ مَأْوَىٰهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ ٱلْمِهَادُ. ﴿197﴾ |
| 198 కాని ఎవరైతే తమ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉంటారో, వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అందులో వారు అల్లాహ్ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు (ధర్మనిష్ఠాపరులకు) అల్లాహ్ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్ఠమైనది! | لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوْا۟ رَبَّهُمْ لَهُمْ جَنَّٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَا نُزُلًۭا مِّنْ عِندِ ٱللَّهِ ۗ وَمَا عِندَ ٱللَّهِ خَيْرٌۭ لِّلْأَبْرَارِ. ﴿198﴾ |
|
199
మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు[1]. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.
[1] ఈ ఆయత్ లో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) ను విశ్వసించిన పూర్వగ్రంథ ప్రజలను గురించి చెప్పబడింది. ఉదా: 'అబ్దుల్లాహ్ బిన్ సల్లామ్, మరియు సల్మాన్ పార్సీ మొదలైనవారు. (ర'ది.'అన్హుమ్). వారిలో దాదాపు 10 మంది మాత్రమే యూదులు, కాని క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉండిరి. (ఇబ్నె - కసీ'ర్).
|
وَإِنَّ مِنْ أَهْلِ ٱلْكِتَٰبِ لَمَن يُؤْمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيْكُمْ وَمَآ أُنزِلَ إِلَيْهِمْ خَٰشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنًۭا قَلِيلًا ۗ أُو۟لَٰٓئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ. ﴿199﴾ |
|
200
ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు![1]
[1] ఈ ఆయత్ తాత్పర్యం ఈ విధంగా కూడా చేయబడింది: "ఓ విశ్వాసులారా, (మీ శత్రువుల కంటే ఎక్కువ) సహనం వహించండి మరియు సాహసం చూపించండి మరియు యుద్ధరంగంలో దృఢచిత్తులై (మీ సరిహద్దులను కాపాడుతూ) ఉండండి. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!" ఆ ఆయత్ తాత్పర్యం ము'హమ్మద్ జునాగఢి (ర'హ్మ) గారు, ఈ విధంగా కూడా చేశారు: "ఓ విశ్వాసులారా! మీ పాదాలను తడబడనివ్వకండి మరియు ఒకరికొకరు సహాయపడండి. జిహాద్ కొరకు సిద్ధంగా ఉండండి మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!"
|
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱصْبِرُوا۟ وَصَابِرُوا۟ وَرَابِطُوا۟ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ. ﴿200﴾ |