Loading date... | Loading Hijri date... | Loading time...

الدخان

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 హా - మీమ్[1].
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
حمٓ. ﴿1﴾
2 స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా![1]
[1] చూడండి, 12:1.
وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ. ﴿2﴾
3 నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.[1] నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. [2]
[1] ఖుర్ఆన్ అవతరింపజేయబడిన రాత్రి లైలతుల్ ఖద్ర్ శుభవంతమైన రాత్రి. చూడండి, సూరహ్ అల్-ఖద్ర్ (97) . ఇంకా చూడండి 2:185 ఈ రాత్రి రమ'దాన్ నెల చివరి 10 రోజులలోని బేసి రాత్రులలో ఒకటి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. 1) ఈ రాత్రిలో ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. 2) ఈ రాత్రిలోనే దైవదూత (అలైహిమ్ స.)లు మరియు పవిత్ర ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) దిగి వస్తారు. 3) ఈ రాత్రిలో, రాబోయే సంవత్సరంలో జరగబోయే విషయాల నిర్ణయం జరుగుతుంది. 4) ఈ రాత్రిలో చేసే ఆరాధన ('ఇబాదహ్) వేయి నెలల (83 సంవత్సరాల 4 నెలల) ఆరాధన కంటే ఉత్తమమైనది. ఈ రాత్రిలోనే ఖుర్ఆన్ ఏడవ ఆకాశంపై ఉన్న లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి భూలోకపు ఆకాశంపై ఉన్న బైతుల్ 'ఇజ్జహ్ లోకి మొత్తం ఒకేసారి దింపబడింది. ఆ తరువాత 23 సంవత్సరాలలో క్రమక్రమంగా దైవప్రవక్త ('స'అస) మీద అవతరింపజేయబడింది. [2] ఖుర్ఆన్ అవతరణ ప్రజలకు మంచి చెడును బోధించటానికి జరిగింది.
إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍۢ مُّبَٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ. ﴿3﴾
4 దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది; فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ. ﴿4﴾
5 మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము. أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ. ﴿5﴾
6 నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు. رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ. ﴿6﴾
7 భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే! رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ. ﴿7﴾
8 ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.[1]
[1] చూడండి, 7:158. ఈ ఆయత్ పోలిన ఆయత్.
لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ. ﴿8﴾
9 అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు). بَلْ هُمْ فِى شَكٍّۢ يَلْعَبُونَ. ﴿9﴾
10 కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు! فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍۢ مُّبِينٍۢ. ﴿10﴾
11 అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష. يَغْشَى ٱلنَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌۭ. ﴿11﴾
12 (అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము." رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ. ﴿12﴾
13 ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు; أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌۭ مُّبِينٌۭ. ﴿13﴾
14 అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!" [1]
[1] చూడండి, 16:103 మరియు 25:4.
ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌۭ مَّجْنُونٌ. ﴿14﴾
15 వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు. إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَآئِدُونَ. ﴿15﴾
16 మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము. يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ. ﴿16﴾
17 మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు. ۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌۭ كَرِيمٌ. ﴿17﴾
18 (అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు.[1] నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.
[1] 'ఇబాదల్లాహ్: అంటే ఇక్కడ మూసా ('అ.స.) జాతివారైన బనీ ఇస్రాయీ'ల్ తెగవారు.
أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ ۖ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿18﴾
19 మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను. وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ ۖ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَٰنٍۢ مُّبِينٍۢ. ﴿19﴾
20 మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి. وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ. ﴿20﴾
21 ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!" وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ. ﴿21﴾
22 చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!" فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَٰٓؤُلَآءِ قَوْمٌۭ مُّجْرِمُونَ. ﴿22﴾
23 (అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు. فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ. ﴿23﴾
24 మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో.[1] నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"
[1] చూడండి, 26:63-66. రహ్వాన్: అంటే ప్రశాంతమైనది లేక తడిలేనిది. జౌహరీ (ర'హ్మ) దీనిని ప్రశాంతంగా చీలిపోయి ఉన్నది, అని వివరించారు.
وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌۭ مُّغْرَقُونَ. ﴿24﴾
25 వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు; كَمْ تَرَكُوا۟ مِن جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿25﴾
26 మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను; وَزُرُوعٍۢ وَمَقَامٍۢ كَرِيمٍۢ. ﴿26﴾
27 మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా! وَنَعْمَةٍۢ كَانُوا۟ فِيهَا فَٰكِهِينَ. ﴿27﴾
28 ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము. كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَٰهَا قَوْمًا ءَاخَرِينَ. ﴿28﴾
29 కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు. فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ. ﴿29﴾
30 మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము - وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ. ﴿30﴾
31 ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు. مِن فِرْعَوْنَ ۚ إِنَّهُۥ كَانَ عَالِيًۭا مِّنَ ٱلْمُسْرِفِينَ. ﴿31﴾
32 మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము. [1]
[1] ఎందుకంటే ఆ కాలంలో కేవలం బనీ-ఇస్రాయీ'ల్ వారు మాత్రమే ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించేవారు. మిగతా వారంతా బహుదైవారాధకులుగా ఉన్నారు. చూడండి, 15:23.
وَلَقَدِ ٱخْتَرْنَٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَٰلَمِينَ. ﴿32﴾
33 మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది. وَءَاتَيْنَٰهُم مِّنَ ٱلْءَايَٰتِ مَا فِيهِ بَلَٰٓؤٌۭا۟ مُّبِينٌ. ﴿33﴾
34 నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు: إِنَّ هَٰٓؤُلَآءِ لَيَقُولُونَ. ﴿34﴾
35 "వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము. إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ. ﴿35﴾
36 మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!" [1]
[1] చూడండి, 43:22-23.
فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿36﴾
37 వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు[1] మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!
[1] తుబ్బ'అ అంటే సబా' ప్రాంతంలో నివసించే 'హిమ్ యార్ తెగకు చెందినవారు. వారి రాజుల బిరుదు తుబ్బ'అ ఏ విధంగానైతే రోమన్ రాజులు సీజర్ అనబడేవారో! వారు చాలా కాలం దక్షిణ 'అరేబియా మీద రాజరికం చేశారు. వారిని, అబిసీనియా వారు (Abyssinians) 4వ క్రీ.శ.లో అంతమొందించారు. చూడండి, 50:14. వారు సత్యతిరస్కారులు.
أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍۢ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَٰهُمْ ۖ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ. ﴿37﴾
38 మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.[1]
[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 38:27, 23:115-116, 15:85 మరియు 21:16.
وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ. ﴿38﴾
39 మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.[1]
[1] చూడండి, 10:5.
مَا خَلَقْنَٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. ﴿39﴾
40 నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.[1]
[1] చూడండి, 77:13.
إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَٰتُهُمْ أَجْمَعِينَ. ﴿40﴾
41 ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.[1]
[1] చూడండి, 23:101, 70:10. మౌలా: అంటే "దగ్గరి బంధువు" అని కూడా తాత్పర్యమిచ్చారు.
يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًۭى شَيْـًۭٔا وَلَا هُمْ يُنصَرُونَ. ﴿41﴾
42 అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ ۚ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿42﴾
43 నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం; إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ. ﴿43﴾
44 పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది; طَعَامُ ٱلْأَثِيمِ. ﴿44﴾
45 మరిగే నూనే (సీసం) వలే,[1] అది వారి కడుపులో మరుగుతుంది;
[1] అల్-ముహ్ లు: కరిగిన రాగి అని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ. ﴿45﴾
46 సలసల కాగే నీటిలాగా! كَغَلْىِ ٱلْحَمِيمِ. ﴿46﴾
47 (ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి; خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ. ﴿47﴾
48 ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి. ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ. ﴿48﴾
49 దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!" ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ. ﴿49﴾
50 నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం! إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ. ﴿50﴾
51 నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు. إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍۢ. ﴿51﴾
52 ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య. فِى جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿52﴾
53 వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.[1]
[1] చూడండి, 18:31 మరియు 35:33
يَلْبَسُونَ مِن سُندُسٍۢ وَإِسْتَبْرَقٍۢ مُّتَقَٰبِلِينَ. ﴿53﴾
54 ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.[1]
[1] 'హూరున్: చూడండి, 56:22, 52:20, 55:56, 37:48, 37:52. వారి కళ్ళ నలుపు మరియు తెలుపు ఎంతో అందంగా ఉంటాయి. వారిని చూసినవారు వారి అందానికి ముగ్దులైపోతారు.
كَذَٰلِكَ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍۢ. ﴿54﴾
55 వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. [1]
[1] చూచూడండి, 43:73.
يَدْعُونَ فِيهَا بِكُلِّ فَٰكِهَةٍ ءَامِنِينَ. ﴿55﴾
56 వారక్కడ మరణాన్ని[1] ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;
[1] 'స'హీ'హ్ 'హదీస్' లో ఉంది: మృత్యువును ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్హ్ చేస్తారు. మరియు ఈ విధంగా ప్రకటిస్తారు: 'ఓ స్వర్గవాసులారా! ఇక మీకు మృత్యువు లేదు; మీరు కలకాలం స్వర్గంలో ఉంటారు. ఓ నరకవాసులారా! మీకు సదా నరకవాసమే. మీకు మృత్యువు లేదు." (స.'బు'ఖారీ, ముస్లిం.) ఇంకా చూడండి, 19:39, 37:58-59.
لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ ۖ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ. ﴿56﴾
57 నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం! فَضْلًۭا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ. ﴿57﴾
58 అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).[1]
[1] చూడండి, 19:97.
فَإِنَّمَا يَسَّرْنَٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ. ﴿58﴾
59 కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు. فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ. ﴿59﴾