الجاثية
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
హా - మీమ్[1].
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
|
حمٓ. ﴿1﴾ |
| 2 ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది. | تَنزِيلُ ٱلْكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ. ﴿2﴾ |
|
3
నిశ్చయంగా, విశ్వసించేవారి కొరకు, ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు (ఆయాత్) ఉన్నాయి.[1]
[1] చూడండి, 2:164.
|
إِنَّ فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ لَءَايَٰتٍۢ لِّلْمُؤْمِنِينَ. ﴿3﴾ |
|
4
మరియు మీ సృష్టిలోనూ మరియు (భూమిలో) ఆయన వ్యాపింపజేసిన జీవరాసులలోనూ, దృఢవిశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.[1]
[1] చూడండి, 7:185 మరియు 10:5.
|
وَفِى خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِن دَآبَّةٍ ءَايَٰتٌۭ لِّقَوْمٍۢ يُوقِنُونَ. ﴿4﴾ |
| 5 మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. | وَٱخْتِلَٰفِ ٱلَّيْلِ وَٱلنَّهَارِ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن رِّزْقٍۢ فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ ٱلرِّيَٰحِ ءَايَٰتٌۭ لِّقَوْمٍۢ يَعْقِلُونَ. ﴿5﴾ |
|
6
ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ ను మరియు ఆయన సూచనలను (ఆయాత్ లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు?[1]
[1] చూడండి, 39:23.
|
تِلْكَ ءَايَٰتُ ٱللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِٱلْحَقِّ ۖ فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَ ٱللَّهِ وَءَايَٰتِهِۦ يُؤْمِنُونَ. ﴿6﴾ |
| 7 అపవాదుడు, పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వ్యధ గలదు. | وَيْلٌۭ لِّكُلِّ أَفَّاكٍ أَثِيمٍۢ. ﴿7﴾ |
| 8 అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు. | يَسْمَعُ ءَايَٰتِ ٱللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًۭا كَأَن لَّمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍۢ. ﴿8﴾ |
| 9 మరియు మా సూచన (ఆయాత్) లకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది. | وَإِذَا عَلِمَ مِنْ ءَايَٰتِنَا شَيْـًٔا ٱتَّخَذَهَا هُزُوًا ۚ أُو۟لَٰٓئِكَ لَهُمْ عَذَابٌۭ مُّهِينٌۭ. ﴿9﴾ |
| 10 వారి ముందు నరకముంటుంది. మరియు వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాదు మరియు అల్లాహ్ ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్నవారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. | مِّن وَرَآئِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِى عَنْهُم مَّا كَسَبُوا۟ شَيْـًۭٔا وَلَا مَا ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ أَوْلِيَآءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ. ﴿10﴾ |
|
11
ఇది (ఈ ఖుర్ఆన్) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో, వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది.[1]
[1] చూడండి, 34:5.
|
هَٰذَا هُدًۭى ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌۭ مِّن رِّجْزٍ أَلِيمٌ. ﴿11﴾ |
| 12 అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని. | ۞ ٱللَّهُ ٱلَّذِى سَخَّرَ لَكُمُ ٱلْبَحْرَ لِتَجْرِىَ ٱلْفُلْكُ فِيهِ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ. ﴿12﴾ |
| 13 మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి. | وَسَخَّرَ لَكُم مَّا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ جَمِيعًۭا مِّنْهُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَءَايَٰتٍۢ لِّقَوْمٍۢ يَتَفَكَّرُونَ. ﴿13﴾ |
|
14
(ఓ ప్రవక్తా!) విశ్వసించిన వారితో: "ఒక జాతి వారికి తమ కర్మలకు తగిన ప్రతిఫలమిచ్చే అల్లాహ్ దినాలు[1] వస్తాయని నమ్మనివారిని క్షమించండి." అని చెప్పు.[2]
[1] అయ్యామల్లాహ్: అల్లాహ్ దినాలు, అంటే పునరుత్థాన దినం. చూడండి, 14:5.
[2] ఈ ఆజ్ఞ ప్రవక్తృత్వం ప్రసాదించబడిన మొదటి రోజులలో ఉండేది. అప్పుడు ముస్లింలు, కొంతమంది మాత్రమే ఉండేవారు. మరియు వారిలో చాలామంది సమాజంలో బలహీన వర్గాలకు చెందినవారు. ఎప్పుడైతే ముస్లింలు తమ శత్రువులను ఎదుర్కొనే స్థితికి వచ్చారో వారికి జిహాద్ ఆజ్ఞ ఇవ్వబడింది..
|
قُل لِّلَّذِينَ ءَامَنُوا۟ يَغْفِرُوا۟ لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ ٱللَّهِ لِيَجْزِىَ قَوْمًۢا بِمَا كَانُوا۟ يَكْسِبُونَ. ﴿14﴾ |
| 15 సత్కార్యం చేసేవాడు తన మేలుకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలింప బడతారు. | مَنْ عَمِلَ صَٰلِحًۭا فَلِنَفْسِهِۦ ۖ وَمَنْ أَسَآءَ فَعَلَيْهَا ۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ. ﴿15﴾ |
|
16
మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము.[1]
[1] ఆ కాలంలో బనీ-ఇస్రాయీ'ల్ వారు మాత్రమే, ఏకదైవారాధకులుగా ఉండిరి. చూడండి, 2:47.
|
وَلَقَدْ ءَاتَيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ ٱلْكِتَٰبَ وَٱلْحُكْمَ وَٱلنُّبُوَّةَ وَرَزَقْنَٰهُم مِّنَ ٱلطَّيِّبَٰتِ وَفَضَّلْنَٰهُمْ عَلَى ٱلْعَٰلَمِينَ. ﴿16﴾ |
|
17
మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము.[1] వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు.[2] నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున, వారి మధ్య తీర్పు చేస్తాడు.
[1] అల్-అమ్రు: ఇక్కడ చాలా వ్యాఖ్యాతల దృష్టిలో 'ధర్మం' కొరకు వాడబడింది.
[2] చూడండి, 23:53.
|
وَءَاتَيْنَٰهُم بَيِّنَٰتٍۢ مِّنَ ٱلْأَمْرِ ۖ فَمَا ٱخْتَلَفُوٓا۟ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْعِلْمُ بَغْيًۢا بَيْنَهُمْ ۚ إِنَّ رَبَّكَ يَقْضِى بَيْنَهُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ فِيمَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ. ﴿17﴾ |
| 18 తరువాత (ఓ ముహమ్మద్!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మ విధానం మీద ఉంటాము. కావున నీవు దానినే అనుసరించు మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు. | ثُمَّ جَعَلْنَٰكَ عَلَىٰ شَرِيعَةٍۢ مِّنَ ٱلْأَمْرِ فَٱتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَآءَ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ. ﴿18﴾ |
| 19 నిశ్చయంగా వారు, నీకు - అల్లాహ్ కు ప్రతిగా - ఏ మాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా, దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహ్ యే దైవభీతి గలవారి సంరక్షకుడు. | إِنَّهُمْ لَن يُغْنُوا۟ عَنكَ مِنَ ٱللَّهِ شَيْـًۭٔا ۚ وَإِنَّ ٱلظَّٰلِمِينَ بَعْضُهُمْ أَوْلِيَآءُ بَعْضٍۢ ۖ وَٱللَّهُ وَلِىُّ ٱلْمُتَّقِينَ. ﴿19﴾ |
| 20 ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు అంతర్దృష్టి (పరిజ్ఞానం) ఇచ్చేదిగానూ మరియు విశ్వసించే జనులకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంది. | هَٰذَا بَصَٰٓئِرُ لِلنَّاسِ وَهُدًۭى وَرَحْمَةٌۭ لِّقَوْمٍۢ يُوقِنُونَ. ﴿20﴾ |
| 21 దుష్కార్యాలకు పాల్పడిన వారు, వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ - వారినీ మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారినీ - మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి! | أَمْ حَسِبَ ٱلَّذِينَ ٱجْتَرَحُوا۟ ٱلسَّيِّـَٔاتِ أَن نَّجْعَلَهُمْ كَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ سَوَآءًۭ مَّحْيَاهُمْ وَمَمَاتُهُمْ ۚ سَآءَ مَا يَحْكُمُونَ. ﴿21﴾ |
| 22 మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు. | وَخَلَقَ ٱللَّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ وَلِتُجْزَىٰ كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ. ﴿22﴾ |
|
23
తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, అల్లాహ్! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు[1] మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ళ మీద తెరవేశాడు;[2] ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసే వాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా?
[1] చూడండి, 14:4.
[2] చూడండి, 2:7 మరియు 7:186.
|
أَفَرَءَيْتَ مَنِ ٱتَّخَذَ إِلَٰهَهُۥ هَوَىٰهُ وَأَضَلَّهُ ٱللَّهُ عَلَىٰ عِلْمٍۢ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِۦ وَقَلْبِهِۦ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِۦ غِشَٰوَةًۭ فَمَن يَهْدِيهِ مِنۢ بَعْدِ ٱللَّهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ. ﴿23﴾ |
|
24
మరియు వారిలా అంటారు: "మా (జీవితం) కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే!" మరియు వాస్తవానికి, దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. [1]
[1] 'హదీస్' ఖుద్సీ, అల్లాహ్ (సు.తా.) అంటాడు: "ఆదమ్ కుమారుడు నాకు బాధ కలిగిస్తాడు - కాలాన్ని దూషిస్తాడు - (అంటే కాలం వల్ల తనకు దురవస్థ వచ్చిందంటాడు). వాస్తవానికి కాలం అనేది ఏమీ లేదు. నేనే కాలాన్ని! సర్వాధికారాలు నా చేతిలోనే ఉన్నాయి. రాత్రింబవళ్ళనూ మార్చేవాడను నేనే." ('స.బు'ఖారీ, ముస్లిం.)
|
وَقَالُوا۟ مَا هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَآ إِلَّا ٱلدَّهْرُ ۚ وَمَا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَظُنُّونَ. ﴿24﴾ |
|
25
మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు (ఆయాత్) వినిపించబడి నప్పుడు: "మీరు సత్యవంతులే అయితే మా తాతముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి!" అని మాత్రమే వాదిస్తారు.[1]
[1] చూడండి, 44:36.
|
وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ ءَايَٰتُنَا بَيِّنَٰتٍۢ مَّا كَانَ حُجَّتَهُمْ إِلَّآ أَن قَالُوا۟ ٱئْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿25﴾ |
| 26 వారిలో ఇలా అను: "అల్లాహ్ యే మీకు జీవితమిచ్చేవాడు తరువాత మరణింప జేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశ పరిచేవాడూను! ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు." | قُلِ ٱللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَٰمَةِ لَا رَيْبَ فِيهِ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ. ﴿26﴾ |
| 27 మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైననాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు. | وَلِلَّهِ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍۢ يَخْسَرُ ٱلْمُبْطِلُونَ. ﴿27﴾ |
|
28
మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి[1] ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది.
[1] జా'సియతున్: Kneeling down, మోకరిల్లటం, మోకాళ్ళు భూమికి ఆనించి కూర్చోవడం.
|
وَتَرَىٰ كُلَّ أُمَّةٍۢ جَاثِيَةًۭ ۚ كُلُّ أُمَّةٍۢ تُدْعَىٰٓ إِلَىٰ كِتَٰبِهَا ٱلْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ. ﴿28﴾ |
|
29
ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది.[1] నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము."
[1] చూడండి, 39:69 మరియు 18:49.
|
هَٰذَا كِتَٰبُنَا يَنطِقُ عَلَيْكُم بِٱلْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ. ﴿29﴾ |
|
30
కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు.[1] ఇదే ఆ స్పష్టమైన విజయం.
[1] అంటే స్వర్గం
|
فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِى رَحْمَتِهِۦ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْمُبِينُ. ﴿30﴾ |
| 31 మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో (ఇలా అనబడుతుంది): "మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడి పోయారు మరియు అపరాధులై పోయారు." | وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَفَلَمْ تَكُنْ ءَايَٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَٱسْتَكْبَرْتُمْ وَكُنتُمْ قَوْمًۭا مُّجْرِمِينَ. ﴿31﴾ |
|
32
మరియు: "నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: "ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము."[1]
[1] అంటే పునరుత్థానదినం, సత్యం.
|
وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّۭ وَٱلسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُم مَّا نَدْرِى مَا ٱلسَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنًّۭا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ. ﴿32﴾ |
| 33 అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు, ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది. | وَبَدَا لَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ. ﴿33﴾ |
| 34 మరియు వారితో ఇలా అనబడుతుంది: "ఈ రోజు మేము మిమ్మల్ని మరచి పోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో! మరియు మీ నివాసం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు." | وَقِيلَ ٱلْيَوْمَ نَنسَىٰكُمْ كَمَا نَسِيتُمْ لِقَآءَ يَوْمِكُمْ هَٰذَا وَمَأْوَىٰكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن نَّٰصِرِينَ. ﴿34﴾ |
|
35
ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు.[1] మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు.
[1] చూడండి, 6:128 మరియు 43:74.
|
ذَٰلِكُم بِأَنَّكُمُ ٱتَّخَذْتُمْ ءَايَٰتِ ٱللَّهِ هُزُوًۭا وَغَرَّتْكُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا ۚ فَٱلْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ. ﴿35﴾ |
| 36 ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు! | فَلِلَّهِ ٱلْحَمْدُ رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَرَبِّ ٱلْأَرْضِ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿36﴾ |
| 37 ఆకాశాలలో మరియు భూమిలో ఘనత (మహనీయత) ఆయనకే చెందుతుంది. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. | وَلَهُ ٱلْكِبْرِيَآءُ فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ. ﴿37﴾ |