الرحمن
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 అనంత కరుణామయుడు (అల్లాహ్)! | ٱلرَّحْمَٰنُ. ﴿1﴾ |
|
2
ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.[1]
[1] ఇది మక్కా ముష్రికులకు ఇవ్వబడిన జవాబు. ఎందుకంటే వారు, దైవప్రవక్త (సఅస) మీద, ఈ ఖుర్ఆన్ ను అతనికి ఒక మానవుడు నేర్పాడు అనే అపనింద మోపారు. కాని వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దీనిని తన సందేశహరునికి నేర్పాడు మరియు అతను తమ అనుచరులకు (ర'ది.'అన్హుమ్) నేర్పారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
|
عَلَّمَ ٱلْقُرْءَانَ. ﴿2﴾ |
| 3 ఆయనే మానవుణ్ణి సృష్టించాడు. | خَلَقَ ٱلْإِنسَٰنَ. ﴿3﴾ |
| 4 ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు. | عَلَّمَهُ ٱلْبَيَانَ. ﴿4﴾ |
| 5 సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు. | ٱلشَّمْسُ وَٱلْقَمَرُ بِحُسْبَانٍۢ. ﴿5﴾ |
|
6
మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.[1]
[1] చూడండి, 22:18.
|
وَٱلنَّجْمُ وَٱلشَّجَرُ يَسْجُدَانِ. ﴿6﴾ |
|
7
మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.[1]
[1] అంటే ప్రపంచంలో న్యాయాన్ని నెలకొల్పాడు, చూడండి, 57:25, 42:17.
|
وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلْمِيزَانَ. ﴿7﴾ |
|
8
తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని![1]
[1] అంటే న్యాయానికి విరుద్ధంగా పోకండి, న్యాయాన్ని భంగపరచకండి.
|
أَلَّا تَطْغَوْا۟ فِى ٱلْمِيزَانِ. ﴿8﴾ |
| 9 మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి. | وَأَقِيمُوا۟ ٱلْوَزْنَ بِٱلْقِسْطِ وَلَا تُخْسِرُوا۟ ٱلْمِيزَانَ. ﴿9﴾ |
| 10 మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు. | وَٱلْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ. ﴿10﴾ |
| 11 అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి. | فِيهَا فَٰكِهَةٌۭ وَٱلنَّخْلُ ذَاتُ ٱلْأَكْمَامِ. ﴿11﴾ |
|
12
మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి)[1] ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!
[1] అల్-'అ'స్ఫు: అంటే ఎండిన గడ్డి, గడ్డి పరక, పొట్టు, ఊక, పొర, ధాన్యపు దంట్లు ఎండిపోయిన తరువాత 'అ'స్ఫుగా మారిపోతాయి. దానిని పశువులు తింటాయి.
|
وَٱلْحَبُّ ذُو ٱلْعَصْفِ وَٱلرَّيْحَانُ. ﴿12﴾ |
| 13 అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿13﴾ |
|
14
ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో[1] సృష్టించాడు.
[1] 'సల్-'సాలిన్: అంటే ఎండిన మట్టి. ఫ'ఖ్ఖారున్: అంటే మంటలో కాలిన మట్టి. ఇంకా చూడండి, 15:26.
|
خَلَقَ ٱلْإِنسَٰنَ مِن صَلْصَٰلٍۢ كَٱلْفَخَّارِ. ﴿14﴾ |
|
15
మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.[1]
[1] చూడండి, 15:27, 6:100 మరియు 37:158.
|
وَخَلَقَ ٱلْجَآنَّ مِن مَّارِجٍۢ مِّن نَّارٍۢ. ﴿15﴾ |
| 16 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿16﴾ |
|
17
ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.[1]
[1] చూడండి, 37:5 మరియు 70:40.
|
رَبُّ ٱلْمَشْرِقَيْنِ وَرَبُّ ٱلْمَغْرِبَيْنِ. ﴿17﴾ |
| 18 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿18﴾ |
| 19 ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు. | مَرَجَ ٱلْبَحْرَيْنِ يَلْتَقِيَانِ. ﴿19﴾ |
|
20
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.[1]
[1] చూఈ విషయం ఎన్నో విధాలుగా బోధించబడింది: 1) భూమిపై మంచి నీళ్ళ నదులు, చెరువులు సరస్సులు మొదలైనవి మరియు ఉప్పునీటి సముద్రాలు, అన్నీ భూమి మీదనే ఉన్నా, వాటి రుచులు వేరువేరుగా ఉన్నాయి. 2) ఉప్పునీటి సముద్రాలలో మంచినీటి ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి. కాని అవి కలిసిపోవు. వాటి రుచి, భిన్నంగానే ఉంటుంది. 3) మరికొన్ని చోట్లలో నదుల నీరు సముద్రంలో పోయి కలుస్తుంది. చాలా దూరం వరకు ఒకవైపు సముద్రపు నీళ్ళు ఉప్పగానూ మరొక వైపు నది నీళ్ళు తియ్యగాను ఉంటాయి. ఇంకా చూడండి, 25:53.
|
بَيْنَهُمَا بَرْزَخٌۭ لَّا يَبْغِيَانِ. ﴿20﴾ |
| 21 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿21﴾ |
| 22 ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి. | يَخْرُجُ مِنْهُمَا ٱللُّؤْلُؤُ وَٱلْمَرْجَانُ. ﴿22﴾ |
| 23 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿23﴾ |
|
24
మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే![1]
[1] చూడండి, 42:32-34.
|
وَلَهُ ٱلْجَوَارِ ٱلْمُنشَـَٔاتُ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَٰمِ. ﴿24﴾ |
| 25 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿25﴾ |
| 26 దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది. | كُلُّ مَنْ عَلَيْهَا فَانٍۢ. ﴿26﴾ |
|
27
మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు[1] మరియు పరమదాత[2] అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే![3]
[1] జు'ల్-జలాల్: Majesty, Possessor of Glory, Greatness మహిమాన్వితుడు, ఘనత, వైభవం, విఖ్యాతి, ప్రతాపం గలవాడు, సార్వభౌముడు.
[2] అల్-ఇక్రామ్: Most Generous, Bountenous, Noble, Honourable పరమదాత, దాతృత్వుడు, ఆదరణీయుడు, మహోపకారి, ఉదారుడు, దివ్యుడు, చూడండి, 55:78.
జల్-జలాలి వల్-ఇక్రామ్: మహిమాన్వితుడు మరియు పరమదాత Lord of Majesty and Generosity ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[3] చూడండి, 28:88.
|
وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ. ﴿27﴾ |
| 28 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿28﴾ |
| 29 భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు. | يَسْـَٔلُهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِى شَأْنٍۢ. ﴿29﴾ |
| 30 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿30﴾ |
|
31
భారాలను మోసే మీరిద్దరు![1] త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.
[1] అస్-స'ఖలాన్: దీని మరొక తాత్పర్యం: 'భూమికి భారమైన మీరిద్దరు!' అని ఇవ్వబడింది. ఈ పదం జిన్నాతులు మరియు మానవుల కోసం వాడబడింది.
|
سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ ٱلثَّقَلَانِ. ﴿31﴾ |
| 32 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿32﴾ |
|
33
ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) యొక్క విధివ్రాత నుండి పారిపోగల శక్తి ఎవ్వరికీ లేదు. ఎక్కడికి పారిపోగలరు? అల్లాహ్ (సు.తా.) హద్దులలో లేని చోటు అనేదే లేదు!
|
يَٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ إِنِ ٱسْتَطَعْتُمْ أَن تَنفُذُوا۟ مِنْ أَقْطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ فَٱنفُذُوا۟ ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَٰنٍۢ. ﴿33﴾ |
| 34 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿34﴾ |
|
35
మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ[1] పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).
[1] ను'హాసున్: దీని మరొక అర్థం కరిగిన రాగి లేక ఇత్తడి.
|
يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌۭ مِّن نَّارٍۢ وَنُحَاسٌۭ فَلَا تَنتَصِرَانِ. ﴿35﴾ |
| 36 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿36﴾ |
|
37
మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.[1]
[1] అద్దిహాను: దీని మరొక అర్థం ఎర్రని చర్మం (పచ్చిది లేదా శుభ్రం చేసింది).
|
فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتْ وَرْدَةًۭ كَٱلدِّهَانِ. ﴿37﴾ |
| 38 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿38﴾ |
|
39
ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.[1]
[1] చూడండి, 18:49. వారి నాలుకలు, చేతులు మరియు కాళ్ళు వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. ఇంకా చూడండి, 24:24.
|
فَيَوْمَئِذٍۢ لَّا يُسْـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٌۭ وَلَا جَآنٌّۭ. ﴿39﴾ |
| 40 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿40﴾ |
|
41
ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.[1]
[1] చూడండి, 96:15-16.
|
يُعْرَفُ ٱلْمُجْرِمُونَ بِسِيمَٰهُمْ فَيُؤْخَذُ بِٱلنَّوَٰصِى وَٱلْأَقْدَامِ. ﴿41﴾ |
| 42 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿42﴾ |
| 43 ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే! | هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ. ﴿43﴾ |
| 44 వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. | يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍۢ. ﴿44﴾ |
| 45 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿45﴾ |
| 46 మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి. | وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ. ﴿46﴾ |
| 47 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿47﴾ |
|
48
అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.[1]
[1] చూడండి, 32:17. స్వర్గంలో ఉన్న భోగభాగ్యాలు ఎవ్వరూ ఊహించలేరు.
|
ذَوَاتَآ أَفْنَانٍۢ. ﴿48﴾ |
| 49 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿49﴾ |
|
50
ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.[1]
[1] ఒక సెలయేరు పేరు తస్ నీమ్, మరొక దాని పేరు సల్ సబీల్.
|
فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ. ﴿50﴾ |
| 51 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿51﴾ |
| 52 ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది. | فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٍۢ زَوْجَانِ. ﴿52﴾ |
| 53 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿53﴾ |
|
54
వారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.[1]
[1] చూడండి, 18:31.
|
مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍۢ ۚ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍۢ. ﴿54﴾ |
| 55 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿55﴾ |
|
56
అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.[1]
[1] చూడండి, 56:35-36, 38:52.
|
فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌۭ قَبْلَهُمْ وَلَا جَآنٌّۭ. ﴿56﴾ |
| 57 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿57﴾ |
| 58 వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు. | كَأَنَّهُنَّ ٱلْيَاقُوتُ وَٱلْمَرْجَانُ. ﴿58﴾ |
| 59 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿59﴾ |
| 60 సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా? | هَلْ جَزَآءُ ٱلْإِحْسَٰنِ إِلَّا ٱلْإِحْسَٰنُ. ﴿60﴾ |
| 61 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿61﴾ |
| 62 మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి. | وَمِن دُونِهِمَا جَنَّتَانِ. ﴿62﴾ |
| 63 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿63﴾ |
| 64 అవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి. | مُدْهَآمَّتَانِ. ﴿64﴾ |
| 65 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿65﴾ |
| 66 ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి. | فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ. ﴿66﴾ |
| 67 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿67﴾ |
| 68 ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి. | فِيهِمَا فَٰكِهَةٌۭ وَنَخْلٌۭ وَرُمَّانٌۭ. ﴿68﴾ |
| 69 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿69﴾ |
| 70 వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు. | فِيهِنَّ خَيْرَٰتٌ حِسَانٌۭ. ﴿70﴾ |
| 71 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿71﴾ |
|
72
నిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.[1]
[1] చూడండి, 55:56, 52:20, 44:54, 38:52 మరియు 37:48.
|
حُورٌۭ مَّقْصُورَٰتٌۭ فِى ٱلْخِيَامِ. ﴿72﴾ |
| 73 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿73﴾ |
| 74 ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు. | لَمْ يَطْمِثْهُنَّ إِنسٌۭ قَبْلَهُمْ وَلَا جَآنٌّۭ. ﴿74﴾ |
| 75 అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿75﴾ |
| 76 వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. | مُتَّكِـِٔينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍۢ وَعَبْقَرِىٍّ حِسَانٍۢ. ﴿76﴾ |
|
77
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?[1]
[1] ఈ ఆయత్ ఈ సూరహ్ లో 31 సార్లు వచ్చింది. అల్లాహ్ (సు.తా.) ఈ సూరహ్ లో స్వర్గంలో ప్రసాదించబడే అన్ని రకాల సౌకర్యాలను, భోగభాగ్యాలను వివరించిన తరువాత ఈ ప్రశ్న వేశాడు. అంకే కాక నరక శిక్ష తరువాత కూడా ఈ ప్రశ్న వేశాడు. అంటే మీరు దాని నుండి ఎందుకు తప్పించుకోవటానికి ప్రయత్నించరు? అని అర్థం. రెండవది: ఏమిటంటే, జిన్నాతులు కూడా మానవుల వలే బుద్ధి మరియు మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణాశక్తి కలిగి ఉన్నారు. కావున వారు కూడా ఏక దైవారాధన చేయటానికి ఆజ్ఞాపించబడ్డారు. సర్వసృష్టిలో కేవలం ఈ రెండురకాల జీవులు మాత్రమే - బుద్ధి మరియు విచక్షణాశక్తి ప్రసాదించబడటం వల్ల - పరీక్షకు గురిచేయబడ్డారు. అందులో నెగ్గిన వారికి స్వర్గం మరియు నెగ్గని వారికి నరకం. మూడవది: అల్లాహ్ (సు.తా.) ప్రసాదించిన సుఖసంతోషాలను అనుభవించటం ముస్త'హాబ్. ఈ ఆయత్ మళ్ళీ మళ్ళీ చెప్పే నాలుగవ ఉద్దేశ్యం: అల్లాహ్ కు అవిధేయులై ఉండటం నుండి ఆపటం. ఎందుకంటే ఆయనే (సు.తా.) ఈ అనుగ్రహాలన్నింటినీ ప్రసాదించాడు. కావున దైవప్రవక్త ('స'అస) దీనికి జవాబుగా అన్నారు: 'ఓ మా ప్రభూ! మేము నీ యొక్క ఏ అనుగ్రహాన్ని కూడా నిరాకరించడం లేదు, సర్వస్తోత్రాలకు అర్హుడవు నీవే!'(తిర్మిజీ' - అల్బానీ ప్రమాణీకం).
|
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿77﴾ |
|
78
మహిమాన్వితుడు మరియు పరమ దాత[1] అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.[2]
[1] చూడండి, 55:27 వ్యాఖ్యానం 2.
[2] తబారక, బరకతున్: అంటే ఎల్లప్పుడు శాశ్వతంగా ఉండే మేలు. ఆయన దగ్గర ఎల్లప్పుడు మేలే ఉంది. కొందరు దీని అర్థం, ఎంతో శుభదాయకమైనది, సర్వశ్రేష్ఠమైనది అని అన్నారు. ఆయన పేరే ఇంత శ్రేష్ఠమనదైతే ఆయన స్వయంగా ఎంత గొప్పవాడు, మహిమగలవాడు మరియు శుభాలను ప్రసాదించేవాడు కాగలడు!
|
تَبَٰرَكَ ٱسْمُ رَبِّكَ ذِى ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ. ﴿78﴾ |