القلم
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
నూన్[1][2], కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా[3]!
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
[2] ఖుర్ఆన్ అవతరణలో, అవతరించిన మొదటి బీజ అక్షరం ఇది 'నూన్,'. ఈ అక్షరం ముఖ'త్త'ఆత్ లోనిది.
[3] అల్-ఖలమ్: చూడండి, 96:3-5. కొందరు: ఇక్కడ ప్రమాణం చేసే కలం, అంటే ఆ మొట్టమొదట సృష్టించబడి, 'విధివ్రాత' వ్రాయమని ఆజ్ఞాపించబడిన కలము, అని చెబుతారు, సునన్ తిర్మి'జీ - అల్బానీ ప్రమాణీకం (త'స్హీ'హ్).
|
نٓ ۚ وَٱلْقَلَمِ وَمَا يَسْطُرُونَ. ﴿1﴾ |
| 2 నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు! | مَآ أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍۢ. ﴿2﴾ |
| 3 మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది. | وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍۢ. ﴿3﴾ |
|
4
మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు[1]!
[1] అంటే అల్లాహ్ (సు.తా.) నీకు ఆదేశించిన మార్గం (ఇస్లాం)లో నీవు ఉన్నావు. దీని మరొక భావం నీవు మొదటి నుండియే ఉత్తమమైన గుణగణాలు గలవాడవు, సత్యసంధుడవు. 'ఆయి'షహ్ (ర.'అన్హా)తో దైవప్రవక్త ('స'అస) యొక్క గుణగణాలు మరియు ప్రవర్తనను గురించి ప్రశ్నించగా ఆమె (ర.'అన్హా) అన్నారు: " 'ఖులుఖుహూ ఖుర్ఆన్" అంటే అతని గుణగణాలు ఖుర్ఆన్ కు ప్రతిరూపాలు, ('స.ముస్లిం).
|
وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍۢ. ﴿4﴾ |
| 5 కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు; | فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ. ﴿5﴾ |
| 6 మీలో ఎవరికి పిచ్చి ఉందో! | بِأَييِّكُمُ ٱلْمَفْتُونُ. ﴿6﴾ |
| 7 నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు! | إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ. ﴿7﴾ |
| 8 కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు. | فَلَا تُطِعِ ٱلْمُكَذِّبِينَ. ﴿8﴾ |
|
9
ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ గోరుతున్నారు.[1]
[1] అంటే నీవు ('స'అస) ధర్మ విషయంలో కొన్ని సవరణలు చేయటానికి ఒప్పుకుంటే, వారు నీతో రాజీపడటానికి సిద్ధంగా ఉన్నారు.
|
وَدُّوا۟ لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ. ﴿9﴾ |
| 10 కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు; | وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍۢ مَّهِينٍ. ﴿10﴾ |
| 11 చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని; | هَمَّازٍۢ مَّشَّآءٍۭ بِنَمِيمٍۢ. ﴿11﴾ |
| 12 మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని; | مَّنَّاعٍۢ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ. ﴿12﴾ |
| 13 నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని; | عُتُلٍّۭ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ. ﴿13﴾ |
| 14 వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే! | أَن كَانَ ذَا مَالٍۢ وَبَنِينَ. ﴿14﴾ |
| 15 ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు. | إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ. ﴿15﴾ |
| 16 మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము. | سَنَسِمُهُۥ عَلَى ٱلْخُرْطُومِ. ﴿16﴾ |
| 17 నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో! | إِنَّا بَلَوْنَٰهُمْ كَمَا بَلَوْنَآ أَصْحَٰبَ ٱلْجَنَّةِ إِذْ أَقْسَمُوا۟ لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ. ﴿17﴾ |
| 18 మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా! | وَلَا يَسْتَثْنُونَ. ﴿18﴾ |
| 19 కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది. | فَطَافَ عَلَيْهَا طَآئِفٌۭ مِّن رَّبِّكَ وَهُمْ نَآئِمُونَ. ﴿19﴾ |
| 20 దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది. | فَأَصْبَحَتْ كَٱلصَّرِيمِ. ﴿20﴾ |
| 21 తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు: | فَتَنَادَوْا۟ مُصْبِحِينَ. ﴿21﴾ |
| 22 "మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి." | أَنِ ٱغْدُوا۟ عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَٰرِمِينَ. ﴿22﴾ |
| 23 ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు. | فَٱنطَلَقُوا۟ وَهُمْ يَتَخَٰفَتُونَ. ﴿23﴾ |
| 24 "ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!" | أَن لَّا يَدْخُلَنَّهَا ٱلْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌۭ. ﴿24﴾ |
| 25 మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు. | وَغَدَوْا۟ عَلَىٰ حَرْدٍۢ قَٰدِرِينَ. ﴿25﴾ |
| 26 వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము! | فَلَمَّا رَأَوْهَا قَالُوٓا۟ إِنَّا لَضَآلُّونَ. ﴿26﴾ |
| 27 కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము!" | بَلْ نَحْنُ مَحْرُومُونَ. ﴿27﴾ |
|
28
వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)[1]?"
[1] కొందరు వ్యాఖ్యాతలు ఇక్కడ తస్బీ'హ్ అంటే : ఇన్షా 'అల్లాహ్ - అల్లాహ్ కోరితే! అని అనటమని వ్యాఖ్యానించారు.
|
قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ. ﴿28﴾ |
| 29 వారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!" | قَالُوا۟ سُبْحَٰنَ رَبِّنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ. ﴿29﴾ |
| 30 తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు. | فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍۢ يَتَلَٰوَمُونَ. ﴿30﴾ |
| 31 వారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము! | قَالُوا۟ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا طَٰغِينَ. ﴿31﴾ |
| 32 బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!" | عَسَىٰ رَبُّنَآ أَن يُبْدِلَنَا خَيْرًۭا مِّنْهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ. ﴿32﴾ |
| 33 ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది! | كَذَٰلِكَ ٱلْعَذَابُ ۖ وَلَعَذَابُ ٱلْءَاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ. ﴿33﴾ |
| 34 నిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి. | إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّٰتِ ٱلنَّعِيمِ. ﴿34﴾ |
|
35
ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా[1]?
[1] ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ముస్లిం పదం ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది. ముస్లిం అంటే అల్లాహ్ (సు.తా.)కు విధేయుడై, ఆయన (సు.తా.) ఆజ్ఞాపించిన ఏకదైవ సిద్ధాంతంపై ఉండి, ఆరాధనను కేవలం ఆయన (సు.తా.)కే ప్రత్యేకించుకొని, ఆరాధనలో ఎవ్వరినీ కూడా ఆయన (సు.తా.)కు సాటిగా నిలబెట్టకుండా ఉండేవాడు. తనను తాను కేవలం అల్లాహ్ (సు.తా.) దాస్యానికి మాత్రమే అంకితం చేసుకున్నవాడు. దీని మూల పదం సలాం, అంటే శాంతి.
|
أَفَنَجْعَلُ ٱلْمُسْلِمِينَ كَٱلْمُجْرِمِينَ. ﴿35﴾ |
| 36 మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు? | مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ. ﴿36﴾ |
| 37 మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి! | أَمْ لَكُمْ كِتَٰبٌۭ فِيهِ تَدْرُسُونَ. ﴿37﴾ |
| 38 నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని? | إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ. ﴿38﴾ |
| 39 లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా? | أَمْ لَكُمْ أَيْمَٰنٌ عَلَيْنَا بَٰلِغَةٌ إِلَىٰ يَوْمِ ٱلْقِيَٰمَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ. ﴿39﴾ |
| 40 వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు. | سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ. ﴿40﴾ |
| 41 లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను. | أَمْ لَهُمْ شُرَكَآءُ فَلْيَأْتُوا۟ بِشُرَكَآئِهِمْ إِن كَانُوا۟ صَٰدِقِينَ. ﴿41﴾ |
| 42 (జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు! | يَوْمَ يُكْشَفُ عَن سَاقٍۢ وَيُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ. ﴿42﴾ |
| 43 వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)! | خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌۭ ۖ وَقَدْ كَانُوا۟ يُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ وَهُمْ سَٰلِمُونَ. ﴿43﴾ |
|
44
కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము[1].
[1] చూడండి, 7:182-183.
|
فَذَرْنِى وَمَن يُكَذِّبُ بِهَٰذَا ٱلْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ. ﴿44﴾ |
|
45
మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది[1].
[1] కైదున్: పన్నుగడ, పన్నాగం, పథకం, యోజన, వ్యూహం. ఇంకా చూడండి, 10:5.
|
وَأُمْلِى لَهُمْ ۚ إِنَّ كَيْدِى مَتِينٌ. ﴿45﴾ |
| 46 లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి? | أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًۭا فَهُم مِّن مَّغْرَمٍۢ مُّثْقَلُونَ. ﴿46﴾ |
|
47
లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా[1]? వారు దానిని వ్రాసి పెట్టడానికి?
[1] 'గైబున్: అగోచరం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది, ఇంకా చూడండి, 96:6.
|
أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ. ﴿47﴾ |
|
48
కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు[1]. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు.
[1] యూనుస్ ('అ.స.) యొక్క వివరాల కోసం చూడండి, 21:87 మరియు 37:140.
|
فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌۭ. ﴿48﴾ |
|
49
అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు[1].
[1] దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది: "ఒకవేళ అతనిపై అతని ప్రభువు (సు.తా.) అనుగ్రహమే గనక లేకుంటే! నిశ్చయంగా, అతను అవమానకరమైన స్థితిలో బంజరు మైదానంలో విసరివేయబడేవాడు." మరొక వ్యాఖ్యానం: "అల్లాహ్ (సు.తా.) అతనికి పశ్చాత్తాపపడే సద్బుద్ధి గనక ఇవ్వకుండా ఉంటే మరియు అతని ప్రార్థన అంగీకరించబడకుండా ఉంటే అతను సముద్రపు అంచున వేయబడకుండా ఉంటే - ఎక్కడైతే అతనికి ఆహారం ఇచ్చాడో మరియు తీగ పెంచాడో - బంజరు భూమిలో విసిరివేయబడి ఉండేవాడు. మరియు అల్లాహ్ (సు.తా.) వద్ద అతని పరిస్థితి అవమానకరమైనదై ఉండేది. కాని అతని ప్రార్థన అంగీకరించబడిన తరువాత అతను అనుగ్రహించబడ్డాడు." ఇంకా చూడండి, 37:143.
|
لَّوْلَآ أَن تَدَٰرَكَهُۥ نِعْمَةٌۭ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلْعَرَآءِ وَهُوَ مَذْمُومٌۭ. ﴿49﴾ |
| 50 చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు. | فَٱجْتَبَٰهُ رَبُّهُۥ فَجَعَلَهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ. ﴿50﴾ |
|
51
మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు[1]. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.
[1] ఒకవేళ నీకు అల్లాహ్ (సు.తా.) రక్షణయే గనక లేకుంటా! వారిదిష్టి నీకు తగిలేది. (ఇబ్నె-కసీ'ర్). ఇబ్నె-కసీ'ర్ ఇంకా ఇలా వ్రాసారు. దిష్టి తగలటం మరియు అల్లాహ్ (సు.తా.) అనుమతితో దానివల్ల నష్టం కలగటం నిజమే. కావున 'హదీస్' లలో దీని నుండి విముక్తి పొందటానికి దు'ఆలు ఇవ్వబడ్డాయి మరియు ఈ సలహాలు కూడా ఇవ్వబడ్డాయి : ఏదైనా మంచి వస్తువును చూస్తే దిష్టి తగలకుండా ఉండటానికి : 'మాషా అల్లాహ్' లేక 'బారకల్లాహ్' అనాలి. ఒకవేళ దిష్టి తగిలితే : దిష్టి పెట్టినవాడు ఒక పాత్రలో స్నానం చేసి ఆ నీటిని దిష్టి తగిలినవాడి మీద పోయాలి. (ఇబ్నె-కసీ'ర్).
|
وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُوا۟ لَيُزْلِقُونَكَ بِأَبْصَٰرِهِمْ لَمَّا سَمِعُوا۟ ٱلذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجْنُونٌۭ. ﴿51﴾ |
| 52 కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే! | وَمَا هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَٰلَمِينَ. ﴿52﴾ |