Loading date... | Loading Hijri date... | Loading time...

الحاقة

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)! ٱلْحَآقَّةُ. ﴿1﴾
2 ఏమిటా అనివార్య సంఘటన? مَا ٱلْحَآقَّةُ. ﴿2﴾
3 మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు? وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحَآقَّةُ. ﴿3﴾
4 సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.[1]
[1] 'ఆద్ మరియు స'మూద్ జాతుల సమాచారం కొరకు చూడండి, 7:65-79.
كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ. ﴿4﴾
5 కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు. فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا۟ بِٱلطَّاغِيَةِ. ﴿5﴾
6 మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు. وَأَمَّا عَادٌۭ فَأُهْلِكُوا۟ بِرِيحٍۢ صَرْصَرٍ عَاتِيَةٍۢ. ﴿6﴾
7 ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు[1]. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు!
[1] చూడండి, 7:78.
سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍۢ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومًۭا فَتَرَى ٱلْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍۢ. ﴿7﴾
8 అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా? فَهَلْ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍۢ. ﴿8﴾
9 ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ[1], అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.
[1] అంటే లూ'త్ ('అ.స.) ప్రజలు. సోడోమ్, గొమొర్రాహ్ వాసులు, చూడండి, 11:69-83.
وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَٰتُ بِٱلْخَاطِئَةِ. ﴿9﴾
10 మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు. فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةًۭ رَّابِيَةً. ﴿10﴾
11 నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని[1] పయనించే (నావలో) ఎక్కించాము.
[1] మిమ్మల్ని అంటే మీ పూర్వీకులను.
إِنَّا لَمَّا طَغَا ٱلْمَآءُ حَمَلْنَٰكُمْ فِى ٱلْجَارِيَةِ. ﴿11﴾
12 దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము. لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةًۭ وَتَعِيَهَآ أُذُنٌۭ وَٰعِيَةٌۭ. ﴿12﴾
13 ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో![1]
[1] అల్-'హాఖ్ఖహ్ : ఏ విధంగా సంభవిస్తుందో ఇక్కడ వివరించబడుతోంది. ఇస్రాఫీల్ ('అ.స.) పెద్ధ ధ్వనితో బాకా ఊదగానే అది సంభవిస్తుంది.
فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ نَفْخَةٌۭ وَٰحِدَةٌۭ. ﴿13﴾
14 మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో! وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةًۭ وَٰحِدَةًۭ. ﴿14﴾
15 అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది. فَيَوْمَئِذٍۢ وَقَعَتِ ٱلْوَاقِعَةُ. ﴿15﴾
16 మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది[1].
[1] అంటే దీని అర్థం ఇది కావచ్చు. ఆకాశంలోని నక్షత్రాల వ్యవస్థ సడలిపోతుంది. అవి బ్రద్ధలై పోయి వాటి మధ్య నున్న గురుత్వాకర్షణ శక్తి నశించిపోతుంది.
وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍۢ وَاهِيَةٌۭ. ﴿16﴾
17 మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు. وَٱلْمَلَكُ عَلَىٰٓ أَرْجَآئِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍۢ ثَمَٰنِيَةٌۭ. ﴿17﴾
18 ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు[1].
[1] అంటే 'హాజరు చేయబడి, ప్రతివాని కర్మపత్రాలు అతని చేతికిచ్చి వాటి ఆధారంగా అతని తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ప్రకారం అతడు తన గమ్యస్థానానికి (స్వర్గం లేక నరకానికి) పంపబడతాడు.
يَوْمَئِذٍۢ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌۭ. ﴿18﴾
19 ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి! فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقْرَءُوا۟ كِتَٰبِيَهْ. ﴿19﴾
20 నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని!" إِنِّى ظَنَنتُ أَنِّى مُلَٰقٍ حِسَابِيَهْ. ﴿20﴾
21 కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు. فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ. ﴿21﴾
22 అత్యున్నతమైన స్వర్గవనంలో[1].
[1] స్వర్గాలలో ఎన్నో దరజాలు ఉన్నాయి. నూరు దరజాలున్నాయని 'హదీస్'లో చెప్పబడింది. దరజా అంటే వర్గం, క్రమం, శ్రేణి, కక్ష్య లేక తరగతి.
فِى جَنَّةٍ عَالِيَةٍۢ. ﴿22﴾
23 దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి. قُطُوفُهَا دَانِيَةٌۭ. ﴿23﴾
24 (వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!" كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَآ أَسْلَفْتُمْ فِى ٱلْأَيَّامِ ٱلْخَالِيَةِ. ﴿24﴾
25 ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది! وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيْتَنِى لَمْ أُوتَ كِتَٰبِيَهْ. ﴿25﴾
26 మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది! وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ. ﴿26﴾
27 అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది! يَٰلَيْتَهَا كَانَتِ ٱلْقَاضِيَةَ. ﴿27﴾
28 నా సంపద నాకేమీ పనికి రాలేదు; مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ ۜ. ﴿28﴾
29 నా అధికారమంతా అంతమై పోయింది!" هَلَكَ عَنِّى سُلْطَٰنِيَهْ. ﴿29﴾
30 (అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి[1];
[1] 'గుల్లూహున్: అతనికి సంకెళ్ళు వేయండి. చూడండి, 13:5, 34:33, 36:8, 40:71.
خُذُوهُ فَغُلُّوهُ. ﴿30﴾
31 తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి. ثُمَّ ٱلْجَحِيمَ صَلُّوهُ. ﴿31﴾
32 ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి[1]!"
[1] చూడండి, 14:49.
ثُمَّ فِى سِلْسِلَةٍۢ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًۭا فَٱسْلُكُوهُ. ﴿32﴾
33 వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు. إِنَّهُۥ كَانَ لَا يُؤْمِنُ بِٱللَّهِ ٱلْعَظِيمِ. ﴿33﴾
34 మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు. وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ. ﴿34﴾
35 కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు; فَلَيْسَ لَهُ ٱلْيَوْمَ هَٰهُنَا حَمِيمٌۭ. ﴿35﴾
36 మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు! وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍۢ. ﴿36﴾
37 దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు! لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَٰطِـُٔونَ. ﴿37﴾
38 కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను; فَلَآ أُقْسِمُ بِمَا تُبْصِرُونَ. ﴿38﴾
39 మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా! وَمَا لَا تُبْصِرُونَ. ﴿39﴾
40 నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు. إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ. ﴿40﴾
41 మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍۢ ۚ قَلِيلًۭا مَّا تُؤْمِنُونَ. ﴿41﴾
42 మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ. وَلَا بِقَوْلِ كَاهِنٍۢ ۚ قَلِيلًۭا مَّا تَذَكَّرُونَ. ﴿42﴾
43 ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది. تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ. ﴿43﴾
44 ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే! وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ ٱلْأَقَاوِيلِ. ﴿44﴾
45 మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం. لَأَخَذْنَا مِنْهُ بِٱلْيَمِينِ. ﴿45﴾
46 తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం. ثُمَّ لَقَطَعْنَا مِنْهُ ٱلْوَتِينَ. ﴿46﴾
47 అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు. فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَٰجِزِينَ. ﴿47﴾
48 మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం. وَإِنَّهُۥ لَتَذْكِرَةٌۭ لِّلْمُتَّقِينَ. ﴿48﴾
49 మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు. وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ. ﴿49﴾
50 మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది. وَإِنَّهُۥ لَحَسْرَةٌ عَلَى ٱلْكَٰفِرِينَ. ﴿50﴾
51 మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం. وَإِنَّهُۥ لَحَقُّ ٱلْيَقِينِ. ﴿51﴾
52 కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు. فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ. ﴿52﴾