المعارج
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ప్రశ్నించేవాడు[1], ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;
[1] ఈ ప్రశ్నించే సత్యతిరస్కారి న'దర్ బిన్-'హారిస్' లేదా అబూ-జహల్ కావచ్చని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. చూడండి, 8:32. అతడు బద్ర్ యుద్ధంలో చంపబడ్డాడు.
|
سَأَلَ سَآئِلٌۢ بِعَذَابٍۢ وَاقِعٍۢ. ﴿1﴾ |
| 2 సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు. | لِّلْكَٰفِرِينَ لَيْسَ لَهُۥ دَافِعٌۭ. ﴿2﴾ |
|
3
అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది[1].
[1] చూడండి, 76:3.
|
مِّنَ ٱللَّهِ ذِى ٱلْمَعَارِجِ. ﴿3﴾ |
|
4
యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో[1], దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[2] ఆయన వద్దకు అధిరోహిస్తారు.
[1] చూడండి, 22:47 అక్కడ నీ ప్రభువు దృష్టిలో ఒక దినము మీరు లెక్కించే వేయి సంవత్సరాలకు సమానం. ఇంకా చూడండి, 32:5. అల్లాహ్ (సు.తా.) అనంతుడు, అపారుడు, అంతులేనివాడు, కాలపరిమితికి అతీతుడు. పరలోక జీవితంలో మానవునికి కూడా కాలమనే దానికి ఎలాంటి అర్థం ఉండదు.
[2] రూ'హ్: దీనిని ఇక్కడ కొందరు వ్యాఖ్యాతలు జిబ్రీల్ ('అ.స.) అన్నారు. మరికొందరు మానవుల ఆత్మలన్నారు. చూడండి, 19:17 వ్యాఖ్యానం 1.
|
تَعْرُجُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيْهِ فِى يَوْمٍۢ كَانَ مِقْدَارُهُۥ خَمْسِينَ أَلْفَ سَنَةٍۢ. ﴿4﴾ |
| 5 కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో! | فَٱصْبِرْ صَبْرًۭا جَمِيلًا. ﴿5﴾ |
| 6 వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు. | إِنَّهُمْ يَرَوْنَهُۥ بَعِيدًۭا. ﴿6﴾ |
| 7 కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది. | وَنَرَىٰهُ قَرِيبًۭا. ﴿7﴾ |
| 8 ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది. | يَوْمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلْمُهْلِ. ﴿8﴾ |
|
9
మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి[1].
[1] చూడండి, 101:5 ఇటువంటి ఆయత్ కు.
|
وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ. ﴿9﴾ |
| 10 మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు. | وَلَا يَسْـَٔلُ حَمِيمٌ حَمِيمًۭا. ﴿10﴾ |
| 11 వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు; | يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ ٱلْمُجْرِمُ لَوْ يَفْتَدِى مِنْ عَذَابِ يَوْمِئِذٍۭ بِبَنِيهِ. ﴿11﴾ |
| 12 మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి; | وَصَٰحِبَتِهِۦ وَأَخِيهِ. ﴿12﴾ |
| 13 మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను; | وَفَصِيلَتِهِ ٱلَّتِى تُـْٔوِيهِ. ﴿13﴾ |
| 14 మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు. | وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًۭا ثُمَّ يُنجِيهِ. ﴿14﴾ |
| 15 కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)! | كَلَّآ ۖ إِنَّهَا لَظَىٰ. ﴿15﴾ |
| 16 అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది. | نَزَّاعَةًۭ لِّلشَّوَىٰ. ﴿16﴾ |
| 17 అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది. | تَدْعُوا۟ مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ. ﴿17﴾ |
| 18 మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని. | وَجَمَعَ فَأَوْعَىٰٓ. ﴿18﴾ |
| 19 నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు; | ۞ إِنَّ ٱلْإِنسَٰنَ خُلِقَ هَلُوعًا. ﴿19﴾ |
| 20 తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు; | إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًۭا. ﴿20﴾ |
| 21 మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు. | وَإِذَا مَسَّهُ ٱلْخَيْرُ مَنُوعًا. ﴿21﴾ |
| 22 నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప! | إِلَّا ٱلْمُصَلِّينَ. ﴿22﴾ |
| 23 ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో; | ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ. ﴿23﴾ |
|
24
మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో![1]
[1] అంటే 'జకాత్ మరియు ఇతర దానధర్మాలు చేసేవారు.
|
وَٱلَّذِينَ فِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّۭ مَّعْلُومٌۭ. ﴿24﴾ |
|
25
యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి;[1]
[1] ఇటువంటి ఆయత్ కై చూడండి, 51:19.
|
لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ. ﴿25﴾ |
| 26 మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో; | وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ ٱلدِّينِ. ﴿26﴾ |
| 27 మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో! | وَٱلَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ. ﴿27﴾ |
| 28 నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు! | إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍۢ. ﴿28﴾ |
| 29 మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో - | وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَٰفِظُونَ. ﴿29﴾ |
|
30
తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప[1] - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.
[1] ధర్మయుద్ధం (జిహాద్)లో ఖైదీలుగా పట్టుబడ్డవారే బానిసలు, కనుక ఈ కాలంలో, ఇస్లాం నిర్దేశం ప్రకారం, బానిసలు అనబడేవారు అసలు లేరు. ఇంకా చూడండి, 23:5-7, 4:3.
|
إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ. ﴿30﴾ |
| 31 కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు. | فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ. ﴿31﴾ |
| 32 మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో; | وَٱلَّذِينَ هُمْ لِأَمَٰنَٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ. ﴿32﴾ |
| 33 మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో; | وَٱلَّذِينَ هُم بِشَهَٰدَٰتِهِمْ قَآئِمُونَ. ﴿33﴾ |
| 34 మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో; | وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ. ﴿34﴾ |
| 35 ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు. | أُو۟لَٰٓئِكَ فِى جَنَّٰتٍۢ مُّكْرَمُونَ. ﴿35﴾ |
| 36 ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు? | فَمَالِ ٱلَّذِينَ كَفَرُوا۟ قِبَلَكَ مُهْطِعِينَ. ﴿36﴾ |
|
37
కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా;[1]
[1] దైవప్రవక్త ('స'అస) కాలంలో సత్యతిరస్కారులు అతని సమావేశాలలో వచ్చేవారు. కాని అతని మాటలు విని, వాటిని ఆచరించక ఎగతాళి చేస్తూ గుంపులుగా వెళ్ళి పోయేవారు. మీరు (విశ్వాసులు) కాదు మేమే స్వర్గంలోకి ప్రవేశిస్తాము, అని అనేవారు.
|
عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ. ﴿37﴾ |
| 38 ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా? | أَيَطْمَعُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍۢ. ﴿38﴾ |
| 39 అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు! | كَلَّآ ۖ إِنَّا خَلَقْنَٰهُم مِّمَّا يَعْلَمُونَ. ﴿39﴾ |
|
40
కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను[1]. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము;
[1] చూడండి, 37:5 మరియు 55:17 తూర్పులూ మరియు పడమరలూ అంటే ఒక సంవత్సరపు కాలంలో ప్రతిరోజు సూర్యుడు ఒక కొత్త స్థానం నుండి ఉదయిస్తాడు మరియు ఒక కొత్త స్థానంలో అస్తమిస్తాడు. మరొక వ్యాఖ్యాన మేమిటంటే భూగోళంలోని విభిన్న భాగాలలో సూర్యుడు వేర్వేరు సమయాలలో వరుసగా ఉదయిస్తూ, అస్తమిస్తూ ఉంటాడు.
|
فَلَآ أُقْسِمُ بِرَبِّ ٱلْمَشَٰرِقِ وَٱلْمَغَٰرِبِ إِنَّا لَقَٰدِرُونَ. ﴿40﴾ |
| 41 వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు. | عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيْرًۭا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ. ﴿41﴾ |
| 42 కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు. | فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ. ﴿42﴾ |
| 43 ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు. | يَوْمَ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ سِرَاعًۭا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍۢ يُوفِضُونَ. ﴿43﴾ |
| 44 వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం! | خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌۭ ۚ ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ. ﴿44﴾ |