نوح
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 నిశ్చయంగా, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు: "వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే వారిని హెచ్చరించు!" అని (ఆజ్ఞాపించి) పంపాము. | إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌۭ. ﴿1﴾ |
| 2 అతను వారితో ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, నేను మీకు స్పష్టంగా హెచ్చరిక చేయటానికి వచ్చిన వాడిని! | قَالَ يَٰقَوْمِ إِنِّى لَكُمْ نَذِيرٌۭ مُّبِينٌ. ﴿2﴾ |
| 3 కావున మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. | أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ وَأَطِيعُونِ. ﴿3﴾ |
| 4 అలా చేస్తే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఒక నియమిత కాలం వరకు మిమ్మల్ని వదలి పెడ్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ నిర్ణయించిన కాలం వచ్చినపుడు, దానిని తప్పించడం సాధ్యం కాదు. ఇది మీరు తెలుసుకుంటే ఎంత బాగుండేది!" | يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ ٱللَّهِ إِذَا جَآءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ. ﴿4﴾ |
| 5 అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా జాతివారిని రేయింబవళ్ళు పిలిచాను; | قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًۭا وَنَهَارًۭا. ﴿5﴾ |
| 6 కాని, నా పిలుపు, వారి పలాయనాన్ని మాత్రమే హెచ్చించింది. | فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىٓ إِلَّا فِرَارًۭا. ﴿6﴾ |
| 7 మరియు వాస్తవానికి, నేను వారిని, నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు తమ చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు మరియు తమ వస్త్రాలను తమపై కప్పుకునేవారు మరియు వారు మొండి వైఖరి అవలంబిస్తూ దురహంకారంలో మునిగి ఉండేవారు. | وَإِنِّى كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوٓا۟ أَصَٰبِعَهُمْ فِىٓ ءَاذَانِهِمْ وَٱسْتَغْشَوْا۟ ثِيَابَهُمْ وَأَصَرُّوا۟ وَٱسْتَكْبَرُوا۟ ٱسْتِكْبَارًۭا. ﴿7﴾ |
| 8 తరువాత వాస్తవానికి, నేను వారిని ఎలుగెత్తి పిలిచాను. | ثُمَّ إِنِّى دَعَوْتُهُمْ جِهَارًۭا. ﴿8﴾ |
| 9 ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా పిలిచాను. | ثُمَّ إِنِّىٓ أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًۭا. ﴿9﴾ |
| 10 ఇంకా వారితో ఇలా అన్నాను: 'మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు! | فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًۭا. ﴿10﴾ |
|
11
ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు.[1]
[1] ఈ ఆయత్ ఆధారంగా కొందరు విద్వాంసులు ఈ సూరహ్ ను వర్షం కొరకు చేసే నమా'జ్ లో చదువటం ముస్త'హాబ్ అని అంటారు. ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 11:52.
|
يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًۭا. ﴿11﴾ |
| 12 మరియు మీకు ధన సంపదలలోను మరియు సంతానంలోను వృద్ధి నొసంగుతాడు మరియు మీ కొరకు తోటలను ఉత్పత్తి చేస్తాడు. మరియు నదులను ప్రవహింపజేస్తాడు.'" | وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍۢ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍۢ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًۭا. ﴿12﴾ |
|
13
మీకేమయింది? మీరు అల్లాహ్ మహత్త్వమును ఎందుకు ఆదరించరు[1]?
[1] వఖారున్: అంటే మహత్త్వం, ప్రభావం, ప్రతాపం, ఘనత
రజా: అంటే లక్ష్యపెట్టు, ఆదరించు, భయపడు.
|
مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًۭا. ﴿13﴾ |
|
14
మరియు వాస్తవానికి ఆయనే మిమ్మల్ని విభిన్న దశలలో సృష్టించాడు[1].
[1] చూడండి, 22:5, 23:14 మొదలైనవి.
|
وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا. ﴿14﴾ |
|
15
ఏమీ? మీరు చూడటం లేదా? అల్లాహ్ ఏడు ఆకాశాలను ఏ విధంగా అంతస్తులలో సృష్టించాడో[1]!
[1] చూడండి, 67:3.
|
أَلَمْ تَرَوْا۟ كَيْفَ خَلَقَ ٱللَّهُ سَبْعَ سَمَٰوَٰتٍۢ طِبَاقًۭا. ﴿15﴾ |
|
16
మరియు వాటి మధ్య చంద్రుణ్ణి (ప్రతిబింబించే) కాంతిగాను మరియు సూర్యుణ్ణి (వెలిగే) దీపం గాను చేశాడు[1]!
[1] చూడండి, 10:5.
|
وَجَعَلَ ٱلْقَمَرَ فِيهِنَّ نُورًۭا وَجَعَلَ ٱلشَّمْسَ سِرَاجًۭا. ﴿16﴾ |
|
17
మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి[1] ఉత్పత్తి చేశాడు!
[1] అంటే భూమిలో మూల పదార్థాల నుండి.
|
وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلْأَرْضِ نَبَاتًۭا. ﴿17﴾ |
| 18 తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు! | ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًۭا. ﴿18﴾ |
| 19 మరియు అల్లాహ్ యే మీ కొరకు భూమిని విస్తరింపజేశాడు. | وَٱللَّهُ جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ بِسَاطًۭا. ﴿19﴾ |
| 20 మీరు దానిపై నున్న విశాలమైన మార్గాలలో నడవటానికి. | لِّتَسْلُكُوا۟ مِنْهَا سُبُلًۭا فِجَاجًۭا. ﴿20﴾ |
| 21 నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమీ అధికం చేయదో! | قَالَ نُوحٌۭ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِى وَٱتَّبَعُوا۟ مَن لَّمْ يَزِدْهُ مَالُهُۥ وَوَلَدُهُۥٓ إِلَّا خَسَارًۭا. ﴿21﴾ |
|
22
మరియు వారు పెద్ద కుట్ర పన్నారు[1].
[1] నూ'హ్ ('అ.స.) ను చంపటానికి కుట్ర పన్నారని కొందరి అభిప్రాయం.
|
وَمَكَرُوا۟ مَكْرًۭا كُبَّارًۭا. ﴿22﴾ |
| 23 మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: 'మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్ మరియు సువాఅ; యగూస్, యఊఖ్ మరియు నస్ర్ లను విడిచిపెట్టకండి!' | وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّۭا وَلَا سُوَاعًۭا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًۭا. ﴿23﴾ |
| 24 మరియు వాస్తవానికి, వారు చాలా మందిని తప్పు దారిలో పడవేశారు. కావున (ఓ నా ప్రభూ!) : నీవు కూడా ఈ దుర్మార్గులకు కేవలం వారి మార్గభ్రష్టత్వాన్నే హెచ్చించు!''" | وَقَدْ أَضَلُّوا۟ كَثِيرًۭا ۖ وَلَا تَزِدِ ٱلظَّٰلِمِينَ إِلَّا ضَلَٰلًۭا. ﴿24﴾ |
| 25 వారు తమ పాపాల కారణంగా ముంచి వేయబడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్ తప్ప తమను కాపాడే వారినెవ్వరినీ పొందలేక పోయారు. | مِّمَّا خَطِيٓـَٰٔتِهِمْ أُغْرِقُوا۟ فَأُدْخِلُوا۟ نَارًۭا فَلَمْ يَجِدُوا۟ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارًۭا. ﴿25﴾ |
|
26
మరియు నూహ్ ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! సత్యతిరస్కారులలో ఒక్కరిని కూడా భూమి మీద వదలకు[1].
[1] చూడండి, 11:36.
|
وَقَالَ نُوحٌۭ رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا. ﴿26﴾ |
| 27 ఒకవేళ నీవు వారిని వదలి పెడితే, నిశ్చయంగా వారు నీ దాసులను మార్గభ్రష్టత్వంలో పడవేస్తారు. మరియు వారు పాపులను మరియు కృతఘ్నులను మాత్రమే పుట్టిస్తారు. | إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًۭا كَفَّارًۭا. ﴿27﴾ |
| 28 ఓ మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వానిని మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను, అందరినీ క్షమించు. మరియు దుర్మార్గులకు వినాశం తప్ప మరేమీ అధికం చేయకు!" | رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًۭا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ وَلَا تَزِدِ ٱلظَّٰلِمِينَ إِلَّا تَبَارًۢا. ﴿28﴾ |