Loading date... | Loading Hijri date... | Loading time...

المدثر

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా! يَٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ. ﴿1﴾
2 లే! ఇక హెచ్చరించు! قُمْ فَأَنذِرْ. ﴿2﴾
3 మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)! وَرَبَّكَ فَكَبِّرْ. ﴿3﴾
4 మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో! وَثِيَابَكَ فَطَهِّرْ. ﴿4﴾
5 మరియు మాలిన్యానికి దూరంగా ఉండు! وَٱلرُّجْزَ فَٱهْجُرْ. ﴿5﴾
6 మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)! وَلَا تَمْنُن تَسْتَكْثِرُ. ﴿6﴾
7 మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు! وَلِرَبِّكَ فَٱصْبِرْ. ﴿7﴾
8 మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు; فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ. ﴿8﴾
9 ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది; فَذَٰلِكَ يَوْمَئِذٍۢ يَوْمٌ عَسِيرٌ. ﴿9﴾
10 సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు[1].
[1] అల్-కాఫిరీన్ : అంటే సత్యతిరస్కారులు. ఈ పదం ఇక్కడ ఖుర్ఆన్ అవతరణా క్రమంలో మొదటి సారి వచ్చింది. 57:20లో మాత్రం ఈ పదానికి భూమిని దున్నేవాడు అనే అర్థం ఉంది. మిగతా అన్నీ చోట్లలో ఈ పదం సత్యతిరస్కారులనే అర్థంలోనే వాడబడింది.
عَلَى ٱلْكَٰفِرِينَ غَيْرُ يَسِيرٍۢ. ﴿10﴾
11 వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ[1]!
[1] చూడండి, 6:94, 19:80, 95. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ వలీద్ బిన్ ము'గైరాను ఉద్దేశిస్తోంది అని అభిప్రాయపడ్డారు. అతడు సత్యతిరస్కారం మరియు దురహంకారంలో మితిమీరి పోయాడు. ఈ ఆయత్ ఇటువంటి ప్రతి సత్యతిరస్కారిని సూచిస్తుంది.
ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًۭا. ﴿11﴾
12 మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను. وَجَعَلْتُ لَهُۥ مَالًۭا مَّمْدُودًۭا. ﴿12﴾
13 మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను! وَبَنِينَ شُهُودًۭا. ﴿13﴾
14 మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను. وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًۭا. ﴿14﴾
15 అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు. ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ. ﴿15﴾
16 అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు. كَلَّآ ۖ إِنَّهُۥ كَانَ لِءَايَٰتِنَا عَنِيدًۭا. ﴿16﴾
17 నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను! سَأُرْهِقُهُۥ صَعُودًا. ﴿17﴾
18 వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు. إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ. ﴿18﴾
19 కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి! فَقُتِلَ كَيْفَ قَدَّرَ. ﴿19﴾
20 అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి! ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ. ﴿20﴾
21 అప్పుడు అతడు ఆలోచించాడు. ثُمَّ نَظَرَ. ﴿21﴾
22 తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు); ثُمَّ عَبَسَ وَبَسَرَ. ﴿22﴾
23 తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు[1].
[1] చూడండి, 96:6-7.
ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ. ﴿23﴾
24 అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే! فَقَالَ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌۭ يُؤْثَرُ. ﴿24﴾
25 ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే إِنْ هَٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ. ﴿25﴾
26 త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను. سَأُصْلِيهِ سَقَرَ. ﴿26﴾
27 మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు[1]?
[1] సఖరున్: నరకానికి ఏడు అంతస్తులు లేక శ్రేణులున్నాయి. 1) జహన్నుమ్ (నరకం), 2) ల"జ్జా (ధ్వంసం చేసే అగ్ని), 3) 'హు'త్మ (అణగ/చితకగొట్టే శిక్ష), 4) స'యీర్ (ప్రజ్వలించే అగ్ని), 5) సఖర్ (నరకాగ్ని), 6) జ'హీమ్ (మండే అగ్ని), 7) హావియహ్, ఇది అన్నింటి కంటే క్రింది అంతస్తు, ఇందులో మునాఫిఖులు (కపటవిశ్వాసులు) ఉంటారు. ఏడు ద్వారాలు అంటే ఏడు విధాలైన పాపుల దారులు. చూడండి, 15:44.
وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ. ﴿27﴾
28 అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు[1].
[1] అంటే అది నరకవాసులను బ్రతకనివ్వదూ మరియు చావనివ్వదూ, వారి శరీరపు ప్రతి భాగాన్ని కాల్చుతుంది.
لَا تُبْقِى وَلَا تَذَرُ. ﴿28﴾
29 అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది[1].
[1] చూడండి, 87:12-13.
لَوَّاحَةٌۭ لِّلْبَشَرِ. ﴿29﴾
30 దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు. عَلَيْهَا تِسْعَةَ عَشَرَ. ﴿30﴾
31 మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు[1]. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
[1] చూడండి, 2:26.
وَمَا جَعَلْنَآ أَصْحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةًۭ ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةًۭ لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَٰنًۭا ۙ وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَٱلْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌۭ وَٱلْكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًۭا ۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ. ﴿31﴾
32 అలా కాదు! చంద్రుని సాక్షిగా! كَلَّا وَٱلْقَمَرِ. ﴿32﴾
33 గడిచిపోయే రాత్రి సాక్షిగా! وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ. ﴿33﴾
34 ప్రకాశించే, ఉదయం సాక్షిగా! وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ. ﴿34﴾
35 నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం. إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ. ﴿35﴾
36 మానవునికి ఒక హెచ్చరిక; نَذِيرًۭا لِّلْبَشَرِ. ﴿36﴾
37 మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి; لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ. ﴿37﴾
38 ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు. كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ. ﴿38﴾
39 కుడిపక్షం వారు తప్ప! إِلَّآ أَصْحَٰبَ ٱلْيَمِينِ. ﴿39﴾
40 వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు! فِى جَنَّٰتٍۢ يَتَسَآءَلُونَ. ﴿40﴾
41 అపరాధులను గురించి (మరియు వారితో అంటారు): عَنِ ٱلْمُجْرِمِينَ. ﴿41﴾
42 "మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?" مَا سَلَكَكُمْ فِى سَقَرَ. ﴿42﴾
43 వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము. قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ. ﴿43﴾
44 మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము; وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ. ﴿44﴾
45 మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము; وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ. ﴿45﴾
46 మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము; وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ. ﴿46﴾
47 చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది[1].
[1] చూడండి, 15:99.
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ. ﴿47﴾
48 అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు[1].
[1] సిపారసు కొరకు చూడండి, 10:3.
فَمَا تَنفَعُهُمْ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ. ﴿48﴾
49 అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు. فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ. ﴿49﴾
50 వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది; كَأَنَّهُمْ حُمُرٌۭ مُّسْتَنفِرَةٌۭ. ﴿50﴾
51 సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)[1]!
[1] దీనిని వ్యాఖ్యాతలు - సింహం, పులి లేక వేటగాడి నుండి - పారిపోవటం, అని అన్నారు.
فَرَّتْ مِن قَسْوَرَةٍۭ. ﴿51﴾
52 అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు[1].
[1] విప్పబడిన గ్రంథాలు అంటే : ము'హమ్మద్ ('స'అస), అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రవక్త అని వ్రాయబడిన గ్రంథం ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలని లేక దైవగ్రంథం ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలని. చూడండి, 2:118. వారు ఇలా పలకడం వారి దురహంకారాన్ని సూచిస్తుంది.
بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًۭا مُّنَشَّرَةًۭ. ﴿52﴾
53 కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు. كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ ٱلْءَاخِرَةَ. ﴿53﴾
54 అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం. كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌۭ. ﴿54﴾
55 కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు. فَمَن شَآءَ ذَكَرَهُۥ. ﴿55﴾
56 కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు[1].
[1] చూడండి, 81:28-29 మరియు 14:4.
وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ. ﴿56﴾