Loading date... | Loading Hijri date... | Loading time...

القيامة

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను. لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَٰمَةِ. ﴿1﴾
2 అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను. وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ. ﴿2﴾
3 ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా? أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ. ﴿3﴾
4 వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము. بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ. ﴿4﴾
5 అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు. بَلْ يُرِيدُ ٱلْإِنسَٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ. ﴿5﴾
6 అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు. يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَٰمَةِ. ﴿6﴾
7 కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు; فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ. ﴿7﴾
8 మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు; وَخَسَفَ ٱلْقَمَرُ. ﴿8﴾
9 మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు; وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ. ﴿9﴾
10 మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు. يَقُولُ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ. ﴿10﴾
11 అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు! كَلَّا لَا وَزَرَ. ﴿11﴾
12 ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది. إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ. ﴿12﴾
13 ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది[1].
[1] చూడండి, 18:49.
يُنَبَّؤُا۟ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ. ﴿13﴾
14 అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు; بَلِ ٱلْإِنسَٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌۭ. ﴿14﴾
15 మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే![1]
[1] చూడండి, 24:24, 36:25 లేక 41:20-22.
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ. ﴿15﴾
16 నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు[1].
[1] జిబ్రీల్ ('అ.స.) ఖుర్ఆన్ అవతరింపజేసేటప్పుడు, దైవప్రవక్త ('స'అస) ఏ పదాన్ని కూడా మరచిపోరాదని త్వరత్వరగా చదివేవారు. అల్లాహుతా'ఆలా త్వరత్వరగా చదువటం నుండి నివారించాడు. ('స.బు'ఖారీ). ఇటువంటి వాక్యానికై చూడండి, 20:114.
لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ. ﴿16﴾
17 నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే! إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ. ﴿17﴾
18 కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు. فَإِذَا قَرَأْنَٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ. ﴿18﴾
19 ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే[1]!
[1] దైవప్రవక్త ('స'అస) ఖుర్ఆన్ ను ప్రజలకు అర్థమవటానికి వివరించి చెప్పింది కూడా అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి, తనకు తెలుపబడిందే. ఈ వివరణలే 'హదీసులు!
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ. ﴿19﴾
20 అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు; كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ. ﴿20﴾
21 మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు![1]
[1] అంటే పరలోక జీవితాన్ని నమ్మటం లేదు. మీరు మీ జీవితం కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే అనే భ్రమలో పడి ఉన్నారు. మీరు పునరుత్థరింపబడతారని నమ్మటం లేదు.
وَتَذَرُونَ ٱلْءَاخِرَةَ. ﴿21﴾
22 ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి; وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاضِرَةٌ. ﴿22﴾
23 తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి[1];
[1] ఇవి విశ్వాసుల ముఖాలు.
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌۭ. ﴿23﴾
24 మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి[1];
[1] ఇవి సత్యతిరస్కారుల ముఖాలు.
وَوُجُوهٌۭ يَوْمَئِذٍۭ بَاسِرَةٌۭ. ﴿24﴾
25 నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి[1].
[1] అంటే వారు నరకంలో వేయబడతారని తెలుసుకొని.
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌۭ. ﴿25﴾
26 అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు[1];
[1] మరణం ఆసన్నమైనప్పుడు.
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ. ﴿26﴾
27 మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది[1].
[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 28:71-72.
وَقِيلَ مَنْ ۜ رَاقٍۢ. ﴿27﴾
28 మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు; وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ. ﴿28﴾
29 మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది[1].
[1] అంటే అతడు తాను కష్టాల పాలవుతున్నానని తెలుసుకుంటాడు.
وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ. ﴿29﴾
30 ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది! إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ. ﴿30﴾
31 కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు[1]!
[1] చూడండి, 4:17-18.
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ. ﴿31﴾
32 మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు! وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ. ﴿32﴾
33 ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు! ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ. ﴿33﴾
34 (ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది! أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ. ﴿34﴾
35 అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది! ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ. ﴿35﴾
36 ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా? أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَن يُتْرَكَ سُدًى. ﴿36﴾
37 ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా? أَلَمْ يَكُ نُطْفَةًۭ مِّن مَّنِىٍّۢ يُمْنَىٰ. ﴿37﴾
38 తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు[1].
[1] చూడండి, 87:2 మరియు 91:7.
ثُمَّ كَانَ عَلَقَةًۭ فَخَلَقَ فَسَوَّىٰ. ﴿38﴾
39 ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు. فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ. ﴿39﴾
40 అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా? أَلَيْسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحْۦِىَ ٱلْمَوْتَىٰ. ﴿40﴾