Loading date... | Loading Hijri date... | Loading time...

المرسلات

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా[1]!
[1] లేక దేవదూతల, లేక సందేశహరుల సాక్షిగా అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. 'ఉర్ ఫన్ - అంటే దివ్యజ్ఞానం (వ'హీ) లేక షరీయత్ ఆజ్ఞలని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం.
وَٱلْمُرْسَلَٰتِ عُرْفًۭا. ﴿1﴾
2 మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా[1]!
[1] లేక దేవదూతల సాక్షిగా! ఎవరైతే తీవ్రంగా వీచే గాలులతో సహా పంపబడతారో!
فَٱلْعَٰصِفَٰتِ عَصْفًۭا. ﴿2﴾
3 మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా[1]!
[1] లేక దేవదూతల సాక్షిగా!' ఇబ్నె-కసీ'ర్, 'తబరీ మరియు ఇతర చాలా మంది వ్యాఖ్యాతలు కూడా (ర హ్మ). ఈ మూడు ఆయతులలో గాలుల ప్రస్తావన ఉందనే అభిప్రాయపడ్డారు.
وَٱلنَّٰشِرَٰتِ نَشْرًۭا. ﴿3﴾
4 మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా[1]!
[1] లేక ఖుర్ఆన్ ఆయతుల లేక ప్రవక్తల సాక్షిగా.
فَٱلْفَٰرِقَٰتِ فَرْقًۭا. ﴿4﴾
5 సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా![1]
[1] లేక అల్లాహ్ (సు.తా.) యొక్క వ'హీని ప్రజలకు అందజేసే ప్రవక్త ('అలైహిమ్ స.) ల సాక్షిగా! ఇమామ్ షౌకాని అభిప్రాయంలో - ముర్సలాత్, 'ఆ'సిఫాత్ మరియు నాషిరాత్ - గాలులను సంబోధిస్తున్నాయి మరియు ఫారిఖాత్, ముల్ ఖియాత్ - దేవదూతలను. ఈ వ్యాఖ్యానంతో కూడా చాలా మంది వ్యాఖ్యాతలు ఏకీభవిస్తున్నారు.
فَٱلْمُلْقِيَٰتِ ذِكْرًا. ﴿5﴾
6 సాకుగా లేక హెచ్చరికగా![1]
[1] దీని మరొక తాత్పర్యం: "(మానవులకు) తెలియజేసే ఉద్ధేశంతో గానీ, లేక హెచ్చరిక చేయటానికి గానీ."
عُذْرًا أَوْ نُذْرًا. ﴿6﴾
7 నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది. إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌۭ. ﴿7﴾
8 అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో! فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ. ﴿8﴾
9 మరియు ఆకాశం చీలిపోతుందో! وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ. ﴿9﴾
10 మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో! وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ. ﴿10﴾
11 మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో![1]
[1] చూడండి, 4:41-42, 5:109, 7:6 లేక 39:69.
وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ. ﴿11﴾
12 ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి? لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ. ﴿12﴾
13 ఆ తీర్పుదినం కొరకా![1]
[1] యౌముల్ ఫ'స్ల్: పునరుత్థాన దినం. ఖుర్ఆన్ అవతరరణాక్రమంలో ఇక్కడ మొదటి సారి పేర్కొనబడింది., ఇంకా చూడండి, 37:21, 44:40, 78:17 మరియు 77:38.
لِيَوْمِ ٱلْفَصْلِ. ﴿13﴾
14 మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు? وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ. ﴿14﴾
15 ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿15﴾
16 ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా? أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ. ﴿16﴾
17 తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము. ثُمَّ نُتْبِعُهُمُ ٱلْءَاخِرِينَ. ﴿17﴾
18 ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము. كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ. ﴿18﴾
19 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿19﴾
20 ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా? أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍۢ مَّهِينٍۢ. ﴿20﴾
21 తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము. فَجَعَلْنَٰهُ فِى قَرَارٍۢ مَّكِينٍ. ﴿21﴾
22 ఒక నిర్ణీత కాలం వరకు. إِلَىٰ قَدَرٍۢ مَّعْلُومٍۢ. ﴿22﴾
23 ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము[1].
[1] చూడండి, 23:12-14.
فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَٰدِرُونَ. ﴿23﴾
24 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿24﴾
25 ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా? أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا. ﴿25﴾
26 జీవులకూ మరియు మృతులకూను? أَحْيَآءًۭ وَأَمْوَٰتًۭا. ﴿26﴾
27 మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా? وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَٰمِخَٰتٍۢ وَأَسْقَيْنَٰكُم مَّآءًۭ فُرَاتًۭا. ﴿27﴾
28 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿28﴾
29 (సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!" ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ. ﴿29﴾
30 (దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి; ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّۢ ذِى ثَلَٰثِ شُعَبٍۢ. ﴿30﴾
31 కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు! لَّا ظَلِيلٍۢ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ. ﴿31﴾
32 వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది. إِنَّهَا تَرْمِى بِشَرَرٍۢ كَٱلْقَصْرِ. ﴿32﴾
33 వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి. كَأَنَّهُۥ جِمَٰلَتٌۭ صُفْرٌۭ. ﴿33﴾
34 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿34﴾
35 ఆ దినాన వారు మాట్లాడలేరు. هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ. ﴿35﴾
36 మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు. وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ. ﴿36﴾
37 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿37﴾
38 అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము! هَٰذَا يَوْمُ ٱلْفَصْلِ ۖ جَمَعْنَٰكُمْ وَٱلْأَوَّلِينَ. ﴿38﴾
39 కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.[1]
[1] ఇటువంటి సందేశం గల ఆయత్ కోసం చూడండి, 55:33.
فَإِن كَانَ لَكُمْ كَيْدٌۭ فَكِيدُونِ. ﴿39﴾
40 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿40﴾
41 నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు. إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَٰلٍۢ وَعُيُونٍۢ. ﴿41﴾
42 మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి. وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ. ﴿42﴾
43 (వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!" كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ. ﴿43﴾
44 నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము. إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ. ﴿44﴾
45 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿45﴾
46 (ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు! كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ. ﴿46﴾
47 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿47﴾
48 మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు. وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ. ﴿48﴾
49 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది![1]
[1] ఈ ఆయత్ ఈ సూరహ్ లో పదిసార్లు వచ్చింది. ఏ విధంగానైతే: "అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?" అనే ఆయతు సూరహ్ అర్-ర'హ్ మాన్ (55)లో 31 సార్లు వచ్చిందో! అంటే, పునరుత్థాన దినాన్ని తిరస్కరించే వారికి వినాశం తప్పదనే విషయాన్ని అల్లాహుతా'లా మాటిమాటికి విశదీకరిస్తున్నాడు.
وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿49﴾
50 దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు? فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ. ﴿50﴾