Loading date... | Loading Hijri date... | Loading time...

النبأ

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?[1]
[1] దైవప్రవక్త ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ ను మరియు అతనిని ప్రవక్తగా అల్లాహ్ (సు.తా.) ఎన్నుకున్న విషయాన్ని నమ్మలేక సత్యతిరస్కారులు ఒకరితో నొకరు ఈ విధంగా ప్రశ్నించుకున్నారు: "ఏమీ? పునరుత్థానం నిజమేనా? ఇతడు వాస్తవంగానే ప్రవక్తనా?" మొదలైనవి. దానిని అల్లాహ్ (సు.తా.) స్వయంగా జవాబిచ్చాడు.
عَمَّ يَتَسَآءَلُونَ. ﴿1﴾
2 ఆ మహా వార్తను గురించేనా? عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ. ﴿2﴾
3 దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో? ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ. ﴿3﴾
4 అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు. كَلَّا سَيَعْلَمُونَ. ﴿4﴾
5 ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు. ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ. ﴿5﴾
6 ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా? أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَٰدًۭا. ﴿6﴾
7 మరియు పర్వతాలను మేకులుగా?[1]
[1] చూడండి, 16:15.
وَٱلْجِبَالَ أَوْتَادًۭا. ﴿7﴾
8 మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.[1]
[1] మానవులలో, జంతువులలో మరియు ఇతర ప్రాణంలేని వస్తువులలో కూడా జంటలున్నాయి. ఉదా: రాత్రిం-బవళ్ళు, సూర్య-చంద్రులు, ఆకాశం-భూమి, నలుపు-తెలుపు మొదలైనవి. ఇంకా చూడండి, 36:36.
وَخَلَقْنَٰكُمْ أَزْوَٰجًۭا. ﴿8﴾
9 మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము. وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًۭا. ﴿9﴾
10 మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము. وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًۭا. ﴿10﴾
11 మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము. وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًۭا. ﴿11﴾
12 మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము. وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًۭا شِدَادًۭا. ﴿12﴾
13 మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము. وَجَعَلْنَا سِرَاجًۭا وَهَّاجًۭا. ﴿13﴾
14 మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.[1]
[1] ము'అ'సిరాత్: నీటితో నిండి ఉండి ఇంకా కురవని మేఘాలు.
وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءًۭ ثَجَّاجًۭا. ﴿14﴾
15 దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి! لِّنُخْرِجَ بِهِۦ حَبًّۭا وَنَبَاتًۭا. ﴿15﴾
16 మరియు దట్టమైన తోటలను. وَجَنَّٰتٍ أَلْفَافًا. ﴿16﴾
17 నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.[1]
[1] చూడండి, 77:13.
إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَٰتًۭا. ﴿17﴾
18 ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు. يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًۭا. ﴿18﴾
19 మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి; وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًۭا. ﴿19﴾
20 మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.[1]
[1] చూడండి, 69:14, 14:48, 101:5, 70:9, 56:6, 20:105, మొదలైనవి.
وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا. ﴿20﴾
21 నిశ్చయంగా, నరకం ఒక మాటు; إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًۭا. ﴿21﴾
22 ధిక్కారుల గమ్యస్థానం; لِّلطَّٰغِينَ مَـَٔابًۭا. ﴿22﴾
23 అందులో వారు యుగాల తరబడి ఉంటారు.[1]
[1] చూడండి 6:128 మరియు 11:107.
لَّٰبِثِينَ فِيهَآ أَحْقَابًۭا. ﴿23﴾
24 అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు. لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًۭا وَلَا شَرَابًا. ﴿24﴾
25 సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం)[1]
[1] చూడండి, 38:57-58.
إِلَّا حَمِيمًۭا وَغَسَّاقًۭا. ﴿25﴾
26 (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా! جَزَآءًۭ وِفَاقًا. ﴿26﴾
27 వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు. إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًۭا. ﴿27﴾
28 పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు. وَكَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كِذَّابًۭا. ﴿28﴾
29 మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.[1]
[1] చూడండి, 36:12.
وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَٰهُ كِتَٰبًۭا. ﴿29﴾
30 కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.[1]
[1] చూడండి, 4:56, 17:97.
فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا. ﴿30﴾
31 నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది; إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا. ﴿31﴾
32 ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ! حَدَآئِقَ وَأَعْنَٰبًۭا. ﴿32﴾
33 మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు; وَكَوَاعِبَ أَتْرَابًۭا. ﴿33﴾
34 మరియు నిండి పొర్లే (మధు) పాత్ర وَكَأْسًۭا دِهَاقًۭا. ﴿34﴾
35 అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు. لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا كِذَّٰبًۭا. ﴿35﴾
36 (ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం. جَزَآءًۭ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًۭا. ﴿36﴾
37 భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు. رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًۭا. ﴿37﴾
38 ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్)[1] మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.[2]
[1] చూడండి 16:2 మరియు 97:4 [2] అల్లాహ్ (సు.తా.) దైవదూతలకు మరియు దైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) మాట్లాడే అనుమతినిస్తాడు. వారు కేవలం సత్యమే పలుకుతారు. చూడండి, 10:3.
يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَٰٓئِكَةُ صَفًّۭا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَٰنُ وَقَالَ صَوَابًۭا. ﴿38﴾
39 అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! [1]
[1] చూడండి, 69:1.
ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا. ﴿39﴾
40 నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు.[1] మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది[2]!" అని వాపోతాడు.
[1] చూడండి 18:49 చూడండి 75:13 [2] చూడండి, 69:27.
إِنَّآ أَنذَرْنَٰكُمْ عَذَابًۭا قَرِيبًۭا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا. ﴿40﴾