النازعات
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా![1]
[1] నా'జి'ఆత్: బలవంతంగా, కఠినంగా లాగి తీయటం. 'గర్ ఖన్: ఈ సూరహ్ లోని 1-5 ఆయతుల తాత్పర్యంలో వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
|
وَٱلنَّٰزِعَٰتِ غَرْقًۭا. ﴿1﴾ |
|
2
(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా![1]
[1] నష్'తన్: ముడివిప్పటం - అంటే నెమ్మదిగా తీయటం.
|
وَٱلنَّٰشِطَٰتِ نَشْطًۭا. ﴿2﴾ |
|
3
(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా![1]
[1] సబ్'హన్: ఈదుట, తేలుతూ పోవుట.
|
وَٱلسَّٰبِحَٰتِ سَبْحًۭا. ﴿3﴾ |
| 4 మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా! | فَٱلسَّٰبِقَٰتِ سَبْقًۭا. ﴿4﴾ |
| 5 మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా! | فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًۭا. ﴿5﴾ |
|
6
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.[1]
[1] ఇది మొదటి బాకా ధ్వని. దీనినే నఫ్ ఖయే ఫనా అంటారు. అప్పుడు ప్రతిదీ నశిస్తుంది.
|
يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ. ﴿6﴾ |
|
7
దాని తర్వాత రెండవ సారి[1] బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).
[1] ఈ రెండవ బాకా ధ్వనితో అందరూ బ్రతికి తమ గోరీల నుండి బయటికి లేచి వస్తారు.
|
تَتْبَعُهَا ٱلرَّادِفَةُ. ﴿7﴾ |
| 8 ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి. | قُلُوبٌۭ يَوْمَئِذٍۢ وَاجِفَةٌ. ﴿8﴾ |
| 9 వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. | أَبْصَٰرُهَا خَٰشِعَةٌۭ. ﴿9﴾ |
| 10 వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా? | يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ. ﴿10﴾ |
| 11 మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?" | أَءِذَا كُنَّا عِظَٰمًۭا نَّخِرَةًۭ. ﴿11﴾ |
| 12 వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!" | قَالُوا۟ تِلْكَ إِذًۭا كَرَّةٌ خَاسِرَةٌۭ. ﴿12﴾ |
| 13 కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని. | فَإِنَّمَا هِىَ زَجْرَةٌۭ وَٰحِدَةٌۭ. ﴿13﴾ |
| 14 అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు. | فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ. ﴿14﴾ |
|
15
ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా[1]?
[1] మూసా వృత్తాంతానికి చూడండి, 20:9-98.
|
هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ. ﴿15﴾ |
|
16
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,[1]
[1] అల్లాహ్ (సు.తా.) మూసా ('అ.స.)తో మాట్లాడాడు. అతనిని సందేశహరునిగా ఎన్నుకున్నాడు.
|
إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى. ﴿16﴾ |
| 17 (ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు. | ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ. ﴿17﴾ |
| 18 "ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా? | فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ. ﴿18﴾ |
| 19 మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'" | وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ. ﴿19﴾ |
| 20 తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు. | فَأَرَىٰهُ ٱلْءَايَةَ ٱلْكُبْرَىٰ. ﴿20﴾ |
| 21 కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు. | فَكَذَّبَ وَعَصَىٰ. ﴿21﴾ |
| 22 ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు. | ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ. ﴿22﴾ |
| 23 పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ; | فَحَشَرَ فَنَادَىٰ. ﴿23﴾ |
|
24
ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"[1]
[1] చూడండి, 28:38 ఫిర్'ఔన్ తనను తాను దేవుడని చెప్పుకున్నాడు మరియు హద్దులు మీరి ప్రవర్తించాడు మరియు సత్యాన్ని ధిక్కరించాడు.
|
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ. ﴿24﴾ |
|
25
కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.[1]
[1] చూడండి, 7:137 అతని ఇహలోక శిక్షకు.
|
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْءَاخِرَةِ وَٱلْأُولَىٰٓ. ﴿25﴾ |
| 26 నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది. | إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةًۭ لِّمَن يَخْشَىٰٓ. ﴿26﴾ |
|
27
ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది![1]
[1] చూడండి, 2:29 మరియు 40:57.
|
ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ ۚ بَنَىٰهَا. ﴿27﴾ |
| 28 ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు; | رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا. ﴿28﴾ |
| 29 మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు. | وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا. ﴿29﴾ |
|
30
మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు[1].
[1] ద'హాహున్: అంటే నిప్పుకోడి గ్రుడ్డు ఆకారం అని కొందరు వ్యాఖ్యానించారు. ఈ రోజు సైంటిష్టులు భూమి ఆకారం నిప్పుకోడి గ్రుడ్డు ఆకారంలో ఉందని నిరూపించారు.
|
وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ. ﴿30﴾ |
| 31 దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు; | أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا. ﴿31﴾ |
| 32 మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు; | وَٱلْجِبَالَ أَرْسَىٰهَا. ﴿32﴾ |
|
33
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా[1]!
[1] చూడండి, 80:24-32.
|
مَتَٰعًۭا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ. ﴿33﴾ |
| 34 ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు; | فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ. ﴿34﴾ |
| 35 ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు; | يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ مَا سَعَىٰ. ﴿35﴾ |
|
36
మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. [1]
[1] చూడండి, 26:91.
|
وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ. ﴿36﴾ |
| 37 ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి; | فَأَمَّا مَن طَغَىٰ. ﴿37﴾ |
| 38 మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి; | وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا. ﴿38﴾ |
| 39 నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది! | فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ. ﴿39﴾ |
| 40 మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి; | وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ. ﴿40﴾ |
| 41 నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది! | فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ. ﴿41﴾ |
| 42 (ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు. | يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا. ﴿42﴾ |
| 43 దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం? | فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ. ﴿43﴾ |
| 44 దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది! | إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ. ﴿44﴾ |
| 45 (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే! | إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا. ﴿45﴾ |
|
46
వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు[1].
[1] మానవుడు చేసే భూమికి చెందిన కాల పరిమాణం పరలోకంలో ఉండదు. ఇంకా చూడండి, 2:259, 17:52, 18:19, 20:103-104, 23:112-113, 30:55. 'అషియ్యతున్: అంటే "జుహ్ర్ నుండి సూర్యాస్తమయం వరకు మరియు 'దుహా: అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు.
|
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا. ﴿46﴾ |