عبس
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు; | عَبَسَ وَتَوَلَّىٰٓ. ﴿1﴾ |
| 2 ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని! | أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ. ﴿2﴾ |
| 3 కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు! | وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ. ﴿3﴾ |
| 4 లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు! | أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ. ﴿4﴾ |
| 5 కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో! | أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ. ﴿5﴾ |
|
6
అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.[1]
[1] ఇక్కడ సూచించబడుతున్నది ఏమిటంటే విధేయులను ఉపేక్షించి, విముఖులయ్యే వారికి బోధన చేయటానికి, ఆసక్తి చూపనవసరం లేదు!
|
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ. ﴿6﴾ |
|
7
ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?[1]
[1] నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే. నీవు వారి వెంటపడి బ్రతిమాలనవసరం లేదు.
|
وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ. ﴿7﴾ |
| 8 కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో! | وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ. ﴿8﴾ |
| 9 మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో! | وَهُوَ يَخْشَىٰ. ﴿9﴾ |
| 10 అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. | فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ. ﴿10﴾ |
|
11
అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.[1]
[1] చూడండి, 7:172.
|
كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌۭ. ﴿11﴾ |
| 12 కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు! | فَمَن شَآءَ ذَكَرَهُۥ. ﴿12﴾ |
| 13 ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది); | فِى صُحُفٍۢ مُّكَرَّمَةٍۢ. ﴿13﴾ |
| 14 మహోన్నతమైనది, పవిత్రమైనది; | مَّرْفُوعَةٍۢ مُّطَهَّرَةٍۭ. ﴿14﴾ |
| 15 లేఖకుల (దేవదూతల) చేతులలో; | بِأَيْدِى سَفَرَةٍۢ. ﴿15﴾ |
| 16 వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు). | كِرَامٍۭ بَرَرَةٍۢ. ﴿16﴾ |
|
17
మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు![1]
[1] ఎట్టి ప్రమాణం లేకుండానే పునరుత్థానాన్ని తిరస్కరించే మానవుడికి ఈ శాపం!
|
قُتِلَ ٱلْإِنسَٰنُ مَآ أَكْفَرَهُۥ. ﴿17﴾ |
| 18 ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు? | مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ. ﴿18﴾ |
| 19 అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు. | مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ. ﴿19﴾ |
|
20
ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;[1]
[1] అంటే అతనికి మంచి-చెడుల మార్గాలు స్పష్టంగా తెలుపబడ్డాయి.
|
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ. ﴿20﴾ |
| 21 ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు; | ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ. ﴿21﴾ |
| 22 మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు. | ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ. ﴿22﴾ |
| 23 అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు. | كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ. ﴿23﴾ |
| 24 ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి! | فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ. ﴿24﴾ |
| 25 నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము. | أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّۭا. ﴿25﴾ |
| 26 ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో! | ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّۭا. ﴿26﴾ |
| 27 తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము; | فَأَنۢبَتْنَا فِيهَا حَبًّۭا. ﴿27﴾ |
| 28 మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను; | وَعِنَبًۭا وَقَضْبًۭا. ﴿28﴾ |
| 29 మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను; | وَزَيْتُونًۭا وَنَخْلًۭا. ﴿29﴾ |
| 30 మరియు దట్టమైన తోటలను; | وَحَدَآئِقَ غُلْبًۭا. ﴿30﴾ |
| 31 మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను; | وَفَٰكِهَةًۭ وَأَبًّۭا. ﴿31﴾ |
| 32 మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా! | مَّتَٰعًۭا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ. ﴿32﴾ |
| 33 ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో! | فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ. ﴿33﴾ |
| 34 ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు; | يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ. ﴿34﴾ |
| 35 మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి; | وَأُمِّهِۦ وَأَبِيهِ. ﴿35﴾ |
| 36 మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి; | وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ. ﴿36﴾ |
|
37
ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.[1]
[1] అంటే ప్రతి మానవుడు తన వారిని నిర్లక్ష్యం చేస్తాడు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "పునరుత్థాన దినమున మానవులందరూ నగ్నశరీరులై ఉంటారు మరియు వారి కాళ్లలో మేజోళ్ళు ఉండవు మరియు వారు ఖత్నా చేయబడకుండా ఉంటారు." అపుపుడు 'ఆయి'షహ్ (ర.'అన్హా) : "ఏమీ ఈ విధంగా మర్మాంగాల మీద దృష్టి పడదా?" అని అడుగుతారు. దైవప్రవక్త ('స'అస) దానికి సమాధానంగా ఈ ఆయత్ చదువుతారు. (తిర్మీజీ', నసాయీ').
|
لِكُلِّ ٱمْرِئٍۢ مِّنْهُمْ يَوْمَئِذٍۢ شَأْنٌۭ يُغْنِيهِ. ﴿37﴾ |
| 38 ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి; | وُجُوهٌۭ يَوْمَئِذٍۢ مُّسْفِرَةٌۭ. ﴿38﴾ |
| 39 అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి. | ضَاحِكَةٌۭ مُّسْتَبْشِرَةٌۭ. ﴿39﴾ |
| 40 మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి. | وَوُجُوهٌۭ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌۭ. ﴿40﴾ |
| 41 అవి నల్లగా మాడిపోయి ఉంటాయి; | تَرْهَقُهَا قَتَرَةٌ. ﴿41﴾ |
| 42 అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు. | أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ. ﴿42﴾ |