التكوير
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు![1]
[1] పునరుత్థానదినమున సూర్యచంద్రులు చుట్టివేయబడతారు. ('స'హీ'హ్ బు'ఖారీ).
|
إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ. ﴿1﴾ |
| 2 మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు! | وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ. ﴿2﴾ |
|
3
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు![1]
[1] పర్వతాలు భూమి నుండి ఊడబెరికి ఏకిన దూది వలే గాలిలో ఎగురవేయబడతాయి. చూడండి, 20:105-107 మరియు 14:48.
|
وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ. ﴿3﴾ |
| 4 మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు! | وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ. ﴿4﴾ |
|
5
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు![1]
[1] చూడండి, 6:38.
|
وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ. ﴿5﴾ |
|
6
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు![1]
[1] ఈ ఆయత్ కు ఈ విధంగా కూడా తాత్పర్యమివ్వబడింది: "లేక సముద్రాలలో అగ్నిజ్వాలలు చెలరేగినప్పుడు".
|
وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ. ﴿6﴾ |
|
7
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు![1]
[1] దీనిని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానించారు: "ఒకే ధర్మం వారు ఒక చోట జమ చేయబడతారు. యూదులందరు ఒకచోట, క్రైస్తవులందరు ఒకచోట మరియు ముస్లింలందరు ఒకచోట."
|
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ. ﴿7﴾ |
| 8 మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు: | وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ. ﴿8﴾ |
| 9 ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని? | بِأَىِّ ذَنۢبٍۢ قُتِلَتْ. ﴿9﴾ |
|
10
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు![1]
[1] కర్మపత్రాలు మరణించిన రోజు మూయబడి, పునరుత్థాన దినమున మరల తెరువబడతాయి. అప్పుడు కరపత్రాలు పుణ్యాత్ములకు కుడిచేతులలో మరియు పాపాత్ములకు ఎడమచేతులో ఇవ్వబడతాయి.
|
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ. ﴿10﴾ |
| 11 మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు! | وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ. ﴿11﴾ |
| 12 మరియు నరకాగ్ని మండించబడినప్పుడు! | وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ. ﴿12﴾ |
| 13 మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు! | وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ. ﴿13﴾ |
| 14 ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది. | عَلِمَتْ نَفْسٌۭ مَّآ أَحْضَرَتْ. ﴿14﴾ |
| 15 అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను; | فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ. ﴿15﴾ |
|
16
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో![1]
[1] అల్ జవారి: నడిచేది, తిరిగేది. అల్ కున్నసి: దాక్కునేది, కనుమరుగయ్యేది.
|
ٱلْجَوَارِ ٱلْكُنَّسِ. ﴿16﴾ |
| 17 మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా! | وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ. ﴿17﴾ |
| 18 మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా! | وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ. ﴿18﴾ |
|
19
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు![1]
[1] అంటే జిబ్రీల్ (అ'.స.) తెచ్చిన వాక్కు.
|
إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ. ﴿19﴾ |
|
20
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్)[1] అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
[1] చూఅల్-'అర్షు: సింహాసనం లేక విశ్వాధికార పీఠం. ఈ పదం అవతరణలో ఇక్కడ మొదటిసారి వచ్చింది. వివరాలకు చూడండి, 7:54.
|
ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍۢ. ﴿20﴾ |
| 21 అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు! | مُّطَاعٍۢ ثَمَّ أَمِينٍۢ. ﴿21﴾ |
|
22
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు![1]
[1] చూడండి, 7:184 ఈ వాక్యం మక్కావాసులతో చెప్పబడింది. ఇంకా విశదమయ్యే విషయం ఏమిటంటే దైవప్రవక్త ('స'అస) ఒక మానవుడు మరియు అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న ప్రవక్త.
|
وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍۢ. ﴿22﴾ |
|
23
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.[1]
[1] చూడండి, 53:5 దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) ను రెండుసార్లు అతని నిజరూపంలో చూశారు. మొదటిసారి ఇక్కడ, రెండవసారి మేరాజ్ రాత్రిలో.
|
وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ. ﴿23﴾ |
| 24 మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు. | وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍۢ. ﴿24﴾ |
| 25 మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు. | وَمَا هُوَ بِقَوْلِ شَيْطَٰنٍۢ رَّجِيمٍۢ. ﴿25﴾ |
| 26 మరి మీరు ఎటు పోతున్నారు? | فَأَيْنَ تَذْهَبُونَ. ﴿26﴾ |
| 27 ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం. | إِنْ هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَٰلَمِينَ. ﴿27﴾ |
| 28 మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు. | لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ. ﴿28﴾ |
|
29
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.[1]
[1] ఇటువంటి మరో ఆయతు కోసం చూడండి, 76:29-30.
|
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ. ﴿29﴾ |