الانفطار
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ఆకాశం చీల్చబడినప్పుడు![1]
[1] ఇది పునరుత్థాన దినపు సూచన.
|
إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ. ﴿1﴾ |
| 2 మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు! | وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ. ﴿2﴾ |
| 3 మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు! | وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ. ﴿3﴾ |
| 4 మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు! | وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ. ﴿4﴾ |
| 5 ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది. | عَلِمَتْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ. ﴿5﴾ |
| 6 ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది? | يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ. ﴿6﴾ |
| 7 ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు. | ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ. ﴿7﴾ |
| 8 తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు. | فِىٓ أَىِّ صُورَةٍۢ مَّا شَآءَ رَكَّبَكَ. ﴿8﴾ |
| 9 అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు! | كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ. ﴿9﴾ |
|
10
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.[1]
[1] చూడండి, 50:17-18.
|
وَإِنَّ عَلَيْكُمْ لَحَٰفِظِينَ. ﴿10﴾ |
| 11 వారు, గౌరవనీయులైన లేఖకులు; | كِرَامًۭا كَٰتِبِينَ. ﴿11﴾ |
| 12 మీరు చేసేదంతా తెలుసుకునేవారు! | يَعْلَمُونَ مَا تَفْعَلُونَ. ﴿12﴾ |
|
13
నిశ్చయంగా పుణ్యాత్ములు[1] సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.
[1] అబ్ రార్: Pious, ధర్మనిష్ఠాపరులు, దైవభక్తిపరులు, Righteous, ఋజువర్తనులు, ధర్మశీలురు, న్యాయనిష్ఠ గలవారు.
|
إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍۢ. ﴿13﴾ |
|
14
మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.[1]
[1] చూడండి, 42:7.
|
وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍۢ. ﴿14﴾ |
| 15 తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు. | يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ. ﴿15﴾ |
| 16 మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు. | وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ. ﴿16﴾ |
| 17 మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది? | وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ. ﴿17﴾ |
| 18 అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది? | ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ. ﴿18﴾ |
|
19
ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.[1]
[1] చూడండి, 40:16.
|
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌۭ لِّنَفْسٍۢ شَيْـًۭٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍۢ لِّلَّهِ. ﴿19﴾ |