الانشقاق
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు![1]
[1] అంటే పునరుత్థాన దినము
|
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ. ﴿1﴾ |
|
2
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.[1]
[1] చూడండి, 20:105-107.
|
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ. ﴿2﴾ |
| 3 మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు; | وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ. ﴿3﴾ |
| 4 మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు; | وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ. ﴿4﴾ |
| 5 అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం. | وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ. ﴿5﴾ |
| 6 ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు. | يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًۭا فَمُلَٰقِيهِ. ﴿6﴾ |
|
7
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;[1]
[1] చూడండి, 69:19.
|
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ. ﴿7﴾ |
| 8 అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు. | فَسَوْفَ يُحَاسَبُ حِسَابًۭا يَسِيرًۭا. ﴿8﴾ |
| 9 మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు! | وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًۭا. ﴿9﴾ |
|
10
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;[1]
[1] చూడండి, 69:25-26.
|
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ. ﴿10﴾ |
| 11 అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు; | فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًۭا. ﴿11﴾ |
| 12 మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు. | وَيَصْلَىٰ سَعِيرًا. ﴿12﴾ |
|
13
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.[1]
[1] చూడండి, 75:33.
|
إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا. ﴿13﴾ |
| 14 వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు. | إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ. ﴿14﴾ |
| 15 అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు. | بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًۭا. ﴿15﴾ |
|
16
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను![1]
[1] అష్-షఫఖు: సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో కనబడే ఎరుపు, సంధ్యారుణిమ. అది 'ఇషా సమయం మొదలయ్యే వరకు ఉంటుంది.
|
فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ. ﴿16﴾ |
| 17 రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా! | وَٱلَّيْلِ وَمَا وَسَقَ. ﴿17﴾ |
|
18
పూర్ణచంద్రుని సాక్షిగా![1]
[1] అత్తసఖ: అంటే పౌర్ణిమనాటి చంద్రుడు.
|
وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ. ﴿18﴾ |
|
19
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]
[1] 'తబఖున్: కఠినత, ఇక్కడ కఠినాలు అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారటం.
|
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍۢ. ﴿19﴾ |
| 20 అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు? | فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ. ﴿20﴾ |
|
21
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?[1]
[1] 'హదీస్'ల ద్వారా దైవప్రవక్త ('స'అస) మరియు 'స'హాబా(ర'ది.'అన్హుమ్)లు, ఇక్కడ సజ్దా చేశారని తెలుస్తుంది.
|
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩. ﴿21﴾ |
| 22 అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు. | بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ. ﴿22﴾ |
| 23 మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. | وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ. ﴿23﴾ |
| 24 కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు - | فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ. ﴿24﴾ |
| 25 విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది. | إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ. ﴿25﴾ |