البروج
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా![1]
[1] చూడండి, 25:61.
|
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ. ﴿1﴾ |
| 2 వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా! | وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ. ﴿2﴾ |
|
3
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా![1]
[1] ఈ ఆయతు వ్యాఖ్యానంలో భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షౌకాని ఒక 'హదీస్' ఆధారంగా అన్నారు: షాహిదున్: అంటే జుము'అహ్ దినం. ఆరోజు విశ్వాసి చేసిన పని, పునరుత్థాన దినమున దానికి సాక్ష్యమిస్తుంది. మష్ హూదున్ : అంటే 9వ జు'ల్ 'హజ్జ్, 'అరఫాత్ దినం. ఏ రోజైతే ముస్లింలు 'హజ్ కొరకు సమావేశమవుతారో! మరొక తాత్పర్యం: "అంతా చేసే ఆయన, అల్లాహుతా'ఆలా సాక్షిగా మరియు ఆయన సాక్షిగా నిలిపేవాని సాక్షిగా!"
|
وَشَاهِدٍۢ وَمَشْهُودٍۢ. ﴿3﴾ |
|
4
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.[1]
[1] పైన పేర్కొన్నట్లు నజ్ రాన్ లోని సత్యతిరస్కారులు, ఆ కాలపు విశ్వాసులను ఒక అగ్ని కందకంలో త్రోసి చంపేవారు.
|
قُتِلَ أَصْحَٰبُ ٱلْأُخْدُودِ. ﴿4﴾ |
| 5 ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు. | ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ. ﴿5﴾ |
|
6
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;[1]
[1] విశ్వాసులను అగ్నిలో వేసి వారు (సత్యతిరస్కారులు) చూసి ఆనందించేవారు.
|
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌۭ. ﴿6﴾ |
| 7 మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు. | وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌۭ. ﴿7﴾ |
| 8 మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే! | وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ. ﴿8﴾ |
| 9 ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి. | ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ شَهِيدٌ. ﴿9﴾ |
| 10 ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది. | إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ. ﴿10﴾ |
|
11
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి[1]. అదే గొప్ప విజయం.
[1] ఖుర్ఆన్ అవతరణా క్రమంలో స్వర్గవనాలను గురించి ఇక్కడ మొదటి సారి వచ్చింది.
|
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ جَنَّٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ. ﴿11﴾ |
|
12
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.[1]
[1] ఆయన మొదట వ్యవధినిస్తాడు. ఇక శిక్షించటానికి పట్టుకొన్నప్పుడు, ఆయన పట్టు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు మరియు ఎవ్వరూ తప్పించజాలరు కూడానూ!
|
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ. ﴿12﴾ |
| 13 నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు. | إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ. ﴿13﴾ |
| 14 మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు. | وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ. ﴿14﴾ |
|
15
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,[1] మహత్త్వపూర్ణుడు.[2]
[1] సింహాసనాధీశుడు, చూడండి, 7:54.
[2] చూడండి, అల్లాహుతా'ఆలాను సంబోధించిన సందర్భానికి, 11:73 అల్-మజీదు: వైభవం గలవాడు, ప్రభావం, ప్రతాపం విశిష్టత, దివ్యుడు, మహిమాన్వితుడు, మహత్త్వపూర్ణుడు. .
|
ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ. ﴿15﴾ |
| 16 తాను తలచింది చేయగలవాడు. | فَعَّالٌۭ لِّمَا يُرِيدُ. ﴿16﴾ |
| 17 ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా? | هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ. ﴿17﴾ |
| 18 ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల). | فِرْعَوْنَ وَثَمُودَ. ﴿18﴾ |
| 19 అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు. | بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍۢ. ﴿19﴾ |
| 20 మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు. | وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ. ﴿20﴾ |
|
21
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన[1] ఖుర్ఆన్.
[1] చూడండి, ఖుర్ఆన్ సంబోధించిన సందర్భానికి, 50:1.
|
بَلْ هُوَ قُرْءَانٌۭ مَّجِيدٌۭ. ﴿21﴾ |
|
22
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)[1] లో (వ్రాయబడి) ఉన్నది.
[1] చూడండి, 13:39 మరియు 43:4. ఉమ్ముల్-కితాబ్, అంటే లౌ'హె మ'హ్ ఫూ"జ్. సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యధస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.
|
فِى لَوْحٍۢ مَّحْفُوظٍۭ. ﴿22﴾ |