الطارق
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా![1]
[1] చూడండి, 13:11 మరియు 82:10-12.
|
وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ. ﴿1﴾ |
| 2 రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది? | وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ. ﴿2﴾ |
| 3 అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. | ٱلنَّجْمُ ٱلثَّاقِبُ. ﴿3﴾ |
| 4 కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు. | إِن كُلُّ نَفْسٍۢ لَّمَّا عَلَيْهَا حَافِظٌۭ. ﴿4﴾ |
| 5 కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి! | فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ مِمَّ خُلِقَ. ﴿5﴾ |
| 6 అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు. | خُلِقَ مِن مَّآءٍۢ دَافِقٍۢ. ﴿6﴾ |
| 7 అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది. | يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ. ﴿7﴾ |
| 8 నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు! | إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌۭ. ﴿8﴾ |
| 9 ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో! | يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ. ﴿9﴾ |
|
10
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించుకోవటానికి.
|
فَمَا لَهُۥ مِن قُوَّةٍۢ وَلَا نَاصِرٍۢ. ﴿10﴾ |
|
11
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా![1]
[1] అర్-రజ్'ఉ: తిరిగి రావటం, వర్షం కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ పేరుతో పిలువబడుతుంది.
|
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ. ﴿11﴾ |
| 12 (చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా! | وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ. ﴿12﴾ |
| 13 నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి). | إِنَّهُۥ لَقَوْلٌۭ فَصْلٌۭ. ﴿13﴾ |
| 14 మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు. | وَمَا هُوَ بِٱلْهَزْلِ. ﴿14﴾ |
|
15
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.[1]
[1] చూడండి, 34:33.
|
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًۭا. ﴿15﴾ |
| 16 మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను. | وَأَكِيدُ كَيْدًۭا. ﴿16﴾ |
|
17
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధినివ్వు![1] వారి పట్ల మృదువుగా వ్యవహరించు.
[1] చూడండి, 7:182-183.
|
فَمَهِّلِ ٱلْكَٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا. ﴿17﴾ |