الأعلى
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు! | سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى. ﴿1﴾ |
|
2
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.[1]
[1] చూడండి, 82:7.
|
ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ. ﴿2﴾ |
|
3
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు[1], మరియు మార్గం చూపాడు!
[1] చూడండి, 25:2 మరియు 20:50.
|
وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ. ﴿3﴾ |
| 4 మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు. | وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ. ﴿4﴾ |
|
5
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.[1]
[1] 'గుసా'అన్: ఎండినగడ్డి. అ'హ్వా: నల్లని. అంటే పచ్చగడ్డిని ఎండింపజేసి నల్లని చెత్తాచెదారంగా చేస్తాడు.
|
فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ. ﴿5﴾ |
| 6 మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు - | سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ. ﴿6﴾ |
|
7
అల్లాహ్ కోరింది తప్ప[1]! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.
[1] అంటే అల్లాహ్ (సు.తా.) రద్దు చేయదలిచిన దానిని మరపింపజేస్తాడు.
|
إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ. ﴿7﴾ |
|
8
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.[1]
[1] వ'హీని జ్ఞాపకముంచుకోవటం మరియు దానిపై నడవటం నీకు సులభం చేస్తాము.
|
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ. ﴿8﴾ |
|
9
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు![1]
[1] నీ పని హితోపదేశం చేయటం మాత్రమే! నీ హితోపదేశం వారికి లాభం కావచ్చు! వారితో దానితో లాభం పొందకున్నా నీ పని కేవలం హితోపదేశం చేయటమే!
|
فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ. ﴿9﴾ |
| 10 (అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు. | سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ. ﴿10﴾ |
| 11 మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు. | وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى. ﴿11﴾ |
| 12 అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు. | ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ. ﴿12﴾ |
|
13
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.[1]
[1] చూడండి, 74:28-29.
|
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ. ﴿13﴾ |
| 14 సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు. | قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ. ﴿14﴾ |
| 15 మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు. | وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ. ﴿15﴾ |
| 16 అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు; | بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا. ﴿16﴾ |
| 17 కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది. | وَٱلْءَاخِرَةُ خَيْرٌۭ وَأَبْقَىٰٓ. ﴿17﴾ |
| 18 నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది; | إِنَّ هَٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ. ﴿18﴾ |
| 19 ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో. | صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ. ﴿19﴾ |