الغاشية
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా? | هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْغَٰشِيَةِ. ﴿1﴾ |
| 2 కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి. | وُجُوهٌۭ يَوْمَئِذٍ خَٰشِعَةٌ. ﴿2﴾ |
|
3
(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,[1]
[1] నా'సిబతున్: శ్రమకు అలసిపోవటం.
|
عَامِلَةٌۭ نَّاصِبَةٌۭ. ﴿3﴾ |
| 4 వారు దహించే అగ్నిలో పడి కాలుతారు. | تَصْلَىٰ نَارًا حَامِيَةًۭ. ﴿4﴾ |
| 5 వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది. | تُسْقَىٰ مِنْ عَيْنٍ ءَانِيَةٍۢ. ﴿5﴾ |
| 6 వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు. | لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍۢ. ﴿6﴾ |
| 7 అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు! | لَّا يُسْمِنُ وَلَا يُغْنِى مِن جُوعٍۢ. ﴿7﴾ |
| 8 ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి; | وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاعِمَةٌۭ. ﴿8﴾ |
| 9 తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు. | لِّسَعْيِهَا رَاضِيَةٌۭ. ﴿9﴾ |
| 10 అత్యున్నతమైన స్వర్గవనంలో. | فِى جَنَّةٍ عَالِيَةٍۢ. ﴿10﴾ |
| 11 అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు. | لَّا تَسْمَعُ فِيهَا لَٰغِيَةًۭ. ﴿11﴾ |
| 12 అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి; | فِيهَا عَيْنٌۭ جَارِيَةٌۭ. ﴿12﴾ |
|
13
అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి;[1]
[1] చూడండి, 15:47.
|
فِيهَا سُرُرٌۭ مَّرْفُوعَةٌۭ. ﴿13﴾ |
| 14 మరియు పేర్చబడిన (మధు) పాత్రలు; | وَأَكْوَابٌۭ مَّوْضُوعَةٌۭ. ﴿14﴾ |
| 15 మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు; | وَنَمَارِقُ مَصْفُوفَةٌۭ. ﴿15﴾ |
| 16 మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు. | وَزَرَابِىُّ مَبْثُوثَةٌ. ﴿16﴾ |
| 17 ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో? | أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلْإِبِلِ كَيْفَ خُلِقَتْ. ﴿17﴾ |
| 18 మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో? | وَإِلَى ٱلسَّمَآءِ كَيْفَ رُفِعَتْ. ﴿18﴾ |
| 19 మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో? | وَإِلَى ٱلْجِبَالِ كَيْفَ نُصِبَتْ. ﴿19﴾ |
| 20 మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో? | وَإِلَى ٱلْأَرْضِ كَيْفَ سُطِحَتْ. ﴿20﴾ |
| 21 కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే! | فَذَكِّرْ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌۭ. ﴿21﴾ |
| 22 నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు. | لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ. ﴿22﴾ |
| 23 ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో! | إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ. ﴿23﴾ |
| 24 అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు. | فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلْعَذَابَ ٱلْأَكْبَرَ. ﴿24﴾ |
| 25 నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది; | إِنَّ إِلَيْنَآ إِيَابَهُمْ. ﴿25﴾ |
| 26 ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే! | ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم. ﴿26﴾ |