البلد
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)! | لَآ أُقْسِمُ بِهَٰذَا ٱلْبَلَدِ. ﴿1﴾ |
|
2
మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.[1]
[1] కొందరు: "తండ్రి (మూలపురుషుడు) అంటే ఆదమ్ ('అ.స.) మరియు అతని సంతానం అంటే మానవజాతి." అన్నారు.
|
وَأَنتَ حِلٌّۢ بِهَٰذَا ٱلْبَلَدِ. ﴿2﴾ |
| 3 మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా! | وَوَالِدٍۢ وَمَا وَلَدَ. ﴿3﴾ |
| 4 వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము. | لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِى كَبَدٍ. ﴿4﴾ |
| 5 ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా? | أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌۭ. ﴿5﴾ |
|
6
అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.[1]
[1] లుబదన్: కసీ'ర్, చాలా
|
يَقُولُ أَهْلَكْتُ مَالًۭا لُّبَدًا. ﴿6﴾ |
|
7
ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?[1]
[1] అంటే అతడు చేసే వృథా ఖర్చును ఎవ్వరూ చూడటం లేదని భావిస్తున్నాడా? అల్లాహ్ (సు.తా.) అంతా చూస్తున్నాడు.
|
أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ. ﴿7﴾ |
| 8 ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా? | أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ. ﴿8﴾ |
| 9 మరియు నాలుకను మరియు రెండు పెదవులను. | وَلِسَانًۭا وَشَفَتَيْنِ. ﴿9﴾ |
|
10
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1]
[1] చూడండి, 76:3 అన్-నజ్ దు: అంటే ఎత్తైన స్థలం. అన్-నజ్ దైన్: అంటే రెండు మార్గాలు.
|
وَهَدَيْنَٰهُ ٱلنَّجْدَيْنِ. ﴿10﴾ |
|
11
కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు![1]
[1] చూఅల్-'అఖబహ్: కొండ శిఖరం (పైకి ఎక్కడం) కొందరు దీనికి కనుమ అనే అర్థం ఇచ్చారు. అంటే రెండు కొండల నడిమి త్రోవ, సందు. కఠినమైన కనుమ అంటే ఒక బానిసను బంధం నుండి విముక్తి చేయించడం, లేక తాను ఆకలితో ఉండి కూడా ఒక అనాథకి అన్నం పెట్టడం.
|
فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ. ﴿11﴾ |
| 12 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? | وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ. ﴿12﴾ |
|
13
అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.[1]
[1] చూడండి, 2:177.
|
فَكُّ رَقَبَةٍ. ﴿13﴾ |
|
14
లేదా! (స్వయంగా) ఆకలి గొని[1] ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.
[1] మస్'గతున్: ఆకలి.
|
أَوْ إِطْعَٰمٌۭ فِى يَوْمٍۢ ذِى مَسْغَبَةٍۢ. ﴿14﴾ |
| 15 సమీప అనాథునికి గానీ; | يَتِيمًۭا ذَا مَقْرَبَةٍ. ﴿15﴾ |
|
16
లేక, దిక్కులేని నిరుపేదకు గానీ![1]
[1] జా-'మత్ రబతున్: మట్టిపై పడి ఉండే పేదవాడు. ఎవడికైతే ఇల్లు ఉండదో!
|
أَوْ مِسْكِينًۭا ذَا مَتْرَبَةٍۢ. ﴿16﴾ |
| 17 మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం. | ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ. ﴿17﴾ |
|
18
ఇలాంటి వారే కుడిపక్షం వారు.[1]
[1] అతడు విశ్వాసి అయిఉంటేనే, చేసిన పుణ్యాల ఫలితం దొరుకుతుంది లేకపోతే పరలోకంలో అవి వృథా అయిపోతాయి.
|
أُو۟لَٰٓئِكَ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ. ﴿18﴾ |
| 19 ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు. | وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِنَا هُمْ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ. ﴿19﴾ |
|
20
వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.[1]
[1] ము'అసదతన్': ము'గ్ లఖతున్, అంటే చుట్టుకుంటుంది. చూడండి, 104:6-8.
|
عَلَيْهِمْ نَارٌۭ مُّؤْصَدَةٌۢ. ﴿20﴾ |