الشمس
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా![1]
[1] 'దు'హా'హా: సూర్యుని ప్రకాశవంతమైన వెలుగు.
|
وَٱلشَّمْسِ وَضُحَىٰهَا. ﴿1﴾ |
| 2 దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా! | وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا. ﴿2﴾ |
| 3 ప్రకాశించే పగటి సాక్షిగా! | وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا. ﴿3﴾ |
| 4 దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా! | وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا. ﴿4﴾ |
| 5 ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా! | وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا. ﴿5﴾ |
| 6 భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా! | وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا. ﴿6﴾ |
|
7
మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా![1]
[1] చూడండి, 87:2.
|
وَنَفْسٍۢ وَمَا سَوَّىٰهَا. ﴿7﴾ |
|
8
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.[1]
[1] ఫుజూరహా వతఖ్వాహా: అంటే మంచిచెడులు, అనే అర్థం కూడా వస్తుంది. చూడండి, ఇబ్నె-కసీ'ర్.
|
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا. ﴿8﴾ |
| 9 వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు. | قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا. ﴿9﴾ |
|
10
మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.[1]
[1] దస్స: దాచి పెట్టడం, అణగద్రొక్కటం ఎవడైతే తన ఆత్మను అణగద్రొక్కాడో!
|
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا. ﴿10﴾ |
|
11
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది;[1]
[1] 'తు'గ్ యానన్ : తలబిరుసుతనం. తలబిరుసుతనంలో వారు తమ ప్రవక్త అబద్ధీకుడని తిరస్కరించారు. స'మూద్ జాతి వారి గాథ కోసం చూడండి, 7:73-79.
|
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ. ﴿11﴾ |
| 12 తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు; | إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا. ﴿12﴾ |
| 13 అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు. | فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَٰهَا. ﴿13﴾ |
|
14
అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.[1] కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
[1] దీని తాత్పర్యం ఏమిటంటే ఒక సమాజంలో ఏ ఒక్కడూ గానీ, లేక కొందరు గానీ దుష్టపనులు చేస్తున్నప్పుడు ఇతరులు వారిని ఆపకుండా, దానిని సమ్మతిస్తే, ఆ సమాజం వారంతా దోషులే. వారందరూ శిక్షార్హులే! కాబట్టి వారందరూ నాశనం చేయబడ్తారు.
|
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا. ﴿14﴾ |
|
15
మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు![1]
[1] ఏదైనా ఇతర గొప్ప శక్తి ప్రతీకారం తీసుకుంటుందేమోనన్న భయం అల్లాహ్ (సు.తా.)కు లేదు. ఆయనకు సరిసమానమైన, లేక ఆయన కంటే పెద్దశక్తి అనేది ఏదీ లేదు. ఆయన మీద ఎవ్వరూ ప్రతీకారం తీర్చుకోలేరు.
|
وَلَا يَخَافُ عُقْبَٰهَا. ﴿15﴾ |