الليل
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 క్రమ్ముకునే రాత్రి సాక్షిగా! | وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ. ﴿1﴾ |
| 2 ప్రకాశించే పగటి సాక్షిగా! | وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ. ﴿2﴾ |
| 3 మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా! | وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ. ﴿3﴾ |
|
4
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;[1]
[1] చూడండి, 91:8.
|
إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ. ﴿4﴾ |
| 5 కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! | فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ. ﴿5﴾ |
|
6
మరియు మంచిని నమ్ముతాడో![1]
[1] వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ ఆయత్ అబూబక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ.)ను గురించి అవతరింపజేయబడింది. అతను ఆరు మంది బానిసలకు స్వాతంత్ర్యం ఇప్పించారు. వారు తమ ముష్రిక్ నాయకుల విపరీత బాధలకు గురి అయి ఉండిరి. (ఫత్హ్ అల్-ఖదీర్)
|
وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ. ﴿6﴾ |
|
7
అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.[1]
[1] చూడండి, 87:8.
|
فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ. ﴿7﴾ |
|
8
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో![1]
[1] చూడండి, 96:6-7.
|
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ. ﴿8﴾ |
| 9 మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! | وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ. ﴿9﴾ |
| 10 అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము. | فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ. ﴿10﴾ |
| 11 మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది? | وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ. ﴿11﴾ |
| 12 నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని! | إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ. ﴿12﴾ |
| 13 మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది. | وَإِنَّ لَنَا لَلْءَاخِرَةَ وَٱلْأُولَىٰ. ﴿13﴾ |
| 14 కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను. | فَأَنذَرْتُكُمْ نَارًۭا تَلَظَّىٰ. ﴿14﴾ |
| 15 పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు! | لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى. ﴿15﴾ |
| 16 ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో! | ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ. ﴿16﴾ |
| 17 కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు! | وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى. ﴿17﴾ |
| 18 అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో! | ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ. ﴿18﴾ |
| 19 కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక; | وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍۢ تُجْزَىٰٓ. ﴿19﴾ |
| 20 కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే! | إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ. ﴿20﴾ |
|
21
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.[1]
[1] మరొక తాత్పర్యం: "మరియు త్వరలోనే అల్లాహ్ (సు.తా.) కూడా (అతనితో) సంతుష్టుడౌతాడు."
|
وَلَسَوْفَ يَرْضَىٰ. ﴿21﴾ |