الضحى
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా! | وَٱلضُّحَىٰ. ﴿1﴾ |
|
2
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా![1]
[1] సజా: సకన, అంటే శాంతి నెలకొలినప్పుడు, అంటే పూర్తిగా చీకటి పడినప్పుడు. అప్పుడు నిశ్శబ్దం మరియు నెమ్మది అయి ఉంటుంది.
|
وَٱلَّيْلِ إِذَا سَجَىٰ. ﴿2﴾ |
| 3 (ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు. | مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ. ﴿3﴾ |
|
4
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది![1]
[1] అంటే పర లోక జీవితం, ఇహ లోక జీవితం కంటే ఉత్తమమైనది.
|
وَلَلْءَاخِرَةُ خَيْرٌۭ لَّكَ مِنَ ٱلْأُولَىٰ. ﴿4﴾ |
| 5 మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు. | وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰٓ. ﴿5﴾ |
|
6
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా[1] చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?
[1] దైవప్రవక్త ('స'అస) అనాథునిగా ఉంటే అల్లాహ్ (సు.తా.) అతనికి ఆశ్రయం కల్పించాడు. అతని తండ్రి అతని పుట్టుకకు కొన్ని మాసాల ముందు చనిపోయారు. తల్లి అతను 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చనిపోయింది.
|
أَلَمْ يَجِدْكَ يَتِيمًۭا فَـَٔاوَىٰ. ﴿6﴾ |
|
7
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం [1]
[1] ము'హమ్మద్ ('స'అస)ను ప్రవక్తగా ఎన్నుకొని అతనికి ఖుర్ఆన్ ప్రసాదించి, మార్గదర్శకత్వం చేశాడు.
|
وَوَجَدَكَ ضَآلًّۭا فَهَدَىٰ. ﴿7﴾ |
| 8 మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా? | وَوَجَدَكَ عَآئِلًۭا فَأَغْنَىٰ. ﴿8﴾ |
| 9 కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు; | فَأَمَّا ٱلْيَتِيمَ فَلَا تَقْهَرْ. ﴿9﴾ |
| 10 మరియు యాచకుణ్ణి కసరుకోకు; | وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنْهَرْ. ﴿10﴾ |
|
11
మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.[1]
[1] అంటే అల్లాహ్ (సు.తా.) చేసిన అనుగ్రహాలను, ఇతరులతో చెప్పుకో - అది అల్లాహ్ (సు.తా.)కు ఇష్టమైనది - గర్వంతో కాక నమ్రతతో!
|
وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ. ﴿11﴾ |