التين
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
| 1 అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా! | وَٱلتِّينِ وَٱلزَّيْتُونِ. ﴿1﴾ |
|
2
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా![1]
[1] చూ'చూడండి, 15:23.
|
وَطُورِ سِينِينَ. ﴿2﴾ |
|
3
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా![1]
[1] చూఈ శాంతి నగరం అంటే మక్కా ముకర్రమా చూడండి, 2:126 ఇందులో యుద్ధం చేయటం నిషేధించబడింది. ఇందులో ప్రవేశించిన వానికి శాంతి, భద్రతలు లభిస్తాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది మూడు చోట్లను సూచిస్తుంది. (1) 'తూర్ పర్వతం - మూసా ('అ.స.) ను ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం, (2) బైతుల్ ముఖద్దస్-'ఈసా ('అ.స.) పుట్టి ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం, (3) మక్కా ముకర్రమా - ము'హమ్మద్ ('స'అస) పుట్టి ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం. (ఇబ్నె-కసీ'ర్) . మక్కా ప్రస్తావనకు ఇంకా చూడండి 48:24.
|
وَهَٰذَا ٱلْبَلَدِ ٱلْأَمِينِ. ﴿3﴾ |
|
4
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.[1]
[1] చూడండి, 91:7, 97:2 మరియు 75:38
|
لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِىٓ أَحْسَنِ تَقْوِيمٍۢ. ﴿4﴾ |
| 5 తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము. | ثُمَّ رَدَدْنَٰهُ أَسْفَلَ سَٰفِلِينَ. ﴿5﴾ |
| 6 కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది. | إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۢ. ﴿6﴾ |
| 7 అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు? | فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِٱلدِّينِ. ﴿7﴾ |
| 8 ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా? | أَلَيْسَ ٱللَّهُ بِأَحْكَمِ ٱلْحَٰكِمِينَ. ﴿8﴾ |