Loading date... | Loading Hijri date... | Loading time...

العلق

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు![1]
[1] దైవప్రవక్త జిబ్రీల్ ('అ.స.) దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) 'హిరా గుహలో దైవారాధనలో నిమగ్రమై ఉన్నప్పుడు వచ్చి అన్నారు: "చదువు!" అతను అన్నారు : "నాకు చదువురాదు!" అప్పుడు జిబ్రీల్ ('అ.స.) అతనిని గట్టిగా పట్టుకుని గట్టిగా అదిమి అన్నారు: "చదువు!"దైవప్రవక్త ('స'అస) తిరిగి అదే జవాబిచ్చారు. ఈ విధంగా అతను దైవప్రవక్త ('స'అస) ను మూడుసార్లు అదిమారు. వివరాలకు చూడండి, బద'అల్-వ'హీ, 'స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ', నసాయి'. ఆ తరువాత ఈ మొదటి ఐదు ఆయతులు చదివి వినిపించారు.
ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ. ﴿1﴾
2 ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.[1]
[1] అల్-'అలఖతు: అంటే The Clot of Blood, Leech like substance, రక్తముద్ద, షిలగ, జలగ, పిండం, జీవకణం అనే అర్థాలున్నాయి.
خَلَقَ ٱلْإِنسَٰنَ مِنْ عَلَقٍ. ﴿2﴾
3 చదువు! మరియు నీ ప్రభువు పరమదాత. ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ. ﴿3﴾
4 ఆయన కలం ద్వారా నేర్పాడు.[1]
[1] ఖలమున్: కలం, అంటే చెక్కటం. మొదట కలమును చెక్కి తయారు చేసేవారు. మానవుని జ్ఞానంలో ఉంది - అతని వెంట వెళ్ళి పోతుంది. నోటితో పలికింది కూడా - దాచి పెట్టటానికి పనికి రాదు. కాని కలంతో వ్రాసి పెట్టింది చెడిపోకుండా భద్రంగా ఉంచితే చాలాకాలం వరకు ఉంటుంది. కలం వల్లనే ప్రాచీన జ్ఞానం భద్రపరచబడింది. కావున అల్లాహ్ (సు.తా.) మొట్టమొదట కలాన్ని సృష్టించి, దానితో పునరుత్థానదినం వరకు సర్వసృష్టి యొక్క విధిని వ్రాయించాడు.
ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ. ﴿4﴾
5 మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు. عَلَّمَ ٱلْإِنسَٰنَ مَا لَمْ يَعْلَمْ. ﴿5﴾
6 అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు. كَلَّآ إِنَّ ٱلْإِنسَٰنَ لَيَطْغَىٰٓ. ﴿6﴾
7 ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు. أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ. ﴿7﴾
8 నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది. إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ. ﴿8﴾
9 నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?[1]
[1] ఈ నిరోధించే వ్యక్తి అబూ-జహల్ అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.
أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ. ﴿9﴾
10 నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?[1]
[1] దాసుడు - ఇక్కడ దైవప్రవక్త ('స'అస).
عَبْدًا إِذَا صَلَّىٰٓ. ﴿10﴾
11 ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి? أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ. ﴿11﴾
12 ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?[1]
[1] తఖ్వా: దైవభీతి, భయభక్తి, ఖుర్ఆన్ అవతరణలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. ఏకదైవత్వాన్ని దృఢంగా విశ్వసించటం, భక్తిని, ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకే ప్రత్యేకించుకోవటం మరియు సత్కార్యాలు చేయటం.
أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ. ﴿12﴾
13 ఒకవేళ (ఆ నిరోధించే)[1] వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?
[1] ఈ నిరోధించే వ్యక్తి అబూ-జహల్ అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.
أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ. ﴿13﴾
14 వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా? أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ. ﴿14﴾
15 అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.[1]
[1] చూడండి, 11:56.
كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ. ﴿15﴾
16 అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు! نَاصِيَةٍۢ كَٰذِبَةٍ خَاطِئَةٍۢ. ﴿16﴾
17 అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను! فَلْيَدْعُ نَادِيَهُۥ. ﴿17﴾
18 మేము కూడా నరక దూతలను పిలుస్తాము! سَنَدْعُ ٱلزَّبَانِيَةَ. ﴿18﴾
19 అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు! كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب ۩. ﴿19﴾