Loading date... | Loading Hijri date... | Loading time...

القدر

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో[1] అవతరింపజేశాము.[2]
[1] ఈ రాత్రి 'రమదాన్ నెలలోని చివరి 10 రోజులలో బేసి రాత్రులలో ఒకటని, చాలా 'హదీస్'లు ఉన్నాయి. ఈ రాత్రిలో పూర్తి సంవత్సరపు తీర్మానాలు తీసుకోబడతాయి. ఈ రాత్రిలో చాలా మంది దైవదూత ('అలైహిమ్) లు దిగుతారు. చూడండి, 2:185. [2] ఏడవ ఆకాశం పైన ఉండే లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి మొదటి ఆకాశంలోఉండే బైతుల్ 'ఇ'జ్జహ్ లో దివ్యఖుర్ఆన్ ఖద్ర్ రాత్రిలో అవతరింపజేయబడింది. (ఇబ్నె-కసీ'ర్).
إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ. ﴿1﴾
2 మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు? وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ. ﴿2﴾
3 ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.[1]
[1] చూఈ రాత్రిలో చేసే ఆరాధన విలువ, వేయి నెలల కంటే ఎక్కువ అంటే 83 సంపత్సరాలు మరియు 4 నెలలు.
لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌۭ مِّنْ أَلْفِ شَهْرٍۢ. ﴿3﴾
4 ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[1], తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
[1] చూఅర్-రూ'హు: ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. చూడండి, 19:17 మరియు 78:38 అర్-రూ'హు ఈ మూడుచోట్లలో జిబ్రీల్ ('అ.స.) కొరకు వాడబడింది. ఇంకా చూడండి, 19:17 వ్యాఖ్యానం 1.
تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍۢ. ﴿4﴾
5 ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది. سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ. ﴿5﴾