البينة
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంత వరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్యతిరస్కారాన్ని) మానుకునేవారు కారు![1]
[1] అంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి ఒక సందేశహరుడు వచ్చి సరయిన, సమంజసమైన విషయాలు వ్రాయబడిన పరిశుద్ధ పుటలు చదివి విన్పించనంత వరకు వారు మానుకోరు.
|
لَمْ يَكُنِ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَٰبِ وَٱلْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ ٱلْبَيِّنَةُ. ﴿1﴾ |
|
2
అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు[1], వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు[2].
[1] చూము'హమ్మద్ ('స'అస).
[2] ఖుర్ఆన్.
|
رَسُولٌۭ مِّنَ ٱللَّهِ يَتْلُوا۟ صُحُفًۭا مُّطَهَّرَةًۭ. ﴿2﴾ |
|
3
అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి.[1]
[1] ధర్మశాసనాలు.
|
فِيهَا كُتُبٌۭ قَيِّمَةٌۭ. ﴿3﴾ |
|
4
మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు.[1]
[1] దైవప్రవక్త ('స'అస) రానున్నాడని వారి గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆ ప్రవక్త ('స'అస) అరబ్బులలో వచ్చాడని గ్రంథప్రజలు అసూయ పడి అతనిని తిరస్కరించారు. చూడండి, 3:19.
|
وَمَا تَفَرَّقَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَتْهُمُ ٱلْبَيِّنَةُ. ﴿4﴾ |
|
5
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో[1] తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము."
[1] 'హనీఫన్: వాలు, వంగు, మొగ్గు, ఒక వైపునకు మొగ్గటం ఏకాగ్రచిత్తం, ఏకదైవ సిద్ధాంతం. అంటే షిర్క్ నుండి తౌ'హీద్ కు, బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపునకు మరలటం. ఉదా: ఇబ్రాహీమ్ ('అ.స.) చేసినట్లు ఏకదైవారాధన మరియు సత్యధర్మాన్ని అనుసరించటం.
|
وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَيُؤْتُوا۟ ٱلزَّكَوٰةَ ۚ وَذَٰلِكَ دِينُ ٱلْقَيِّمَةِ. ﴿5﴾ |
|
6
నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.[1]
[1] ఇది అల్లాహ్ (సు.తా.) ప్రవక్త ('అలైహిమ్ స.)లను మరియు ఆయన గ్రంథాలను తిరస్కరించే వారి గతి. వారు అతి అధమమైన జీవులుగా పేర్కొనబడ్డారు.
|
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَٰبِ وَٱلْمُشْرِكِينَ فِى نَارِ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآ ۚ أُو۟لَٰٓئِكَ هُمْ شَرُّ ٱلْبَرِيَّةِ. ﴿6﴾ |
| 7 నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు. | إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ أُو۟لَٰٓئِكَ هُمْ خَيْرُ ٱلْبَرِيَّةِ. ﴿7﴾ |
|
8
వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుతాడు[1] మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం.
[1] చూడండి, 9:72.
|
جَزَآؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّٰتُ عَدْنٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدًۭا ۖ رَّضِىَ ٱللَّهُ عَنْهُمْ وَرَضُوا۟ عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِىَ رَبَّهُۥ. ﴿8﴾ |