الزلزلة
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు![1]
[1] ఇది మొదటి సారి బాకా ఊదబడినప్పుడు సంభవిస్తుంది.
|
إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا. ﴿1﴾ |
|
2
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు![1]
[1] ఇది రెండవసారి బాకా ఊదబడినప్పుడు జరుగుతుంది. ఆ రోజు భూమి తనలో పాతబడిన వారినంతా బయట వేస్తుంది. వారంతా సజీవులై లేచి బయటికి వస్తారు.
|
وَأَخْرَجَتِ ٱلْأَرْضُ أَثْقَالَهَا. ﴿2﴾ |
| 3 మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు. | وَقَالَ ٱلْإِنسَٰنُ مَا لَهَا. ﴿3﴾ |
|
4
ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.[1]
[1] దాని సమాచారాలు ఇలా ఉంటాయి, దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ప్రతివ్యక్తి భూమిపై చేసిన కర్మలన్నింటికీ, అది సాక్ష్యమిస్తుంది: 'ఈ ఈ వ్యక్తి ఈ ఈ కర్మలు, ఈ ఈ రోజులలో చేసాడని, తెలుపుతుంది.' " (తిర్మి'జీ, ముస్నద్ అ'హ్మద్-2/374).
|
يَوْمَئِذٍۢ تُحَدِّثُ أَخْبَارَهَا. ﴿4﴾ |
| 5 ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు. | بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا. ﴿5﴾ |
| 6 ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు. | يَوْمَئِذٍۢ يَصْدُرُ ٱلنَّاسُ أَشْتَاتًۭا لِّيُرَوْا۟ أَعْمَٰلَهُمْ. ﴿6﴾ |
|
7
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.[1]
[1] జ'ర్రతున్: దీనికి వేర్వేరు వ్యాఖ్యానాలు ఇవ్వబడ్డాయి. 1) చీమకంటే చిన్న వస్తువు - షౌకానీ. 2) మానవుడు భూమిపై చెయ్యికొట్టి పైకిలేపిన తరువాత దానికి అంటుకునే దుమ్ము. 3) ఒక రంధ్రం నుండి వచ్చే సూర్యకిరణాలలో తేలియాడుతూ కనిపించే ధూళి. 4) పరమాణువు.
|
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًۭا يَرَهُۥ. ﴿7﴾ |
| 8 మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. | وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍۢ شَرًّۭا يَرَهُۥ. ﴿8﴾ |