Wednesday, 12 August 2026 Hijri: 06:39:15 pm
MalayalamQuran.in
അധ്യായം 5. സൂറത്തുല്‍ മാഇദ (Ayath 42-45) കണ്ണിനു കണ്ണ്, കാതിന് കാത് — Islamonweb - : Quranonweb അധ്യായം 5. സൂറത്തുല്‍ മാഇദ (Ayath 37-41) മോഷ്ടിച്ചവന്‍റെ കൈ മുറിക്കണം — Islamonweb - : Quranonweb അധ്യായം 5. സൂറത്തുല്‍ മാഇദ (Ayath 32-36) വസീല - ഗുഹയില്‍ കുടുങ്ങിയ 3 പേര്‍ — Islamonweb - : Quranonweb തഫ്സീറുൽ ബൈളാവി: അവലംബം, ഉള്ളടക്കം, സമീപനംe — Islamonweb - : Tafseer തഫ്സീറുൽ കശ്ശാഫ്: പണ്ഡിതര്‍ എന്ത് പറയുന്നു? — Islamonweb - : Tafseer അൽ ജദീദ് ഫീ ഇഅ്ജാസിൽ ഖുർആൻ: ബൂഥ്വിയൻ ദർശനങ്ങളുടെ വിപ്ലവാത്മക രീതിശാസ്ത്രം — Islamonweb - : Tafseer ഹദീസ്: ഒരു സാമൂഹിക സമീപനം — Islamonweb - : Hadith ഹദീസ് സംരക്ഷണത്തിൽ അഹ്മദ് അലി സഹാറൻപൂരിയുടെ സംഭാവനകള്‍ — Islamonweb - : Hadith ഹദീസ് രംഗത്തെ മലബാറിന്റെ സംഭാവനകള്‍ — Islamonweb - : Hadith ഹംറാ അൽഅസദ്: പതറാത്ത വിശ്വാസത്തിന്റെ ചരിത്രസാക്ഷ്യം — Islamonweb - : Seerahonweb അധ്യായം 5. സൂറത്തുല്‍ മാഇദ (Ayath 42-45) കണ്ണിനു കണ്ണ്, കാതിന് കാത് — Islamonweb - : Quranonweb അധ്യായം 5. സൂറത്തുല്‍ മാഇദ (Ayath 37-41) മോഷ്ടിച്ചവന്‍റെ കൈ മുറിക്കണം — Islamonweb - : Quranonweb അധ്യായം 5. സൂറത്തുല്‍ മാഇദ (Ayath 32-36) വസീല - ഗുഹയില്‍ കുടുങ്ങിയ 3 പേര്‍ — Islamonweb - : Quranonweb തഫ്സീറുൽ ബൈളാവി: അവലംബം, ഉള്ളടക്കം, സമീപനംe — Islamonweb - : Tafseer തഫ്സീറുൽ കശ്ശാഫ്: പണ്ഡിതര്‍ എന്ത് പറയുന്നു? — Islamonweb - : Tafseer അൽ ജദീദ് ഫീ ഇഅ്ജാസിൽ ഖുർആൻ: ബൂഥ്വിയൻ ദർശനങ്ങളുടെ വിപ്ലവാത്മക രീതിശാസ്ത്രം — Islamonweb - : Tafseer ഹദീസ്: ഒരു സാമൂഹിക സമീപനം — Islamonweb - : Hadith ഹദീസ് സംരക്ഷണത്തിൽ അഹ്മദ് അലി സഹാറൻപൂരിയുടെ സംഭാവനകള്‍ — Islamonweb - : Hadith ഹദീസ് രംഗത്തെ മലബാറിന്റെ സംഭാവനകള്‍ — Islamonweb - : Hadith ഹംറാ അൽഅസദ്: പതറാത്ത വിശ്വാസത്തിന്റെ ചരിത്രസാക്ഷ്യം — Islamonweb - : Seerahonweb
Quran translation reader

അൽ ഹിജ്ർ الحجر Al-Hijr

Surah 15 മക്കിയ്യ • مكية • Makkiyah 99 ആയത്തുകൾ • 99 Ayahs

സൂറത്ത് അൽ ഹിജ്ർ (Al-Hijr), ഖുർആൻ അധ്യായം 15 — അറബി ആയത്തുകളും తెలుగు വിവർത്തനവും ഉൾപ്പെടെ 99 ആയത്തുകൾ വായിക്കുക. Read Surah Al-Hijr with Arabic text and తెలుగు translation.

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1

అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.[2]

الٓرۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ وَقُرۡءَانٖ مُّبِينٖ ۝١
2

సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు.

رُّبَمَا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡ كَانُواْ مُسۡلِمِينَ ۝٢
3

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.

ذَرۡهُمۡ يَأۡكُلُواْ وَيَتَمَتَّعُواْ وَيُلۡهِهِمُ ٱلۡأَمَلُۖ فَسَوۡفَ يَعۡلَمُونَ ۝٣
4

మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.[1]

وَمَآ أَهۡلَكۡنَا مِن قَرۡيَةٍ إِلَّا وَلَهَا كِتَابٞ مَّعۡلُومٞ ۝٤
5

ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు.[1]

مَّا تَسۡبِقُ مِنۡ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسۡتَـٔۡخِرُونَ ۝٥
6

మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు.

وَقَالُواْ يَٰٓأَيُّهَا ٱلَّذِي نُزِّلَ عَلَيۡهِ ٱلذِّكۡرُ إِنَّكَ لَمَجۡنُونٞ ۝٦
7

"నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు?"

لَّوۡمَا تَأۡتِينَا بِٱلۡمَلَٰٓئِكَةِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ ۝٧
8

మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు.[1]

مَا نُنَزِّلُ ٱلۡمَلَٰٓئِكَةَ إِلَّا بِٱلۡحَقِّ وَمَا كَانُوٓاْ إِذٗا مُّنظَرِينَ ۝٨
9

నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.[1]

إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ ۝٩
10

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము.

وَلَقَدۡ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ فِي شِيَعِ ٱلۡأَوَّلِينَ ۝١٠
11

మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు.[1]

وَمَا يَأۡتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ۝١١
12

ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము.

كَذَٰلِكَ نَسۡلُكُهُۥ فِي قُلُوبِ ٱلۡمُجۡرِمِينَ ۝١٢
13

వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.

لَا يُؤۡمِنُونَ بِهِۦ وَقَدۡ خَلَتۡ سُنَّةُ ٱلۡأَوَّلِينَ ۝١٣
14

మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ!

وَلَوۡ فَتَحۡنَا عَلَيۡهِم بَابٗا مِّنَ ٱلسَّمَآءِ فَظَلُّواْ فِيهِ يَعۡرُجُونَ ۝١٤
15

ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది."[1]

لَقَالُوٓاْ إِنَّمَا سُكِّرَتۡ أَبۡصَٰرُنَا بَلۡ نَحۡنُ قَوۡمٞ مَّسۡحُورُونَ ۝١٥
16

మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.

وَلَقَدۡ جَعَلۡنَا فِي ٱلسَّمَآءِ بُرُوجٗا وَزَيَّنَّٰهَا لِلنَّٰظِرِينَ ۝١٦
17

మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా [1]

وَحَفِظۡنَٰهَا مِن كُلِّ شَيۡطَٰنٖ رَّجِيمٍ ۝١٧
18

కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది.[1]

إِلَّا مَنِ ٱسۡتَرَقَ ٱلسَّمۡعَ فَأَتۡبَعَهُۥ شِهَابٞ مُّبِينٞ ۝١٨
19

మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము.

وَٱلۡأَرۡضَ مَدَدۡنَٰهَا وَأَلۡقَيۡنَا فِيهَا رَوَٰسِيَ وَأَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ شَيۡءٖ مَّوۡزُونٖ ۝١٩
20

మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.[1]

وَجَعَلۡنَا لَكُمۡ فِيهَا مَعَٰيِشَ وَمَن لَّسۡتُمۡ لَهُۥ بِرَٰزِقِينَ ۝٢٠
21

మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.

وَإِن مِّن شَيۡءٍ إِلَّا عِندَنَا خَزَآئِنُهُۥ وَمَا نُنَزِّلُهُۥٓ إِلَّا بِقَدَرٖ مَّعۡلُومٖ ۝٢١
22

మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!

وَأَرۡسَلۡنَا ٱلرِّيَٰحَ لَوَٰقِحَ فَأَنزَلۡنَا مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَسۡقَيۡنَٰكُمُوهُ وَمَآ أَنتُمۡ لَهُۥ بِخَٰزِنِينَ ۝٢٢
23

మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము.[1]

وَإِنَّا لَنَحۡنُ نُحۡيِۦ وَنُمِيتُ وَنَحۡنُ ٱلۡوَٰرِثُونَ ۝٢٣
24

మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.[1]

وَلَقَدۡ عَلِمۡنَا ٱلۡمُسۡتَقۡدِمِينَ مِنكُمۡ وَلَقَدۡ عَلِمۡنَا ٱلۡمُسۡتَـٔۡخِرِينَ ۝٢٤
25

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.

وَإِنَّ رَبَّكَ هُوَ يَحۡشُرُهُمۡۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٞ ۝٢٥
26

మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము.[1]

وَلَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ مِن صَلۡصَٰلٖ مِّنۡ حَمَإٖ مَّسۡنُونٖ ۝٢٦
27

మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము.[1]

وَٱلۡجَآنَّ خَلَقۡنَٰهُ مِن قَبۡلُ مِن نَّارِ ٱلسَّمُومِ ۝٢٧
28

మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.

وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَٰٓئِكَةِ إِنِّي خَٰلِقُۢ بَشَرٗا مِّن صَلۡصَٰلٖ مِّنۡ حَمَإٖ مَّسۡنُونٖ ۝٢٨
29

ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి."[1]

فَإِذَا سَوَّيۡتُهُۥ وَنَفَخۡتُ فِيهِ مِن رُّوحِي فَقَعُواْ لَهُۥ سَٰجِدِينَ ۝٢٩
30

అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు -

فَسَجَدَ ٱلۡمَلَٰٓئِكَةُ كُلُّهُمۡ أَجۡمَعُونَ ۝٣٠
31

ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు.[1]

إِلَّآ إِبۡلِيسَ أَبَىٰٓ أَن يَكُونَ مَعَ ٱلسَّٰجِدِينَ ۝٣١
32

(అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు?"

قَالَ يَٰٓإِبۡلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ ٱلسَّٰجِدِينَ ۝٣٢
33

(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను."

قَالَ لَمۡ أَكُن لِّأَسۡجُدَ لِبَشَرٍ خَلَقۡتَهُۥ مِن صَلۡصَٰلٖ مِّنۡ حَمَإٖ مَّسۡنُونٖ ۝٣٣
34

(అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు!

قَالَ فَٱخۡرُجۡ مِنۡهَا فَإِنَّكَ رَجِيمٞ ۝٣٤
35

మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది."

وَإِنَّ عَلَيۡكَ ٱللَّعۡنَةَ إِلَىٰ يَوۡمِ ٱلدِّينِ ۝٣٥
36

(ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు!"

قَالَ رَبِّ فَأَنظِرۡنِيٓ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ ۝٣٦
37

(అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు!

قَالَ فَإِنَّكَ مِنَ ٱلۡمُنظَرِينَ ۝٣٧
38

(నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు!"

إِلَىٰ يَوۡمِ ٱلۡوَقۡتِ ٱلۡمَعۡلُومِ ۝٣٨
39

(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను.

قَالَ رَبِّ بِمَآ أَغۡوَيۡتَنِي لَأُزَيِّنَنَّ لَهُمۡ فِي ٱلۡأَرۡضِ وَلَأُغۡوِيَنَّهُمۡ أَجۡمَعِينَ ۝٣٩
40

వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప!"

إِلَّا عِبَادَكَ مِنۡهُمُ ٱلۡمُخۡلَصِينَ ۝٤٠
41

(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.[1]

قَالَ هَٰذَا صِرَٰطٌ عَلَيَّ مُسۡتَقِيمٌ ۝٤١
42

నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప![1]

إِنَّ عِبَادِي لَيۡسَ لَكَ عَلَيۡهِمۡ سُلۡطَٰنٌ إِلَّا مَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلۡغَاوِينَ ۝٤٢
43

మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే!

وَإِنَّ جَهَنَّمَ لَمَوۡعِدُهُمۡ أَجۡمَعِينَ ۝٤٣
44

దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి.[1] వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు.

لَهَا سَبۡعَةُ أَبۡوَٰبٖ لِّكُلِّ بَابٖ مِّنۡهُمۡ جُزۡءٞ مَّقۡسُومٌ ۝٤٤
45

నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు.

إِنَّ ٱلۡمُتَّقِينَ فِي جَنَّٰتٖ وَعُيُونٍ ۝٤٥
46

వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు.

ٱدۡخُلُوهَا بِسَلَٰمٍ ءَامِنِينَ ۝٤٦
47

వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు.[1]

وَنَزَعۡنَا مَا فِي صُدُورِهِم مِّنۡ غِلٍّ إِخۡوَٰنًا عَلَىٰ سُرُرٖ مُّتَقَٰبِلِينَ ۝٤٧
48

అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు."

لَا يَمَسُّهُمۡ فِيهَا نَصَبٞ وَمَا هُم مِّنۡهَا بِمُخۡرَجِينَ ۝٤٨
49

నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.[1]

۞ نَبِّئۡ عِبَادِيٓ أَنِّيٓ أَنَا ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ۝٤٩
50

మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష!

وَأَنَّ عَذَابِي هُوَ ٱلۡعَذَابُ ٱلۡأَلِيمُ ۝٥٠
51

మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు.[1]

وَنَبِّئۡهُمۡ عَن ضَيۡفِ إِبۡرَٰهِيمَ ۝٥١
52

వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది."[1]

إِذۡ دَخَلُواْ عَلَيۡهِ فَقَالُواْ سَلَٰمٗا قَالَ إِنَّا مِنكُمۡ وَجِلُونَ ۝٥٢
53

వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము."

قَالُواْ لَا تَوۡجَلۡ إِنَّا نُبَشِّرُكَ بِغُلَٰمٍ عَلِيمٖ ۝٥٣
54

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు?"

قَالَ أَبَشَّرۡتُمُونِي عَلَىٰٓ أَن مَّسَّنِيَ ٱلۡكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ ۝٥٤
55

వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు."

قَالُواْ بَشَّرۡنَٰكَ بِٱلۡحَقِّ فَلَا تَكُن مِّنَ ٱلۡقَٰنِطِينَ ۝٥٥
56

(ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?"

قَالَ وَمَن يَقۡنَطُ مِن رَّحۡمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ ۝٥٦
57

(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?"

قَالَ فَمَا خَطۡبُكُمۡ أَيُّهَا ٱلۡمُرۡسَلُونَ ۝٥٧
58

వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము [1] -

قَالُوٓاْ إِنَّآ أُرۡسِلۡنَآ إِلَىٰ قَوۡمٖ مُّجۡرِمِينَ ۝٥٨
59

లూత్ ఇంటివారు[1] తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము;

إِلَّآ ءَالَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمۡ أَجۡمَعِينَ ۝٥٩
60

అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."[1]

إِلَّا ٱمۡرَأَتَهُۥ قَدَّرۡنَآ إِنَّهَا لَمِنَ ٱلۡغَٰبِرِينَ ۝٦٠
61

తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు;

فَلَمَّا جَآءَ ءَالَ لُوطٍ ٱلۡمُرۡسَلُونَ ۝٦١
62

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."[1]

قَالَ إِنَّكُمۡ قَوۡمٞ مُّنكَرُونَ ۝٦٢
63

వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.[1]

قَالُواْ بَلۡ جِئۡنَٰكَ بِمَا كَانُواْ فِيهِ يَمۡتَرُونَ ۝٦٣
64

మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.

وَأَتَيۡنَٰكَ بِٱلۡحَقِّ وَإِنَّا لَصَٰدِقُونَ ۝٦٤
65

కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి."

فَأَسۡرِ بِأَهۡلِكَ بِقِطۡعٖ مِّنَ ٱلَّيۡلِ وَٱتَّبِعۡ أَدۡبَٰرَهُمۡ وَلَا يَلۡتَفِتۡ مِنكُمۡ أَحَدٞ وَٱمۡضُواْ حَيۡثُ تُؤۡمَرُونَ ۝٦٥
66

మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు."

وَقَضَيۡنَآ إِلَيۡهِ ذَٰلِكَ ٱلۡأَمۡرَ أَنَّ دَابِرَ هَٰٓؤُلَآءِ مَقۡطُوعٞ مُّصۡبِحِينَ ۝٦٦
67

మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు.

وَجَآءَ أَهۡلُ ٱلۡمَدِينَةِ يَسۡتَبۡشِرُونَ ۝٦٧
68

(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.[1]

قَالَ إِنَّ هَٰٓؤُلَآءِ ضَيۡفِي فَلَا تَفۡضَحُونِ ۝٦٨
69

మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి."

وَٱتَّقُواْ ٱللَّهَ وَلَا تُخۡزُونِ ۝٦٩
70

వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా?"[1]

قَالُوٓاْ أَوَلَمۡ نَنۡهَكَ عَنِ ٱلۡعَٰلَمِينَ ۝٧٠
71

(లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు."[1]

قَالَ هَٰٓؤُلَآءِ بَنَاتِيٓ إِن كُنتُمۡ فَٰعِلِينَ ۝٧١
72

"నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు."[1] (అని దైవదూతలు అన్నారు.)

لَعَمۡرُكَ إِنَّهُمۡ لَفِي سَكۡرَتِهِمۡ يَعۡمَهُونَ ۝٧٢
73

ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది.

فَأَخَذَتۡهُمُ ٱلصَّيۡحَةُ مُشۡرِقِينَ ۝٧٣
74

తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము.

فَجَعَلۡنَا عَٰلِيَهَا سَافِلَهَا وَأَمۡطَرۡنَا عَلَيۡهِمۡ حِجَارَةٗ مِّن سِجِّيلٍ ۝٧٤
75

నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّلۡمُتَوَسِّمِينَ ۝٧٥
76

మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది.

وَإِنَّهَا لَبِسَبِيلٖ مُّقِيمٍ ۝٧٦
77

నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّلۡمُؤۡمِنِينَ ۝٧٧
78

మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.[1]

وَإِن كَانَ أَصۡحَٰبُ ٱلۡأَيۡكَةِ لَظَٰلِمِينَ ۝٧٨
79

కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి.[1]

فَٱنتَقَمۡنَا مِنۡهُمۡ وَإِنَّهُمَا لَبِإِمَامٖ مُّبِينٖ ۝٧٩
80

మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.[1]

وَلَقَدۡ كَذَّبَ أَصۡحَٰبُ ٱلۡحِجۡرِ ٱلۡمُرۡسَلِينَ ۝٨٠
81

మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు. [1]

وَءَاتَيۡنَٰهُمۡ ءَايَٰتِنَا فَكَانُواْ عَنۡهَا مُعۡرِضِينَ ۝٨١
82

మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు,[1] సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!

وَكَانُواْ يَنۡحِتُونَ مِنَ ٱلۡجِبَالِ بُيُوتًا ءَامِنِينَ ۝٨٢
83

చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది.

فَأَخَذَتۡهُمُ ٱلصَّيۡحَةُ مُصۡبِحِينَ ۝٨٣
84

అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది.

فَمَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يَكۡسِبُونَ ۝٨٤
85

మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే[1] సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు!

وَمَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَآ إِلَّا بِٱلۡحَقِّۗ وَإِنَّ ٱلسَّاعَةَ لَأٓتِيَةٞۖ فَٱصۡفَحِ ٱلصَّفۡحَ ٱلۡجَمِيلَ ۝٨٥
86

నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త,[1] సర్వజ్ఞుడు.[2]

إِنَّ رَبَّكَ هُوَ ٱلۡخَلَّٰقُ ٱلۡعَلِيمُ ۝٨٦
87

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.[1]

وَلَقَدۡ ءَاتَيۡنَٰكَ سَبۡعٗا مِّنَ ٱلۡمَثَانِي وَٱلۡقُرۡءَانَ ٱلۡعَظِيمَ ۝٨٧
88

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు.[1]

لَا تَمُدَّنَّ عَيۡنَيۡكَ إِلَىٰ مَا مَتَّعۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّنۡهُمۡ وَلَا تَحۡزَنۡ عَلَيۡهِمۡ وَٱخۡفِضۡ جَنَاحَكَ لِلۡمُؤۡمِنِينَ ۝٨٨
89

మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే!"

وَقُلۡ إِنِّيٓ أَنَا ٱلنَّذِيرُ ٱلۡمُبِينُ ۝٨٩
90

ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో![1]

كَمَآ أَنزَلۡنَا عَلَى ٱلۡمُقۡتَسِمِينَ ۝٩٠
91

ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో!

ٱلَّذِينَ جَعَلُواْ ٱلۡقُرۡءَانَ عِضِينَ ۝٩١
92

నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము;

فَوَرَبِّكَ لَنَسۡـَٔلَنَّهُمۡ أَجۡمَعِينَ ۝٩٢
93

వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి.

عَمَّا كَانُواْ يَعۡمَلُونَ ۝٩٣
94

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు.[1] మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు.

فَٱصۡدَعۡ بِمَا تُؤۡمَرُ وَأَعۡرِضۡ عَنِ ٱلۡمُشۡرِكِينَ ۝٩٤
95

నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు!

إِنَّا كَفَيۡنَٰكَ ٱلۡمُسۡتَهۡزِءِينَ ۝٩٥
96

ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు.

ٱلَّذِينَ يَجۡعَلُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَۚ فَسَوۡفَ يَعۡلَمُونَ ۝٩٦
97

మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు.

وَلَقَدۡ نَعۡلَمُ أَنَّكَ يَضِيقُ صَدۡرُكَ بِمَا يَقُولُونَ ۝٩٧
98

కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు.

فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ وَكُن مِّنَ ٱلسَّٰجِدِينَ ۝٩٨
99

మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.[1]

وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ ۝٩٩